తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Motors Price Hike : వాహనాల ధరలను మళ్లీ పెంచిన టాటా మోటార్స్​

Tata Motors price hike : వాహనాల ధరలను మళ్లీ పెంచిన టాటా మోటార్స్​

Sharath Chitturi HT Telugu

03 July 2023, 12:11 IST

google News
  • Tata Motors price hike : కస్టమర్లకు మళ్లీ షాక్​ ఇచ్చింది టాటా మోటార్స్​. జులై 17 నుంచి వాహనాల ధరలను పెంచుతున్నట్టు వెల్లడించింది.

వాహనాల ధరలను మళ్లీ పెంచనున్న టాటా మోటార్స్​
వాహనాల ధరలను మళ్లీ పెంచనున్న టాటా మోటార్స్​ (MINT_PRINT)

వాహనాల ధరలను మళ్లీ పెంచనున్న టాటా మోటార్స్​

Tata Motors price hike news : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​.. వాహనాల ధరలను మళ్లీ పెంచాలని ఫిక్స్​ అయ్యింది. ధరల పెంపు ఈ నెల 17 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

వాహనాల ధరలు ఎంత పెరుగుతాయంటే..

తమ పోర్ట్​ఫోలియోలోని అన్ని మోడల్స్​, వేరియంట్లపై సగటు 0.6శాతం ప్రైజ్​ హైక్​ తీసుకుంటున్నట్టు టాటా మోటార్స్​ వెల్లడించింది. ఎలక్ట్రిక్​ వాహనాల ధరలు కూడా పెరగనున్నట్టు స్పష్టం చేసింది.

ధరల పెంపుపై ఎప్పుడూ చెప్పే కారణాలే ఈసారి కూడా చెప్పింది ఈ ఆటోమొబైల్​ సంస్థ. ముడిసరకు ధరలు పెరుగుతున్నాయని, వాహనాల ధరల పెంపు తప్పడం లేదని వివరించింది. ఈ ఏడాది ఇప్పటికే చాలాసార్లు ప్రైజ్​ హైక్​ తీసుకుంది ఈ సంస్థ. వాస్తవానికి ఏడాదిన్నర కాలంలో దేశంలో వాహనాల ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి.

Tata Motors latest news : అయితే.. కస్టమర్లకు కాస్త ఊరటనిచ్చే విషయాన్ని వెల్లడించింది టాటా మోటార్స్​. 2023 జులై 16 లోపు చేసుకునే బుకింగ్స్​పై, 2023 జులై 31 వరకు అయ్యే డెలివరీలపై ధరల పెంపు భారాన్ని వేయబోమని వివరించింది.

టాటా నెక్సాన్​, టాటా పంచ్​, టాటా హారియర్​, టాటా సఫారీ, టాటా ఆల్ట్రోజ్​ వంటి మోడల్స్​ సంస్థకు బెస్ట్​ సెల్లింగ్​గా ఉన్నాయి. ఇక ఈవీ సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతోంది టాటా మోటార్స్​. నెక్సాన్​ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్​ ఈవీలు పోర్ట్​ఫోలియోలో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని మోడల్స్​కు ఈవీ టచ్​ ఇచ్చేందుకు ప్రణాళికలు రచించింది ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ.

ఇదీ చూడండి:- Tata Altroz: టాటా ఆల్ట్రోజ్ అన్ని స్టాండర్డ్ మోడల్స్ కు సన్ రూఫ్ ఆప్షన్

జూన్​ నెల సేల్స్​ ఇలా..

Tata Motors price hike : జూన్​ నెలకు సంబంధించిన కార్​ సేల్స్​ డేటాను టాటా మోటార్స్​ ఇటీవలే ప్రకటించింది. ఈసారి దేశీయంగా 80,383 యూనిట్​లను విక్రయించింది. గతేడాది జూన్​తో (79,606) పోల్చుకుంటే ఇది 1శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసినట్టు! మరోవైపు.. 2023 మేలో దేశీయంగా 45,197 ప్యాసింజర్​ వాహనాలను విక్రయించిన సంస్థ.. జూన్​లో 47,235 యూనిట్​లను అమ్మింది. ఇది 5శాతం వృద్ధి.

ఎఫ్​వై24 క్యూ1లో మంచి డిమాండ్​ కనిపించినట్టు టాటా మోటార్స్​ చెప్పింది. ముఖ్యంగా ఎస్​యూవీ, ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​కు విశేష స్పందన లభిస్తోందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

హీరో మోటోకార్ప్​ కూడా..

కస్టమర్లకు మరోమారు షాక్​ ఇచ్చింది దిగ్గజ 2 వీలర్​ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్​. పలు మోడల్స్​ ధరలను భారీగా పెంచింది! పెంచిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈసారి సగటున 1.5శాతం ప్రైజ్​ హైక్​ తీసుకున్నట్టు సంస్థ వెల్లడించింది. అయితే ఈ ధరల పెంపు.. మోడల్​, మార్కెట్​ బట్టి ఉంటుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం