Mahindra Scorpio EV : మహీంద్రా స్కార్పియోకి 'ఈవీ' టచ్​.. లాంచ్​ ఎప్పుడంటే..-mahindra set to launch bolero and scorpio electric suvs ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Scorpio Ev : మహీంద్రా స్కార్పియోకి 'ఈవీ' టచ్​.. లాంచ్​ ఎప్పుడంటే..

Mahindra Scorpio EV : మహీంద్రా స్కార్పియోకి 'ఈవీ' టచ్​.. లాంచ్​ ఎప్పుడంటే..

Sharath Chitturi HT Telugu
Jun 15, 2024 07:22 AM IST

Mahindra Scorpio EV launch : మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ.. ఒక క్రేజీ అప్డేట్​ ఇచ్చింది. స్కార్పియోతో పాటు బొలేరే ఎస్​యూవీలకు ఈవీ టచ్​ ఇస్తున్నట్టు పేర్కొంది.

మహీంద్రా స్కార్పియోకి 'ఈవీ' టచ్​..
మహీంద్రా స్కార్పియోకి 'ఈవీ' టచ్​..

Mahindra Scorpio EV : ఎస్​యూవీలకు కేరాఫ్​ అడ్రెస్​గా మారిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రా నుంచి క్రేజీ అప్డేట్​! తన ఈవీ లైనప్​ని శక్తివంతంగా మార్చేందుకు కృషి చేస్తున్న ఈ ఆటోమొబైల్​ సంస్థ.. ఇప్పుడు స్కార్పియో, బొలేరో వంటి ప్రసిద్ధి చెందిన ఎస్​యూవీలకు ఎలక్ట్రిక్​ వర్షెన్​ని తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు.. ఇన్​వెస్టర్స్​ ప్రెజెంటేషన్​లో భాగంగా.. మహీంద్రా ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​, సీఈఓ (ఆటో, ఫార్మ్​ సెక్టార్​).. రాజేశ్​ జెజురికర్​ ఈ విషయాన్ని వెల్లడించారు.

మహీంద్రా స్కార్పియో ఈవీ.. లాంచ్​ ఎప్పుడు?

మహీంద్రా స్కార్పియో ఈవీకి స్కార్పియో.ఈ అని పేరు పెట్టింది సంస్థ. ఇక బొలేరో ఎలక్ట్రిక్​ వర్షెన్​కి బొలేరో.ఈ ని పేరును ఫిక్స్​ చేసింది. 2030 నాటికి మొత్తం 7 ఈవీలను లాంచ్​ చేయాలని టార్గెట్​గా పెట్టుకుంది మహీంద్రా అండ్​ మహీంద్రా. ఈ మహీంద్రా.ఈ, బొలేరో.ఈ కూడా.. ఆ 7 ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో భాగమే.

అయితే.. కొత్తగా లాంచ్​ అయ్యే మహీంద్రా స్కార్పియో ఈవీ, బొలేరో ఈవీలకు ల్యాడర్​ ఫ్రేమ్​ ఛాసిస్​ ఉండదట.

Mahindra Bolero EV : బెస్ట్​ సెల్లింగ్​ ఎక్స్​యూవీ700, మహీంద్రా థార్​లలో కూడా ఎలక్ట్రిక్​ వర్షెన్​ని తీసుకొచ్చేందుకు సంస్థ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

మహీంద్ర థార్​ ఈవీని కొంత కాలం క్రితమే సంస్థ ఆవిష్కరించింది. ఇందులో 109 హెచ్​పీ పవర్​/ 135 ఎన్​ఎం టార్క్​ ఫ్రెంట్​ మోటార్​- 286 హెచ్​పీ పవర్​/ 535 ఎన్​ఎమ్​ టార్క్​ రేర్​ మోటార్​తో కూడిన ఆల్​ వీల్​ డ్రైవ్​ సెటప్​ ఉండనుంది. ఐఎన్​జీఎల్​ఓ ప్లాట్​ఫామ్​పై దీనిని రూపొందిస్తోంది. స్కార్పియో, బొలేరో ఈవీలకు కూడా ఇదే ప్లాట్​ఫామ్​ని వాడే అవకాశం ఉంది.

ఈ ప్లాట్​ఫామ్​ ద్వారా.. 2775ఎంఎం- 2975ఎంఎం వీల్​బేస్​ ఉన్న వెహికిల్స్​ని రెడీ చేయొచ్చు. బొలేరో ప్రస్తుత వీల్​బస 2,6800ఎంఎంగాను, స్కార్పియో వీల్​బేస్​ 2,7500ఎంఎంగాను ఉంది.

Mahindra Thar EV launch date in India : ఇక ఈ స్కార్పియో ఈవీ, బొలేరో ఈవీల్లో వాడే బ్యాటరీ, రేంజ్​లపై క్లారిటీ లేదు. కానీ.. ఈ ఐఎన్​జీఎల్ ప్లాట్​ఫామ్​పై రూపొందించే వెహికిల్స్​లో 60 కేడబ్ల్యూహెచ్​, 80 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్స్​ని ఫిట్​ చేయొచ్చు అని తెలుస్తోంది. వీటి రేంజ్​.. 325 కి.మీ- 450కి.మీ మధ్యలో ఉంటుంది.

కానీ..​ స్కార్పియో ఈవీ, బొలేరో ఈవీల బ్యాటరీ వివరాలు తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే అంటున్నాయి మార్కెట్​ వర్గాలు.

మహీంద్రా ఎక్స్​యూవీ700 కి 'ఈవీ' టచ్..

Mahindra Xuv700 EV : టాటా మోటార్స్​ ఆధిపత్యం అధికంగా ఉన్న భారత ఈవీ సెగ్మెంట్​లో మహీంద్రా అండ్​ మహీంద్రాకు ఇప్పటివరకు ఒక్కటే ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఉంది. అది.. ఎక్స్​యూవీ400 ఈవీ. అయితే.. 4,5 ఈవీలను సంస్థ సిద్ధం చేస్తోంది. వీటిల్లో ఒకటి.. ఎక్స్​యూవీ700.

ఎక్స్​యూవీ 700 ఐసీఈ ఇంజిన్​కి ఎలక్ట్రిక్​ వర్షెన్​గా వస్తున్న ఈ కొత్త వెహికిల్​.. ఎక్స్​యూవీ.ఈ8 గా మార్కెట్​లో లాంచ్​ అయ్యే అవకాశం ఉంది. ఆన్​లైన్​లో లీక్​ అయిన స్పై షాట్స్​ ప్రకారం.. డిజైన్​లో కూడా.. ఈ ఈవీ వర్షెన్​, ఐసీఈ మోడల్​తోనే పోలి ఉంటుంది. ఫలితంగా.. సంస్థకు డెవలప్​మెంట్​, ప్రొడక్షన్​ కాస్ట్​ తగ్గుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం