Tata Motors car sales : కార్ సేల్స్‌లో అదరగొట్టిన ఎం అండ్ ఎం.. టాటా మోటార్స్ కూడా!
01 February 2023, 17:51 IST
Tata Motors car sales in January: టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా జనవరి కార్ సేల్స్ డేటాలు విడుదలయ్యాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కార్ సేల్స్ ఎలా ఉన్నాయంటే..
Tata Motors car sales in January : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్.. జనవరి నెలకు సంబంధించిన వాహనాల విక్రయాల డేటాను బుధవారం విడుదల చేసింది. 2023 తొలి నెలలో మొత్తం మీద 48,289 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది టాటా మోటార్స్. గతేడాది ఇదే నెల (40,942)తో పోల్చుకుంటే అది 18శాతం ఎక్కువగా ఉంది.
తాజాగా విడుదల చేసిన డేటాలో.. టాటా మోటార్స్‌కు సంబంధించిన డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్యాసింజర్ వెహికిల్స్‌తో పాటు ఎలక్ట్రిక వాహనాల నెంబర్లు కూడా ఉన్నాయి.
Tata Motors car sales data : డొమెస్టిక్ మార్కెట్లో జనవరిలో 47,987 యూనిట్‌ను సేల్ చేసింది టాటా మోటార్స్. ఎలక్ట్రిక్ కార్లు కూడా వీటిల్లో భాగమే. గతేడాది ఇదే సమయంలో డొమెస్టిక్ వాహనాల విక్రయాల సంఖ్య 40,777గా ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లోకి గత నెలలో 302 యూనిట్లను ఎగుమతి చేసింది టాటా మోటార్స్. గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 165 యూనిట్లుగా ఉంది. అంతే 83శాతం వృద్ధిని సాధించినట్టు!
Tata Motors price hike : టాటా మోటార్స్ వాహనాల ధరలు పెరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్.. డొమెస్టిక్- ఇంటర్నేషనల్ నెంబర్లను కలుపుకుని, మొత్తం మీద సేల్స్ 39శాతం వృద్ధిచెందింది. 2023 జనవరిలో 4,133 ఈవీలను సేల్ చేసినట్టు దిగ్గజ ఆటో సంస్థ వెల్లడించింది. గతేడాది జనవరిలో ఈ సంఖ్య 2,982 యూనిట్లుగా ఉంది.
మహీంద్రా అండ్ మహీంద్రా..
Mahindra and Mahindra car sales : మరో దిగ్గజ ఆటో సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా దుమ్మురేపింది! జనవరి నెలలో 64,335 యూనిట్లను విక్రయించింది. ఒక్క యుటిలిటీ వెహికిల్ సెగ్మెంట్లో 32,915 ఎస్‌యూవీలను విక్రయించింది ఎం ఆండ్ ఎం. గతేడాది ఇదే సమయంతో (19,848) పోల్చుకుంటే ఇది 66శాతం వృద్ధిచెందినట్టు! క్రాష్ సెన్సార్ సప్లై చెయిన్‌లో ఇబ్బందులు, సెమీకండక్టర్ల కొరత వంటి సమస్యలు వెంటాడుతున్నా.. ఈ స్థాయిలో వెహికిల్స్ అమ్ముడుపోవడం విశేషం.
Kia Motors January sales పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కమర్షియల్ వెహికిల్ సెగ్మెంట్లో 21,724 వాహనాలను విక్రయించింది. ప్యాసింజర్ వెహికిల్ సెగ్మెంట్లో 33,040 యూనిట్లను సేల్ చేసింది. ఇక విదేశాలకు 3009 యూనిట్లను ఎగుమతి చేసింది ఈ ఆటో సంస్థ. గతేడాది ఈ సంఖ్య 2,865గా ఉంది.
"థార్ ఆర్డబ్ల్యూడీ, ఎక్స్‌యూవీ400 వంటి లాంచ్‌లు విజయవంతమయ్యాయి. 2023 తొలి నెలలో కస్టమర్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. యుటిలిటీ వెహికిల్ సెగ్మెంట్లో 66శాతం వృద్ధి నమోదుకావడం విశేషం," అని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా తెలిపారు.