Indian Car Of The Year 2023 : కియా కారెన్స్‌కు.. 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డు!
Indian Car Of The Year 2023 : కియా కారెన్స్‌కు ప్రతిష్ఠాత్మక ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు దక్కింది. కియా ఈవీ6ని గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు వరించింది.
Kia Carens Indian Car Of The Year 2023 : కియా మోటార్స్.. ఇండియా మార్కెట్లోనే కాకుండా అవార్డుల విషయంలోనూ దూసుకెళుతోంది! ఏడాది కాలంగా భారత విపణిలో అత్యధిక సేల్స్ సాధిస్తున్న కియా మోటార్స్.. ఇప్పుడు ఓ ప్రతిష్ఠాత్మక అవార్డును తన సొంతం చేసుకుంది. కియా కారెన్స్‌కు ప్రతిష్ఠాత్మక “ఇడియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023” అవార్డు దక్కింది.
దమ్మురేపిన కియా కారెన్స్..!
ఓ ఎంపీవీకి ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి! కియా నుంచి మూడో మోడల్‌గా ఇండియాకు వచ్చిన ఈ కియా కారెన్స్.. అటు కస్టమర్ల నుంచి, ఇటు పరిశ్రమ నుంచి ఇంతటి ఆధరణ లభిస్తుండటం.. ఈ కొరియన్ ఆటో సంస్థకు మరింత జోష్‌ను ఇచ్చే విషయం.
Indian Car Of The Year 2023 : మహీంద్రా స్కార్పియో ఎన్, మారుతీ గ్రాండ్ విటారా, స్కోడా స్లావియా వంటి వెహికిల్స్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనప్పటికీ.. ఈ ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును కియా కారెన్స్ దక్కించుకోగలిగింది.
2022లో కియా కారెన్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ అయ్యింది. విశాలవంతంగా, లుక్స్ పరంగా మంచి అనుభూతిని కల్గించే వాహనాన్ని కొనుగోలు చేయాలని చూస్తున్న వారందరికి ఈ కియా కారెన్స్ మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది. అందుకే డిమాండ్ కూడా రోజురోజుకు పెరుగుతోంది.
Kia Carens on road price in India : కియా కారెన్స్‌లో డీజిల్, పెట్రోల్ వేరియంట్స్ ఉన్నాయి. మేన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మార్కెట్ల కియా కారెన్స్ ఎక్స్‌షోరూం ధర రూ. 10.20- రూ. 18.45లక్షల మధ్యలో ఉంది.
ప్రిమీయం కార్ ఆఫ్ ది ఇయర్ 2023..
ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్‌తో పాటు ప్రీమియం కార్ ఆఫ్ ది ఇయర్, గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్‌ను కూడా ప్రకటించారు. ప్రీమియం కార్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు.. మెర్సిడెస్ ఈక్యూఎస్ 580కి దక్కింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 1.55కోట్లు. ఈ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 850కి.మీల దూరం ప్రయాణిస్తుంది. న్యూ రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ ఐ4, ఫెరారీ 286 జీటీబీని ఓడించి.. ఈ ఆవార్డును దక్కించుకుంది ఈ లగ్జరీ వెహికిల్.
Green car of the year 2023 : ఇక గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును కియా ఈవీ6 దక్కించుకుంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 60.95లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ కియా ఈవీ6.. 500కి.మీల దూరం ప్రయాణిస్తుంది. హోండా సిటీ హైబ్రీడ్, వోల్వో ఎక్స్‌సీ40 రీఛార్జ్, బీఎండబ్ల్యూ ఐఎక్స్ వంటి లగ్జరీ వాహనాలను ఓడించి.. ఈ ఆవార్డును దక్కించుకుంది కియా ఈవీ.
Kia EV6 on road price in Hyderabad : ఈ అవార్డులను 18మంది ప్రముఖ ఆటోమోటివ్ జర్నలిస్ట్‌లు నిర్ణయిస్తారు. అత్యధిక ఓట్లు పడిన వాహనాలకు అవార్డులు దక్కుతాయి.