Stocks to buy today : స్టాక్స్ టు బై.. ఎస్బీఐ, టాటా మోటార్స్ షేర్ ప్రైజ్ టార్గెట్స్
Stocks to buy today : ట్రేడర్స్ నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం సెలవు. కాగా.. బుధవారం ట్రేడింగ్ సెషన్లో సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 154 పాయింట్లు పెరిగి 18,972 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 499 పాయింట్లు మెరుగుపడి 63,915 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 206 పాయింట్ల లాభంతో 44,327 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది.
"నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ట్రెండ్ పాజిటివ్‌గా ఉంది. కీలకమైన 18,900 రెసిస్టెన్స్‌ను నిఫ్టీ అధిగమించేసింది. ఫలితంగా ఇప్పుడు నిఫ్టీ 19,100- 19,200 వరకు పెరగొచ్చు. 18,830 సపోర్ట్‌గా ఉంది," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 12,350 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1021.01 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఇక దేశీయ సూచీలు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ దాదాపు 111 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
ఇదీ చూడండి:- ఐడియా ఫోర్జ్ ఐపీఓకు విశేష స్పందన; గ్రే మార్కెట్లో 5 వందల రూపాయల వరకు ప్రీమియం
అమెరికా స్టాక్ మార్కెట్లు..
అమెరికా స్టక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. నాస్డాక్ ఫ్లాట్‌గా ముగిసింది. డౌ జోనస్ 0.8శాతం, ఎస్ అండ్ పీ 500 0.45శాతం మేర లాభపడ్డాయి.
స్టాక్స్ టు బై..
SBI share price target : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ):- బై రూ. 566, స్టాప్ లాస్ రూ. 550, టార్గెట్ రూ. 590
కోల్గేట్ పాల్మోలివ్:- బై రూ. 1692.5, స్టాప్ లాస్ రూ. 1640, టార్గెట్ రూ. 1775
Tata Motors share price target : టాటా మోటార్స్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 567, టార్గెట్ రూ. 620
అదానీ విల్మర్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 397, టార్గెట్ రూ. 440
హెచ్ఏఎల్:- బై రూ. 3722, స్టాప్ లాస్ రూ. 3670, టార్గెట్ రూ. 3820
హెచ్‌సీఎల్ టెక్:- బై రూ. 1170, స్టాప్ లాస్ రూ. 1150, టార్గెట్ రూ. 1190
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం