Kia India car sales : దమ్మురేపిన కియా.. కార్​ సేల్స్​లో​ 48శాతం వృద్ధి!-kia india record highest ever monthly sales in january with the help of sonet seltos ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Kia India Record Highest Ever Monthly Sales In January With The Help Of Sonet Seltos

Kia India car sales : దమ్మురేపిన కియా.. కార్​ సేల్స్​లో​ 48శాతం వృద్ధి!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Feb 01, 2023 03:36 PM IST

Kia India car sales in January : కియా ఇండియా మళ్లీ దుమ్మురేపింది! జనవరి నెలలో అత్యధిక సేల్స్​ను సాధించింది. ఫలితంగా కియా వాహనాల విక్రయాల్లో 48శాతం వృద్ధి నమోదైంది.

దుమ్మురేపిన కియా.. భారీగా పెరిగిన కార్​ సేల్స్​
దుమ్మురేపిన కియా.. భారీగా పెరిగిన కార్​ సేల్స్​

Kia India car sales in January : భారత దేశంలో జెట్​ స్పీడ్​లో దూసుకెళుతున్న 'కియా మోటార్స్​'.. మరోమారు దుమ్మురేపింది! జనవరి నెలలో కియా ఇండియా వాహనాల విక్రయాలు 48శాతం పెరిగాయి. విక్రయాల పరంగా.. కియా ఇండియాకు ఇదే- “ది బెస్ట్​ మంత్”​ అని చెప్పుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

ది బెస్ట్​ సేల్స్​..

2023 తొలి నెలలోనే 28,000కుపైగా వాహనాలను విక్రయించినట్టు దిగ్గజ ఆటోమేకర్​ కియ ఇండియా ప్రకటించింది. సోనెట్​, సెల్టోస్​, క్యారెన్స్​ వంటి ప్యాపులర్​ మోడల్స్​కు మంచి డిమాండ్​ కొనసాగుతుండటంతో.. గత నెలలో 28,634 యూనిట్​లను సేల్​ చేసినట్టు స్పష్టం చేసింది. గతేడాది ఇదే నెలలో ఆ సంఖ్య కేవలం 19,319గా ఉండటం గమనార్హం.

Kia India car sales : ఇండియాలో కియా మోటార్స్​కు 'సెల్టోస్​'.. ది బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా కొనసాగుతోంది. హ్యుందాయ్​ క్రేటా, మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా, టాటా హ్యారియర్​ వంటి వాహనాల నుంచి గట్టిపోటీ లభిస్తున్నప్పటికీ.. ఈ కియా సెల్టోస్​ 'తగ్గేదే లే' అన్న రేంజ్​లో దూసుకెళుతోంది. గత నెలలో.. ఒక్క సెల్టోస్​ మోడల్స్​నే 10,470 యూనిట్​లను విక్రయించింది కియా ఇండియా. ఇక రెండేళ్ల క్రితం ఇండియా మార్కెట్​లో లాంచ్​ అయిన సబ్​-కాంపాక్ట్​ ఎస్​యూవీ సెల్టోస్​ మోడల్స్​ను.. జనవరిల 9,261 యూనిట్​లను అమ్మింది.

ఇక ఇండియా మార్కెట్​లో కియా మోటార్స్​ నుంచి వచ్చిన లేటెస్ట్​ మోడల్​.. కియా క్యారెన్స్​ ఎంపీవీ సైతం దూసుకెళుతోంది. జనవరిలో 7,900 కియా క్యారెన్స్​ వాహనాలు అమ్ముడుపోయాయి. అయితే.. ఏడాది తిరగకముందే.. ఇండియాలో 70,656 క్యారెన్స్​ వాహనాలు అమ్ముడుపోవడం విశేషం.

ఇక కియా మోటార్స్​ నుంచి వస్తున్న కార్నివాల్​ మోడల్​కు సంబంధించి​.. గత నెలలో 1000కిపైగా మోడల్స్​ అమ్ముడుపోయాయి.

మరిన్ని మోడల్స్​..

Kia motors car sales : వాహనాల విక్రయాల్లో కనిపిస్తున్న జోష్​తో.. ఇండియాలోకి మరిన్ని మోడల్స్​ను దింపేందుకు ప్లాన్​ చేస్తోంది సౌత్​ కొరియా ఆధారిత కియా మోటార్స్​.

"ఇటీవలే ముగిసిన ఆటోఎక్స్​పో 2023లో మా టెక్నాలజీ, కియా ఈవీ9, కేఏ4 కాన్సెప్ట్​లను ప్రదర్శించాము. పీబీవీని ఈ ఏడాదే ఇండియాలో లాంచ్​ చేయాలని చూస్తున్నాము," అని కియా ఇండియా సేల్స్​ అండ్​ మార్కెటింగ్​ నేషనల్​ హెడ్​ హర్దీప్​ సింగ్​ బ్రార్​ తెలిపారు.

Kia Sonet sales in January : నాలుగేళ్ల క్రితం ఇండియా మార్కెట్​లోకి అడుగుపెట్టిన కియా మోటార్స్​.. ఇప్పటికే 6.5లక్షలకుపైగా వాహనాలను విక్రయించడం విశేషం. కియా సెల్టోస్​ 3.52లక్షల యూనిట్​లు, కియా సోనెట్​ 2.13లక్షల యూనిట్​లు అమ్ముడుపోయాయి. స్వల్ప కాలంలోనే.. దేశీయంగా దిగ్గజ ఆటో సంస్థలకే గట్టిపోటీనిచ్చే స్థాయికి ఎదిగిపోయింది కియా మోటార్స్​.

WhatsApp channel

సంబంధిత కథనం