Kia Sonet new variant launched : కియా సోనెట్ కొత్త వేరియంట్ లాంచ్.. హైలైట్స్ ఇవే!
Kia Sonet new variant launched : కియా సోనెట్ నుంచి యానివర్సీ ఎడిషన్ ‘ఓరాక్స్’ లాంచ్ అయ్యింది. ఈ కొత్త వేరియంట్ ఫీచర్స్, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Kia Sonet new edition launched : ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న సోనెట్‌కు కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్. దీని పేరు కియా సోనెట్ ఓరాక్స్. ఇదొక యానివర్సరీ ఎడిషన్. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 11.85లక్షలు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న హెచ్‌టీఎక్స్ వేరియంట్ ఆధారంగా.. ఈ కొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చింది కియా మోటార్స్. ఇందులో అనేక కొత్త అప్డేట్స్ వచ్చాయి. హెచ్‌టీఎక్స్ వేరియంట్ కన్నా దీని ధర రూ. 40వేలు అధికం.
ఓరాక్స్లో కొత్త అప్డేట్స్..
ప్రపంచంలో అంతరించిపోయిన 'ఓరాక్స్' జాతి పశువులకు గుర్తుగా కొత్త ఎడిషన్‌కు ఆ పేరు పెట్టింది కియా మోటార్స్. ఈ కియా సోనెట్ ఓరాక్స్ను.. హెచ్‌టీఎక్స్ ఏఈ వేరియంట్ అని పిలుస్తోంది కియా మోటార్స్. ఓరాక్స్ ఫ్రెంట్ ఫేస్, సైడ్స్‌లో స్కిడ్ ప్లేట్స్, రేర్‌లో టాంగెరైన్ యాక్సెంట్స్ వస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉంటుంది. ఇందులోని క్రౌన్ జ్యూవెల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, హార్ట్‌బీట్ షేప్‌లోని ఎల్ఈడీ డీఆర్ఎల్స్- టెయిల్‌లైట్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి.
Kia Sont Aurochs edition launch : ఈ వేరియంట్.. నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అవి.. గ్లేషియర్ వైట్ పర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్రావిటీ గ్రే, ఆరోరా బ్లాక్ పర్ల్. మొత్తం నాలుగు ట్రిమ్స్‌లో వస్తోంది ఈ కియా సోనెట్ ఓరాక్స్. అవి.. జీ1.0 టీ-జీడీఐ 6ఐఎంటీ, జీ1.0 టీ-జీడీఐ 7డీసీటీ, 1.5లీటర్ సీఆర్డీఐ వీజీటీ 6ఐఎంటీ, 1.5 లీటర్ సీఆర్డీఐ వీజీటీ 6ఏటీ.
ఇదీ చూడండి:- Car sales in April 2023 : అదిరిన కియా మోటార్స్ కార్ సేల్స్ డేటా- మారుతీ సుజుకీ కూడా!
ఇంజిన్ ఆప్షన్స్..
ఇక సోనెట్ కొత్త ఎడిషన్ కేబిన్‌లో సెమీ లెథరేట్ సిట్స్, సోనెట్ లోగో కూడిన లెథరేట్ వ్రాప్డ్ డీ- కట్ స్టీరింగ్ వీల్, లెథరేట్ వ్రాప్డ్ డోర్ ఆర్మ్‌రెస్ట్, సిల్వర్ ఫినిష్ ఏసీ వెంట్స్ వస్తున్నాయి. 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, ఆండ్రాయిడ్ ఆటో- యాపిల్ కార్ప్లే టెక్నాలజీలు ఉంటాయి.
Kia Sonet Aurochs edition price : ఈ కియా సోనెట్ ఎస్‌యూవీలో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.0 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్.. 118 బీహెచ్పీ పవర్‌ను, 172 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్.. 114 బీహెచ్పీ పవర్‌ను, 250 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
సేఫ్టీ ఫీచర్స్‌లో భాగంగా.. ఇందులో నాలుగు ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ- లాక్ బ్రేక్ సిస్టెమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబులిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికిల్ స్టెబులిటీ మేనేజ్మెంట్ వంటివి లభిస్తున్నాయి.
Kia Sonet Aurochs edition news : ఇండియాలో.. కియా సోనెట్.. టాటా నెక్సాన్, మారుతీ సుజుకీ బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ వంటి మోడల్స్‌కు గట్టిపోటీనిస్తోంది.
సంబంధిత కథనం