BNCAP crash test : భారత్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో ఈ టాటా ఈవీలకు 5 స్టార్​ రేటింగ్​..-tata nexon ev punch ev score five star ratings in bncap crash test ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bncap Crash Test : భారత్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో ఈ టాటా ఈవీలకు 5 స్టార్​ రేటింగ్​..

BNCAP crash test : భారత్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో ఈ టాటా ఈవీలకు 5 స్టార్​ రేటింగ్​..

Sharath Chitturi HT Telugu
Jun 14, 2024 12:53 PM IST

BNCAP crash test : భారత్ ఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్లో టాటా నెక్సాన్ ఈవీ, టాటా పంచ్ ఈవీ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్స్ సాధించాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి.

అదరగొట్టిన టాటా పంచ్​ ఈవీ, టాటా నెక్సాన్​ ఈవీ
అదరగొట్టిన టాటా పంచ్​ ఈవీ, టాటా నెక్సాన్​ ఈవీ

Tata Nexon EV BNCAP crash test results : ప్యాసింజర్​ సేఫ్టీలో టాటా కార్లపై నమ్మకం మరింత పెరిగింది! భారత్ ఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్​లో టాటా నెక్సాన్ ఈవీ, టాటా పంచ్ ఈవీలు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్స్ సాధించాయి. టాటా మోటార్స్ నుంచి వచ్చిన ఈ రెండు ఎలక్ట్రిక్ ఎస్​యూవీలు అడల్ట్​- చైల్డ్​ సేఫటీ విభాగాల్లో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్​లను సాధించాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ ఎస్​యూవీలు వాటి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఆధారిత వేరియంట్లతో పాటు అమ్మకానికి వచ్చాయి. కొత్త సఫారీ, హారియర్ ఎస్​యూవీలకు భారత్ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​ ఇప్పటికే జరగ్గా.. అవి కూడా ఫైవ్ స్టార్ రేటింగ్స్ సంపాదించుకున్నాయి.

టాటా నెక్సాన్ ఈవీ, టాటా పంచ్ ఈవీ రెండూ స్వదేశీ వాహన తయారీదారు యాక్టి.ఈవీ ప్లాట్​ఫామ్​పై రూపొందించడం జరిగింది. ఇవి రాబోయే రెండేళ్లలో బ్రాండ్ నుంచి అనేక కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతు ఇస్తాయని సంస్థ పేర్కొంది. వీటిలో మోస్ట్ అవైటెడ్ కర్వ్, సియెర్రా ఎలక్ట్రిక్ ఎస్​యూవీలు ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఈవీ..

TATA Punch EV safety test results : అడల్ట్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్, చైల్డ్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ విభాగాల్లో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది బెస్ట్​ సెల్లింగ్​ టాటా నెక్సాన్​ ఈవీ. లాంచ్ అయినప్పటి నుంచి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ.. అడల్ట్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 32.00 పాయింట్లకు గాను 29.86 పాయింట్లు సాధించింది. ఫ్రంటల్ ఆఫ్సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్​లో 16.00 పాయింట్లకు గాను 14.26 పాయింట్లు సాధించగా, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్​లో ఈ ఎస్​యూవీ 16.00 పాయింట్లకు గాను 15.60 పాయింట్లు సాధించింది. చైల్డ్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ విభాగంలో ఈ ఎస్​యూవీ 49 పాయింట్లకు గాను 44.95 పాయింట్లు సాధించింది.

టాటా పంచ్ ఈవీ..

Tata Punch EV on road price in Hyderabad : దేశీయ ఆటోమొబైల్ సంస్థ నుంచి ఇటీవలే లాంచ్​ అయిన ఎలక్ట్రిక్ కారుగా టాటా పంచ్ ఈవీ నిలిచింది. ఇది కూడా భారత్ ఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్​లో.. టాటా నెక్సాన్ ఈవితో పాటు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్​ను సాధించింది. నెక్సాన్ ఈవీ మాదిరిగానే, పంచ్ ఈవీ కూడా అడల్ట్​- చైల్డ్​ ప్రొటక్షన్​ విభాగాల్లో ఫైవ్-స్టార్ సేఫ్టీ రేటింగ్స్​ను సాధించింది. టాటా పంచ్ ఈవీ అడల్ట్​ ప్యాసింజర్​ రక్షణ కోసం 32 పాయింట్లకు గాను 31.46 పాయింట్లు, పిల్లల రక్షణ కోసం 49 పాయింట్లకు గాను 45.00 పాయింట్లు సాధించింది.

టాటా పంచ్ ఈవీ అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్​, ఈఎస్​సీ వంటి భద్రతా పరికరాలను స్టాండర్డ్​గా కలిగి ఉంది. ఎస్​యూవీలో అదనపు భద్రతా ఫీచర్లలో బ్లైండ్ స్పాట్ మానిటర్, ఐసోఫిక్స్ మౌంట్స్, అన్ని సీట్లకు మూడు పాయింట్ల సీట్ బెల్ట్​లు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం