Car sales in April 2023 : అదిరిన కియా మోటార్స్​ కార్​ సేల్స్​ డేటా- మారుతీ సుజుకీ కూడా!-maruti suzuki and kia motors release their car sales in april 2023 data check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Car Sales In April 2023 : అదిరిన కియా మోటార్స్​ కార్​ సేల్స్​ డేటా- మారుతీ సుజుకీ కూడా!

Car sales in April 2023 : అదిరిన కియా మోటార్స్​ కార్​ సేల్స్​ డేటా- మారుతీ సుజుకీ కూడా!

Sharath Chitturi HT Telugu
May 01, 2023 01:46 PM IST

Car sales in April 2023 : మారుతీ సుజుకీ, కియా మోటార్స్​లు ఏప్రిల్​ నెలకు సంబంధించిన కార్​ సేల్స్​ డేటాను ప్రకటించాయి. ఆ వివరాలు..

అదిరిన కియా మోటార్స్​ కార్​ సేల్స్​ డేటా- మారుతీ సుజుకీ కూడా!
అదిరిన కియా మోటార్స్​ కార్​ సేల్స్​ డేటా- మారుతీ సుజుకీ కూడా!

Maruti Suzuki car sales data in April 2023 : ఎఫ్​వై24 తొలి నెల అయిన ఏప్రిల్​కు సంబంధించిన కార్​ సేల్స్​ డేటాను ప్రకటించింది దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ. ఏప్రిల్​లో మొత్తం మీద 1,60,529 యూనిట్​లను విక్రయించింది. 2022 ఏప్రిల్​లో ఈ నెంబర్​ 1,50,661గా ఉండేది. ఈ 1,60,529 యూనిట్​లలో 1,39,519 కార్లను దేశీయం విక్రయించగా.. 4,039 ఓవీఎంలు, 16,971 ఎగుమతులు ఉన్నాయి. ఈ మేరకు ఎక్స్​ఛేంజ్​ ఫైలింగ్​లో మారుతీ సుజుకీ పేర్కొంది.

సెమీకండక్టర్​ చిప్స్​ కొరత గత నెల కూడా మారుతీ సుజుకీని వెంటాడింది! ఫలితంగా అనుకున్న స్థాయిలో ఉత్పత్తి జరగలేదు. అయితే.. ఈ ప్రభావం తక్కువగా ఉండే విధంగా అన్ని చర్యలు చేపట్టినట్టు ఆటోమొబైల్​ సంస్థ చెప్పింది.

Maruti Suzuki sales in April : మారుతీ సుజుకీ సేల్స్​లో చిన్న కార్ల హవా మరింత తగ్గినట్టు కనిపిస్తోంది. ఆల్టో కే10, ఎస్​-ప్రెస్సో వంటి కార్లు.. 2022 ఏప్రిల్​లో 17,137 యూనిట్​లు అమ్ముడుపోగా.. ఈసారి కేవలం 14,110 మాత్రమే సేల్​ అయ్యాయి. అయితే యుటిలిటీ వెహికిల్స్​ అంచనాలకు మించి రాణిస్తుండటం సంస్థకు కలిసి వస్తోంది. మిని- కాంపాక్ట్​ సెగ్మెంట్​లో ఈసారి 90,062 వెహికిల్స్​ అమ్ముడుపోయాయి. గతేడాది ఈ నెంబర్​ 76,900గా ఉండేది.

మారుతీ సుజుకీ సైతం మార్కెట్​లో ఎస్​యూవీలకు ఉన్న డిమాండ్​ను అర్థం చేసుకుంది. అందుకు తగ్గట్టుగానే బ్రెజా, గ్రాండ్​ విటారాలను ప్రమోట్​ చేస్తోంది. ఇక కొత్త ఫ్రాంక్స్​ను లాంచ్​ చేసింది. ఈ వెహికిల్​కి ఇప్పటికే మంచి ఆర్డర్​ బుక్​ ఉంది. రానున్న కాలంలో ఈ నెంబర్లు యాడ్​ అవుతాయి. పైగా బలెనో, బ్రెజా నుంచి ఎర్టిగా, ఎక్స్​ఎల్​6 వరకు వాహనాలను సంస్థ అప్డేట్​ కూడా చేసింది. ఫలితంగా మంచి బజ్​ నడుస్తోంది.

ఇదీ చూడండి:- Upcoming cars in May 2023 : మే నెలలో లాంచ్​ అవుతున్న కార్లు ఇవే..!

కియా క్రేజీ డేటా..!

Kia motors car sales data in April 2023 : ఎప్పటిలాగానే ఈసారి కూడా కియా మోటార్స్​ దుమ్మురేపింది. ఏప్రిల్​లో సంస్థ విక్రయాలు 22శాతం పెరిగాయి! గత నెలలో 23,216 యూనిట్​లను విక్రయించినట్టు ప్రకటించింది కియా. సోనెట్​, సెల్టోస్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోందని చెప్పింది. సంస్థ సేల్స్​కు సంబంధించి ఈ రెండు కలిపే సగానికిపైగా ఎక్కువ అమ్ముడుపోయాయని స్పష్టం చేసింది. సోనెట్​ 9,744 యూనిట్​లు అమ్ముడుపోయాయి. సెల్టోస్​కు సంబంధించి 7,214 యూనిట్​లను విక్రయించింది కియా మోటార్స్​. మూడో బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న క్యారెన్స్​ వాహనాలు 6,107 అమ్ముడుపోయాయి. దేశంలో ఉన్న 3 రో వెహికిల్ మోడల్స్​లో ఇది అత్యధికం!

దేశంలో 7లక్షల సేల్స్​ మార్క్​ను అందుకున్నట్టు కియా ప్రకటించింది.

Kia motors sales in April : "నాలుగేళ్ల కన్నా తక్కువ సమయంలో.. లీడింగ్​ ప్రీమియం ఆటోమోటివ్​ కంపెనీగా ఎదగడమే కాకుండా, న్యూ ఏజ్​ బ్రాండ్​గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాము. 7లక్షలకుపైగా కస్టమర్ల నమ్మకం మాకు ఇప్పుడు ఉంది. క్వాలిటీ సర్వీస్​, స్ఫూర్తిదాయకమైన ఇన్నోవేషన్స్​ను చేస్తూ ఉండేందుకు మేము నిత్యం కృషిచేస్తామని," అని కియా ఇండియా సేల్స్​, మార్కెటింగ్​ నేషనల్​ హెడ్​ హర్దీప్​ సింగ్​ బ్రార్​ తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం