తెలుగు న్యూస్ / ఫోటో /
Tata electric cars : ఆడెవడన్నా.. ఈడెవడన్నా.. టాటా మోటార్స్ ‘ఈవీ’లకు అడ్డెవడన్నా!
- Tata Motors electric cars : దేశ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో టాటా మోటార్స్ హవా కొనసాగుతోంది. ఈ సంస్థ ఈవీలకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఫలితంగా సేల్స్‌లో నానాటికీ వృద్ధి నమోదవుతోంది.
- Tata Motors electric cars : దేశ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో టాటా మోటార్స్ హవా కొనసాగుతోంది. ఈ సంస్థ ఈవీలకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఫలితంగా సేల్స్‌లో నానాటికీ వృద్ధి నమోదవుతోంది.
(1 / 9)
దేశ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో టాటా మోటార్స్‌కు అధిక మార్కెట్ షేరు ఉంది. సేల్స్ నెంబర్లు నానాటికి పెరుగుతున్నాయి.
(3 / 9)
టాటా మోటార్స్ ఈవీ పోర్ట్‌ఫోలియో దృఢంగా ఉండటం సేల్స్ వృద్ధికి ప్రధాన కారణం. నెక్సాన్ ఈవీ నుంచి టిగోర్ ఈవీ వరకు.. వివిధ మోడల్స్ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.
(4 / 9)
నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీలో జిప్ట్రాన్ టెక్నాలజీ ఉంటుంది. ఈ మోడల్స్‌కు సరైన పోటీ కూడా లేకపోవడం విశేషం.
(5 / 9)
ఇక టియాగో ఈవీ.. టాటా మోటార్స్‌కు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా కొనసాగుతోంది. రూ. 8.69లక్షల ఎక్స్‌షోరూం ధరతో ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. దేశంలోనే అతి చౌకైన ఈవీల్లో ఇదొకటి.
(6 / 9)
టిగోర్ ఈవీకి కూడా మంచి డిమాండ్ కనిపిస్తోంది. రూ. 12.49లక్షల ఎక్స్‌షోరూం ధరతో వస్తున్న ఈ ఈవీ రేంజ్ 315కి.మీలుగా ఉంది.
(7 / 9)
నెక్సాన్ ఈవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ మోడల్.. టాటా మోటార్స్ ఈవీ కలలకు సరైన ప్రారంభాన్ని ఇచ్చింది. నెక్సా ఈవీ మ్యాక్స్ కూడా అందుబాటులో ఉంది.
(8 / 9)
ఈవీ పోర్ట్‌ఫోలియోను మరింత పెంచుకోవాలని చూస్తోంది టాటా మోటార్స్. ఈ క్రమంలోనే టాట సఫారీ ఈవీ, టాటా పంచ్ ఈవీలను సిద్ధం చేస్తోంది.
ఇతర గ్యాలరీలు