Tata Motors car sales : జూన్​లో.. ఒక్క శాతమే పెరిగిన టాటా మోటార్స్​ కార్​ సేల్స్​!-tata motors reports marginal increase in total domestic sales in june ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Motors Car Sales : జూన్​లో.. ఒక్క శాతమే పెరిగిన టాటా మోటార్స్​ కార్​ సేల్స్​!

Tata Motors car sales : జూన్​లో.. ఒక్క శాతమే పెరిగిన టాటా మోటార్స్​ కార్​ సేల్స్​!

Sharath Chitturi HT Telugu
Jul 02, 2023 11:12 AM IST

Tata Motors car sales : 2023 జూన్​లో టాటా మోటార్స్​ కార్​ సేల్స్​ ఒక్క శాతమే వృద్ధి చెందింది. ఈ మేరకు సేల్స్​ డేటాను సంస్థ తాజాగా ప్రకటించింది.

టాటా మోటార్స్​ జూన్​ కార్​ సేల్స్​ డేటా విడుదల
టాటా మోటార్స్​ జూన్​ కార్​ సేల్స్​ డేటా విడుదల

Tata Motors car sales : జూన్​ నెలకు సంబంధించిన కార్​ సేల్స్​ డేటాను టాటా మోటార్స్​ తాజాగా ప్రకటించింది. ఈసారి దేశీయంగా 80,383 యూనిట్​లను విక్రయించింది. గతేడాది జూన్​తో (79,606) పోల్చుకుంటే ఇది 1శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసినట్టు! మరోవైపు.. 2023 మేలో దేశీయంగా 45,197 ప్యాసింజర్​ వాహనాలను విక్రయించిన సంస్థ.. జూన్​లో 47,235 యూనిట్​లను అమ్మింది. ఇది 5శాతం వృద్ధి.

ఎఫ్​వై24 క్యూ1లో మంచి డిమాండ్​ కనిపించినట్టు టాటా మోటార్స్​ చెప్పింది. ముఖ్యంగా ఎస్​యూవీ, ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​కు విశేష స్పందన లభిస్తోందని వెల్లడించింది.

"ఏప్రిల్​- జూన్​ త్రైమాసికంలో 1,40,450 యూనిట్​లను విక్రయించాము. ఎఫ్​వై23 క్యూ1తో పోల్చుకుంటే ఇది 8శాతం ఎక్కువ," అని టాటా మోటార్స్​ ప్యాసింజర్​ వెహికిల్స్​, ఎలక్ట్రిక్​ మొబిలిటీ విభాగం ఎండీ శైలేష్​ చంద్ర తెలిపారు.

దూసుకెళుతున్న ఈవీ సెగ్మెంట్​..

ఈవీ సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతున్న టాటా మోటార్స్​.. ప్రతి నెలా సేల్స్​ను పెంచుకుంటూ వెళుతోంది. ఈ క్రమంలో ఎఫ్​వై24 క్యూ1లో అత్యధిక ఈవీలను విక్రయించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే 105శాతం వృద్ధితో 19,346 యూనిట్​లను సేల్​ చేసింది. టాటా టియాగో ఈవీకి విపరీతమైన ఆదరణ లభిస్తుండటంతో సేల్స్​ సంఖ్య భారీగా వృద్ధిచెందింది.

ఇండియాలో పండుగ సీజన్​ సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో వ్యాపారం బాగా జరుగుతుందని టాటా మోటార్స్​ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. సప్లై చెయిన్​ వ్యవస్థతో కూడా ప్రస్తుతం ఇబ్బందులు లేవని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:- car sales : దూసుకెళుతున్న ఎంజీ మోటార్​, టయోటా.. అదిరిన కార్​ సేల్స్​..!

కమర్షియల్​ వాహనాల సెగ్మెంట్​లో సంస్థ టోటల్​ సేల్స్​ 8శాతం తగ్గాయి. గతేడాది జూన్​లో 37,265 యూనిట్​లను విక్రయించిన సంస్థ.. ఈసారి 34,314 వాహనాలను అమ్మింది. అయితే.. రుతుపవనాలు, మౌలిక వసతుల వృద్ధి అంశాలతో సంస్థకు చెందిన కమర్షియల్​ వాహనాల సెగ్మెంట్​ మెరుగైన ప్రదర్శన చేస్తుందని సంస్థ భావిస్తోంది.

టాటా నెక్సాన్​ ఈవీ రికార్డులే.. రికార్డులు..!

Tata Nexon EV : టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు మరో రికార్డు సృష్టించింది. లాంచ్ అయిన నాటి నుంచి 50 వేల యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఈ ఎలక్ట్రిక్ కారును టాటా మోటార్స్ 2020 లో లాంచ్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు, అంటే సుమారు మూడేళ్లలో మొత్తం 50 వేల టాటా నెక్సాన్ ఈవీ లు అమ్ముడుపోయాయి. టాటా నెక్సాన్ ఈవీ ప్రస్తుతం భారత్ లోని అత్యంత పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు.. ప్రైమ్, మ్యాక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 14.49 లక్షల నుంచి, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 16.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. నెక్సాన్​ ఈవీ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం