Kia Sonet facelift launch : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో కియా మోటార్స్‌కు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది సోనెట్. ఈ వెహికిల్‌కి మంచి డిమాండ్ ఉంది. ఇక ఇప్పుడు కస్టమర్లను ఆకర్షించేందుకు సన్నద్ధమవుతున్న కియా మోటార్స్.. సోనెట్‌కు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి.. 2024 కియా సోనెట్‌పై గత కొంతకాలంగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇక ఇప్పుడు.. ఈ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ 2023 చివర్లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. 2024 తొలినాళ్లల్లో ఇది ఇండియాలో అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
2024 కియా సోనెట్ గ్రిల్‌కు పియానో బ్లాక్ ఫినిష్, నారో హెడ్లైడ్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఫాంగ్ ల్యాంప్‌తో కూడిన బంపర్‌ను మరింత అట్రాక్టివ్‌గా మార్చే అవకాశం ఉంది. రూఫ్ రెయిల్స్, ఓఆర్వీఎంలు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చీస్, 16- ఇంచ్ అలాయ్ వీల్స్ లభించొచ్చు.
2024 Kia Sonet launch date : ఇక కియా సోనెట్ ఫస్లిఫ్ట్ వర్షెన్‌లో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 82 హెచ్‌పీ పవర్‌ను, 114 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 118.3 హెచ్‌పీ పవర్‌ను, 172 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 1.5 లీటర్ 4 సిలిండర్ డీజిల్ మోటార్.. 114.4 హెచ్‌పీ పవర్‌ను, 250 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ 5 సీటర్ కేబిన్‌లో అప్డేటెడ్ డాష్‌బోర్డ్ కనిపించనుంది. రివైజ్డ్ సెంట్రల్ కన్సోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్స్, యూఎస్బీ ఛార్జర్స్, వెంటిలేటెడ్ సీట్స్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ కనిపించొచ్చు.
Kia Sonet facelift 2023 : ఇక 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ కన్సోల్ ఉంటుందని తెలుస్తోంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేని సపోర్ట్ చేస్తుంది.
ఇక సేఫ్టీ విషయానికొస్తే.. 6 ఎయిర్‌బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్, రేర్- వ్యూ కెమెరా వంటి ఫీచర్స్ లభించనున్నాయి.
Kia Sonet on road price in Hyderabad : 2024 కియా సోనెట్ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. రానున్న కాలంలో కియా వీటిని రివీల్ చేసే అవకాశం ఉంది. కాగా.. ఇండియాలో ప్రస్తుతం.. కియా సోనెట్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 7.79లక్షలుగా ఉంది.
లాంచ్ తర్వాత.. ఈ అప్డేటెడ్ కియా సోనెట్ నిస్సాన్ మాగ్నైట్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, మారుతీ సుజుకీ బ్రెజా, హ్యుందాయ వెన్యూ వంటి మోడల్స్‌కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం