Nissan Magnite facelift : నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​.. లాంచ్​కు రెడీ!-nissan magnite facelift set to launch in india check expected changes here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nissan Magnite Facelift : నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​.. లాంచ్​కు రెడీ!

Nissan Magnite facelift : నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​.. లాంచ్​కు రెడీ!

Sharath Chitturi HT Telugu
May 19, 2024 06:05 PM IST

Nissan Magnite facelift launch date : నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​.. ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​ వచ్చేస్తోంది..
నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​ వచ్చేస్తోంది..

Nissan Magnite facelift launch in India : ఇండియాలో నిస్సాన్​కు బెస్ట్​ సెల్లింగ్​గా ఉన్న మాగ్నైట్​ ఎస్​యూవీకి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని సిద్ధం చేస్తోంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. భారత రోడ్లపై ఈ మోడల్​ టెస్ట్​ డ్రైవ్​ చేస్తూ పలుమార్లు కనిపించింది. త్వరలోనే ఈ నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​..

నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​ ఎస్​యూవీ ఇంటీరియర్​లో మార్పులు చాలా తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. కొత్త వేరియంట్​తో పాటు కొన్ని అదనపు ఫీచర్స్​ వస్తాయని సమాచారం. అయితే.. ఓవరాల్​ డాష్​బోర్డ్​ డిజైన్​ కూడా పెద్దగా మారకపోవచ్చు.

Nissan Magnite facelift 2024 : వీటితో పాటు.. ఎగుమతుల కోసం నిస్సాన్​ మాగ్నైట్​ ఎస్​యూవీలో లెఫ్ట్​ హ్యాండ్​ డ్రైవింగ్​ వర్షెన్​లను కూడా తయారు చేసేందుకు సంస్థ రెడీ అవుతోంది. విదేశాలకు ఎగుమతి చేసేందుకే ఈ ఏర్పాట్లు చేసుకుంటోంది. మొత్తం మీద.. వార్షికంగా 25వేల నుంచి 30వేల యూనిట్​లను సిద్ధం చేయాలని సంస్థ ప్లాన్​ చేస్తోందట.

నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​- ఇంజిన్​..

ప్రస్తుతం ఉన్న మోడల్​లోని ఇంజిన్​ని నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​లో కూడా వాడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఎస్​యూవీలో 1.0 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంది. ఇది.. 72 హెచ్​పీ పవర్​ని, 96 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇక టర్బో వర్షెన్​ ఇంజిన్​.. 100 హెచ్​పీ పవర్​ని 160 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్​ మేన్యువల్​, ఏఎంటీ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఇవే.. అప్డేటెడ్​ వర్షెన్​లోనూ కొనసాగొచ్చు.

నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​- ధర ఎంత?

Nissan Magnite facelift price in India : నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. అయిుతే.. ప్రస్తుతం ఉన్న వర్షెన్​తో పోల్చితే, ఫేస్​లిఫ్ట్​ ఎస్​యూవీ ధర కాస్త ఎక్కువగానే ఉండొచ్చు. ప్రస్తుతం.. ఇండియాలో నిస్సాన్​ మాగ్నైట్​ ఎక్స్​షోరూం ధర రూ. 6లక్షల వద్ద ప్రారంభమవుతుంది.

ఇక.. ఈ నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​ ఎస్​యూవీ లాంచ్​ ఎప్పుడు? అన్నది సంస్థ వెల్లడించలేదు. మార్కెట్​ వర్గాల అంచనాల ప్రకారం.. ఈ ఎస్​యూవీ 2025 తొలినాళ్లల్లో లాంచ్​ అవుతుంది.

ఈ వ్యవహారంపై సంస్థ త్వరలోనే ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.

స్కోడా కొత్త ఎస్​యూవీ..

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎస్​యూవీ సెగ్మెంట్​కు కనిపిస్తున్న డిమాండ్​ని క్యాష్​ చేసుకునేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. వీటిల్లో స్కోడా సంస్థ కూడా ఉంది. స్కోడా ఆటో ఇండియా.. సరికొత్త సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్​యూవీని లాంచ్​ చేసేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతానికి, కొత్త కాంపాక్ట్ ఎస్​యూవీ పేరు ఖరారు కాలేదు కానీ ఈ వాహనం స్పై షాట్లు ఇంటర్నెట్​లో కనిపించడం ప్రారంభించాయి. ఈ స్కోడా కొత్త కాంపాక్ట్ ఎస్​యూవీ టెస్ట్​ డ్రైవర్​ చేస్తూ.. ఇటీవల భారత రోడ్లపై కనిపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్స్​లో అందుబాటులో ఉంది! ఆటోమొబైల్​ ప్రపంచం నుంచి ఎటువంటి అప్​డేట్​ని మీరు మిస్ కాకుండా ఉండటానికి హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఇప్పుడే సబ్​స్క్రైబ్​ చేసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం