Budget 2023 : నిర్మలమ్మ ‘పద్దు’.. ఆటో పరిశ్రమ అంచనాలను అందుకుందా?
Auto Industry Budget 2023 : బడ్జెట్ ప్రసంగంలో దేశ ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు నిర్మలా సీతారామన్. మరి అవి.. పరిశ్రమ వర్గాల అంచనాలను అందుకున్నాయో లేదో తెలుసుకుందాము.
Auto Industry Budget 2023 : భారత దేశ ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి.. బడ్జెట్ 2023లో పలు కీలక ప్రకటనలు చేశారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ప్రత్యక్ష పన్ను ప్రతిపాదనలు, ఈవీ బ్యాటరీ, హైడ్రోజెన్ ఫ్లూయెల్ వంటి అంశాల్లో ఆటోమొబైల్ పరిశ్రమకు కేంద్రం నుంచి శుభవార్తలు వినిపించాయి!
ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయి..!
ఆటోమొబైల్ పరిశ్రమకు భారీగా ఊరట కలిగించిన విషయం.. ఈవీ బ్యాటరీతో ముడిపడి ఉంది. లిథియం-ఐయన్ బ్యాటరీ తయారీ కోసం దిగుమతు చేసుకుంటున్న వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఫలితంగా.. ఇండియాలో తయారవుతున్న ఎలక్ట్రిక వాహనాల ధరలు రానున్న కాలంలో మరింత తగ్గుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Budget 2023 : అదే సమయంలో లిథియం- ఐయాన్ బ్యాటరీ సెల్స్‌పై ప్రస్తుతం ఉన్న కన్సెసషనల్ డ్యూటీని మరో ఏడాది కాలం వరకు పొడిగిస్తున్నట్టు స్పష్టం చేశారు కేంద్ర ఆర్థికమంత్రి.
తాను చేస్తున్న పరోక్ష పన్ను (ఇండైరెక్ట్ ట్యాక్స్) ప్రతిపాదనలు.. గ్రీన్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ వెహికిల్ సెగ్మెంట్లకు ఉపయోగపతాయని వ్యాఖ్యానించారు నిర్మలా సీతారామన్.
Budget 2023 live updates : "గ్రీన్ మొబిలిటీపై కేంద్రం దృష్టిపెట్టింది. నేషనల్ హైడ్రోజన్ మిషన్ కోసం రూ. 19,700కోట్లను కేటాయిస్తోంది ప్రభుత్వం. 2030నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని అందుకోవడమే లక్ష్యంగా ఈ కేటాయింపులు చేస్తోంది. 2070 నాటికి నెట్-జీరో కార్బన్ ఎమిషన్‌ను అందుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. లో కార్బన్ ఇంటెన్సిటీతో పాటు శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించుకునేందుకు మా ప్రభుత్వం చర్యలు ఉపయోగపడతాయి. ఫలితంగా.. దేశంలో హైడ్రోజెన్ ఫ్యూయెల్ మొబిలిటీకి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆటో పరిశ్రమ కూడా దీని గురించే ఎంతో కాలంగా ఎదురుచూస్తోంది," అని స్పష్టం చేశారు నిర్మల.
గ్రీన్ మొబిలిటీపై కేంద్రం చెప్పిన మాటలను సరిగ్గా అమలు చేస్తే.. భవిష్యత్తులో సీఎన్జీ, విద్యుత్, ఇథనాల్, హైడ్రోజెన్ వంటి మిక్స్డ్ ఫ్యూయెల్స్కు సంబంధించిన వాహనాల విక్రయాలు ఊపందుకుంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఆటో పరిశ్రమకు పరోక్ష మద్దతు..
Indian Auto Industry Budget 2023 : వ్యవసాయం, టెక్స్‌టైల్‌ను మినహాయించి.. ఇతర వస్తువుల బేసిక్ కస్టమ్స్ డూటీని 21శాతం నుంచి 13శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్రం చెప్పడంతో.. దేశీయంగా ఆటోమొబైల్ సేల్స్ పెరగొచ్చు. మరోవైపు ఆటోమొబైల్స్ సెస్, కస్టమ్స్ డ్యూటీ, సర్‌ఛార్జీల్లో స్వల్పంగా మార్పులు చోటుచేసుకుంటాని వివరించారు నిర్మలా సీతారామన్.
ఇక ఆదాయపు పన్ను శ్లాబ్‌లను మార్చుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం కూడా ఆటోమొబైల్ పరిశ్రమకు ఉపయోగపడనుంది! రూ.7లక్షల వరకు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదని నిర్మల చెప్పడంతో.. దేశీయంగా ఆటో సేల్స్ పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పర్సనల్ వెహికిల్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్న మధ్యతరగతి ప్రజలకు ఈ పన్ను మినహాయింపు.. ప్రోత్సాన్ని ఇస్తుందని ఆశాభావంలో ఉన్నాయి.
Indian Auto Industry latest news : అయిత.. పూర్తిస్థాయిలో దిగుమతి చేసుకునే లగ్జరీ కార్లు, ఈవీలపై కస్టమ్స్ సుంకాన్ని 60శాతం నుంచి 70శాతానికి పెంచింది కేంద్రం ప్రభుత్వం. ఫలితంగా లగ్జరీ కార్ల ధరలు మరింత పెరగనున్నాయి. ఇది మాత్రం.. లగ్జరీ వాహనాల తయారీ సంస్థలకు చేదువార్తే!
వెహికిల్ స్క్రాపేజ్ పాలసీపై..
బడ్జెట్ 2023లో వెహికిల్ స్క్రాపేజ్ పాలసీపైనా పలు కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మలా సీతారామన్. ప్రభుత్వాల పరిధిలో ఉన్న పాత వాహనాలను వదిలించుకునేందుకు.. రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేస్తుందని హామీనిచ్చారు. కొత్త వాహనాల కొనుగోలుకు నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
Indian Auto Industry expectations on Budget 2023 : మరోవైపు.. ఎఫ్ఏఎంఈ 2 స్కీమ్ పొడగింపుపై నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం.. ఆటో పరిశ్రమను నిరుత్సాహపరిచింది! ఇప్పటికే రెండుసార్లు పొడగించిన ఈ స్కీమ్.. 2024 మార్చ్‌తో ముగుస్తుంది.
సంబంధిత కథనం