MG Astor : ఇండియాలోకి ఎంజీ మోటార్​ కొత్త ఎస్​యూవీ.. ఇదే ఆస్టర్​ ఫేస్​లిఫ్ట్​?-mg motor to launch astor facelift soon new suv called vs spotted in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mg Astor : ఇండియాలోకి ఎంజీ మోటార్​ కొత్త ఎస్​యూవీ.. ఇదే ఆస్టర్​ ఫేస్​లిఫ్ట్​?

MG Astor : ఇండియాలోకి ఎంజీ మోటార్​ కొత్త ఎస్​యూవీ.. ఇదే ఆస్టర్​ ఫేస్​లిఫ్ట్​?

Sharath Chitturi HT Telugu
May 21, 2024 01:30 PM IST

MG Astor facelift : అంతర్జాతీయ మార్కెట్​లో ఎంజీ వీఎస్​ పేరుతో ఎంజీ మోటార్​ విక్రయిస్తున్న ఎస్​యూవీ.. భారతీయ రోడ్లపై దర్శనమిచ్చింది. ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​గా ఉన్న ఆస్టర్​ ఎస్​యూవీకి ఇది ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని టాక్​ నడుస్తోంది.

ఎంజీ మోటార్​ కొత్త ఎస్​యూవీ..
ఎంజీ మోటార్​ కొత్త ఎస్​యూవీ..

MG Astor facelift 2024 : ఇండియాలో ఎంజీ మోటార్​కు బెస్ట్​ సెల్లింగ్​ వెహికిల్స్​లో ఎంజీ ఆస్టర్​ ఎస్​యూవీ ఒకటి. దీనికి.. ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ రాబోతోందని గత కొంతకాలంగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. వీటన్నింటి మధ్య.. ఎంజీ మోటార్​కు చెందిన ఓ కొత్త ఎస్​యూవీ.. ఇండియా రోడ్లపై దర్శనమిచ్చింది. ఆస్టర్ ఫేస్​లిఫ్ట్ ఎస్​యూవీ లాంచ్ టైమ్​లైన్​పై ఇంకా అధికారిక ప్రకటన లేదు. కానీ.. కొత్తగా కనిపించిన ఎస్​యూవీనే ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ అని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంజీ మోటార్​ కొత్త ఎస్​యూవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఎంజీ ఆస్టర్​ ఫేస్​లిఫ్ట్​..!

ఇండియాలో కొత్తగా దర్శనమిచ్చిన ఎంజీ ఎస్​యూవీని.. ‘వీఎస్​’ పేరుతో అంతర్జాతీయ మార్కెట్​లో విక్రయిస్తోంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఈ ఎంజీ విఎస్ ఎస్​యూవీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్​ అయ్యాయి. ఇండోనేషియా, థాయ్​లాండ్ వంటి మార్కెట్లలో విక్రయించే ఈ ఎస్​యూవీని రెండేళ్ల క్రితం లాంచ్ చేశారు. ఇది 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్​ను కలిగి ఉంది. ఇది ప్రస్తుతం భారతదేశంలో ఆస్టర్​లో అందిస్తున్నంత శక్తివంతమైనది. 2.13 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీతో కలిపిన ఇంజిన్ సుమారుగా 17బీహెచ్​పీ పవర్, 142 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్​మిషన్ వర్క్​ కోసం ఈ-సివిటి గేర్ బాక్స్ ఉంది.

MG VS hybrid launch date in India : భారతదేశంలో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు ఎంజీ మోటార్ ఇంతకు ముందు ప్రకటించింది. భారతదేశంలోని జేఎస్​డబ్ల్యూ గ్రూప్​తో కార్ల తయారీదారు అధికారికంగా జాయింట్ వెంచర్​లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారును త్వరలో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపింది ఎంజీ మోటార్​. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ వాహనాలు వంటి కొత్త ఇంధన వాహనాలపై మరింత దృష్టి పెట్టాలని జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన ప్రణాళికలను స్పష్టం చేసింది. హైబ్రిడ్ ఇంజిన్​తో కూడిన ఆస్టర్ ఫేస్​లిఫ్ట్​.. ఆ దిశగా మొదటి అడుగు కావచ్చని అంచనాలు ఉన్నాయి.

డిజైన్ పరంగా చూసుకుంటే.. ఎంజీ వీఎస్ ఎస్​యూవీ స్పోర్టీ ఫ్రంట్ ఫేస్, స్లీక్ ఎల్ఈడీ హెడ్​లైట్త, డిఆర్​ఎల్ యూనిట్లు, క్లోజ్డ్ గ్రిల్, పెద్ద ఎయిర్ ఇన్​టేక్​లతో వస్తుంది. అలాయ్​ డీజైన్డ్​ వీల్స్​ ప్రస్తుతం ఆస్టర్​ ఎస్​యూవీలో కనిపించే వాటి కంటే భిన్నంగా ఉంటాయి. ఈ డిజైన్ ఎలిమెంట్స్​లో కొన్నింటిని ఆస్టర్ ఫేస్​లిఫ్ట్ లో కూడా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. రాబోయే ఆస్టర్ ఫేస్​లిఫ్ట్​లో ఇంటీరియర్ డ్యూయెల్ డిస్ ప్లే, కొత్త గేర్ లివర్, కొత్త స్టీరింగ్ వీల్ సెటప్, అదనపు ఫీచర్లు వంటి మార్పులు కనిపించే అవకాశం ఉంది.

MG Astor on road price in India : ఎంజీ ఆస్టర్ ఎస్​యూవీ.. ప్రస్తుతం భారతదేశంలో రెండు ఇంజిన్ ఆప్షన్లు, 13 వేరియంట్లలో అందుబాటులో ఉంది. భారతదేశంలో తన సెగ్మెంట్​లో ఏడీఏఎస్ టెక్నాలజీని అందిస్తున్న మొదటి ఎస్​యూవీ ఇది. ఇందులో 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.3-లీటర్ టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి. ఆస్టర్ ఎస్​యూవీ ధర రూ.9.98 లక్షల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్ వర్షెన్ ధర రూ.17.90 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. కార్ల తయారీదారు ఇటీవల ఆస్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్​ను రూ .14.48 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ప్రవేశపెట్టింది. ఇది ఆల్-బ్లాక్ థీమ్ తో వస్తుంది.

ఎంజీ ఆస్టర్​కి ఫేస్​లిఫ్ట్​గా భావిస్తున్న ఎంజీ మోటార్​ కొత్త ఎస్​యూవీపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత కథనం