Tata motors electric car sales : కొనసాగుతున్న టాటా ‘ఈవీ’ల హవా.. సేల్స్​ సూపర్​!-tata motors electric car sales grew 66 percent in may check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Motors Electric Car Sales : కొనసాగుతున్న టాటా ‘ఈవీ’ల హవా.. సేల్స్​ సూపర్​!

Tata motors electric car sales : కొనసాగుతున్న టాటా ‘ఈవీ’ల హవా.. సేల్స్​ సూపర్​!

Sharath Chitturi HT Telugu
Jun 02, 2023 01:37 PM IST

Tata motors electric car sales : టాటా మోటార్స్​లో ఈవీ సెగ్మెంట్​ దుమ్మురేపుతోంది! గత నెలలో 66శాతం వృద్ధిని నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే..

టాటా మోటార్స్​ ఎలక్ట్రిక్​ వాహనాలు జోరు..
టాటా మోటార్స్​ ఎలక్ట్రిక్​ వాహనాలు జోరు.. (Tata Motors)

Tata motors electric car sales : దేశ ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో రారాజుగా ఉన్న టాటా మోటార్స్​.. తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మే నెలకు సంబంధించిన సేల్స్​ డేటాను చూస్తే ఇది స్పష్టమవుతుంది. గత నెలలో 5,805 ఈవీలను విక్రయించింది ఈ సంస్థ. గతేడాది మే నెలతో పోల్చుకుంటే (3,505) ఇది 66శాతం ఎక్కువగా ఉండటం విశేషం.

మే 2023 టాటా మోటార్స్​ సేల్స్​ డేటాలో ఈవీల వాటా 8శాతంగా ఉంది. మొత్తం మీద గత నెలలో 73,448 యూనిట్​లను విక్రయించింది ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. నెక్సాన్​ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్​ ఈవీ వంటి మోడల్స్​తో కస్టమర్లను ఆకర్షిస్తోంది. మరీ ముఖ్యంగా టియాగో ఈవీకి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. లాంచ్​ చేసిన 4 నెలలకే 10వేల సేల్స్​ మైలురాయిని ఈ ఎలక్ట్రిక్​ వాహనం అందుకోవడం విశేషం. దేశంలో అతి చౌకైన ఈవీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ టీయాగో ఎలక్ట్రిక్​ కారు ఎక్స్​షోరూం ధర రూ. 8.69లక్షలు- రూ. 11.99లక్షల మధ్యలో ఉంటుంది.

టియాగో ఈవీ రేంజ్​ 315కి.మీలుగా ఉంది. 0-60 కేఎంపీహెచ్​ను 5.7సెకన్లలో అందుకునే సామర్థ్యం దీని సొంతం. 10-80శాతం ఛార్జింగ్​ను కేవలం 1 గంటలో పూర్తి చేసుకుంటుంది.

ఇదీ చూడండి:- Maruti Suzuki car sales : ఎస్​యూవీల జోరుతో అదిరిన మారుతీ సుజుకీ సేల్స్​!

కియా కార్​ సేల్స్​..

కియా మోటార్​ ఇండియా సైతం.. మే నెల సేల్స్​ డేటాను విడుదల చేసింది. సంస్థ సేల్స్​ స్వల్పంగా పెరిగాయి. గత నెలలో కియాకు చెందిన 24,770 వాహనాలు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే నెలతో పోల్చుకుంటే అది 3శాతం వృద్ధిచెందినట్టు. సోనెట్​ బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా కొనసాగుతోంది. కారెన్స్​ సైతం సంస్థ సేల్స్​ను వృద్ధి చేస్తోంది.

కియా సోనెట్​కు చెందిన 8,251 యూనిట్​లు గత నెలలో డెలివర అయ్యాయి. ఏప్రిల్​లోనూ సోనెట్​ సేల్స్​ ఎక్కువగా ఉన్నాయి. సెల్టోస్​ నెంబర్లు తగ్గుతుండటం సంస్థను కాస్త కలవరపెట్టే విషయం. అయినప్పటిక కారెన్స్​ సేల్స్​ మెరుగ్గా ఉండటంతో వృద్ధిపై సంస్థ ధీమాగా ఉంది. మే నెలలో 6,367 కియా కారెన్స్​ కార్లు అమ్ముడుపోయాయి. ఈవీ6కు చెందిన 83 యూనిట్​లను గత నెలలో సంస్థ విక్రయించింది.

Whats_app_banner

సంబంధిత కథనం