Best electric scooters in India : మార్కెట్​లో ఉన్న ది బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు ఇవే!-list of best electric scooters in india ather ola and more see details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Electric Scooters In India : మార్కెట్​లో ఉన్న ది బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు ఇవే!

Best electric scooters in India : మార్కెట్​లో ఉన్న ది బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు ఇవే!

Sharath Chitturi HT Telugu
Jun 02, 2023 10:28 AM IST

Best electric scooters in India : కొత్తగా ఒక ఎలక్ట్రిక్​ స్కూటర్​ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మార్కెట్​లో ఉన్న కొన్ని బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

ది బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు ఇవే..!
ది బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు ఇవే..!

Best electric scooters in India : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్​ నానాటికి పెరుగుతోంది. ముఖ్యంగా 2 వీలర్​ సెగ్మెంట్​లోనూ ఆ జోరు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్​ సంస్థలు.. కొత్త కొత్త మోడల్స్​ను లాంచ్​ చేస్తున్నాయి. మరి మీరు ఒక ఎలక్ట్రిక్​ స్కూటర్​ను కొనాలని చూస్తున్నారా? అయితే.. ఇండియాలో ప్రస్తుతం ఉన్న ది బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్ల లిస్ట్​ను ఇక్కడ తెలుసుకోండి.

ఏథెర్​ ఎనర్జీ 450ఎక్స్​ జెన్​ 3..

ఈ థర్డ్​ జనరేషన్​ ఏథెర్​ ఎనర్జీ 450ఎక్స్​లో ఉన్న పవర్​ఫుల్​ ఎలక్ట్రిక్​ మోటార్​.. 8.7 బీహెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఈ స్కూటర్​ 146కి.మీలు ప్రయాణిస్తుంది. ఆల్​- అల్యూమీనియం ఫ్రెమ్​ వస్తుండటంతో ఎలక్ట్రిక్​ స్కూటర్​ బాడీ భద్రత మరింత పెరిగింది. టైర్​ ప్రెజర్​ మానిటరింగ్​ సిస్టెమ్​ వంటి యాక్ససరీలు ఉన్నాయి. స్పీడ్​, రేంజ్​ మెరుగ్గా ఉంటాయి. మార్కెట్​లో ఈ స్కూటర్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.37లక్షలుగా ఉంది.

ఏథెర్​ ఎనర్జీ 450ఎస్​ తాజాగా మార్కెట్​లో లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​ విశేషాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

బజాజ్​ చేతక్​..

అలనాటి టూ వీలర్​ సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగింది బాజాజ్​ చేతక్​. ఆ తర్వాత పూర్తిగా కనుమరుగైపోయింది. మళ్లీ ఎలక్ట్రిక్​ అవతారంలో అడుగుపెట్టి కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇందులో బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 108కి.మీల వరకు ప్రయాణించవచ్చు. ఇందులోని క్విక్​ ఛార్జింగ్​ ఫీచర్​ హైలైట్​గా నిలుస్తోంది. 25శాతం ఛార్జింగ్​ను గంటలో అందుకుంటుంది. 5 గంటల్లో ఫుల్​గా ఛార్జ్​ అయిపోతుంది. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.21లక్షలు.

ఇదీ చూడండి:- Honda electric scooters : హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లు..

ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లు..

ఎలక్ట్రిక్​ స్కూటర్లు అంటే ముందుగా గుర్తొచ్చేది ఓలా ఎలక్ట్రిక్​. ఓలా ఎస్​1, ఓలా ఎస్​1 ప్రోలు మార్కెట్​లో ఉన్నాయి. ఓలా ఎస్​1 రేంజ్​ 121 కి.మీలుగా ఉండగా.. ఎస్​ 1 ప్రో రేంజ్​ ఏకంగా 181కి.మీలుగా ఉండటం విశేషం. వీటి టాప్​ స్పీడ్​ 115కేఎంపీహెచ్​. 0-40కేఎంపీహెచ్​ను 3 సెకన్లలో అందుకోగలవు. ఇక ఓలా ఎస్​1 అయితే.. 90కేఎంపీహెచ్​ను 3.6 సెకన్లలోనే అందుకుంటుంది. ఓలా ఎస్​1 ఎక్స్​షోరూం ధర రూ. 99,999గా ఉంది. ఎస్​ 1 ప్రో ఎక్స్​షోరూం ధర రూ. 1.29లక్షలు.

హీరో ఎలక్ట్రిక్​ ఆప్టిమా సీఎక్స్​..

2 వీలర్​ ఎలక్ట్రిక్​ వాహనాల్లో హీరో ఎలక్ట్రిక్​ ఆప్టిమా సీఎక్స్​.. వన్​ ఆఫ్​ ది బెస్ట్​ ఆప్షన్స్​గా కొనసాగుతోంది. ఇందులోని డ్యూయెల్​ బ్యాటరీ మోడల్​ హైలైట్​గా నిలుస్తోంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 140కి.మీ రేంజ్​ని ఇస్తోంది. డిటాచెబుల్​ బ్యాటరీ వంటి ఆప్షన్​ లభిస్తుండటం విశేషం. టాప్​ స్పీడ్​ 45కేఎంపీహెచ్​గా ఉంది. డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్​, యూఎస్​బీ పోర్ట్​, రీజెనరేటివ్​ బ్రేకింగ్​ వంటి ఫచర్స్​ వస్తున్నాయి. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ.​ 77,490.

టీవీఎస్​ ఐక్యూబ్​ ఎస్​టీ..

టీవీఎస్​ ఐక్యూబ్​ ఎస్​టీ ఎలక్ట్రిక్​ స్కూటర్​.. చాలా కన్వీనియంట్​గా ఉంటుంది. ఇందులో బూట్​ స్పేస్​ చాలా ఎక్కువగా ఉంది. రెండు పెద్ద సైజు హెల్మేట్​లు ఇందులో పెట్టుకోవచ్చు. ఇందులోని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ఎకానమీ మోడ్​లో 145కి.మీల వరకు ప్రయాణిస్తుంది. అదే పర్ఫార్మెన్స్​ మోడ్​లో అయితే దీని రేంజ్​ 110 కి.మీలు. అలెక్సా వాయిస్​ అసిస్టెన్స్​తో కూడిన 7 ఇంచ్​ టచ్​స్క్రీన్​ లభిస్తుండటం విశేషం. బ్లూటూత్​, మ్యూజిక్​ ప్లేబ్యాక్​, సోషల్​ మీడియా నోటిఫికేషన్స్​ వంటివి కూడా వస్తాయి. ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.09లక్షలుగా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం