Hero MotoCorp price hike : బైక్స్ , స్కూటర్ల ధరలను మళ్లీ పెంచిన హీరో మోటోకార్ప్!
Hero MotoCorp price hike : హీరో మోటోకార్ప్ సంస్థ.. తమ వాహనాల ధరలను మరోమారు పెంచింది. పెంచిన ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి.
Hero MotoCorp price hike : కస్టమర్లకు మరోమారు షాక్ ఇచ్చింది దిగ్గజ 2 వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్. పలు మోడల్స్ ధరలను భారీగా పెంచింది! పెంచిన ధరలు ఈ నెల 3 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈసారి సగటున 1.5శాతం ప్రైజ్ హైక్ తీసుకున్నట్టు సంస్థ వెల్లడించింది. అయితే ఈ ధరల పెంపు.. మోడల్, మార్కెట్ బట్టి ఉంటుందని పేర్కొంది.
ధరల పెంపునకు కారణం ఇదే..!
హీరో మోటోకార్ప్ వాహనాల ధరలను పెంచి మూడు నెలలు కూడా అవ్వలేదు! ఓబీడీ2 నార్మ్స్ పేరుతో ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఓసారి ప్రైజ్ హైక్ తీసుకుంది. మళ్లీ ఇప్పుడు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రైజ్ రివ్యూలో భాగంగా ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రైజ్ పొజీషనింగ్, ముడిసరకు ఖర్చులతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ధరలు పెంచినట్టు వివరించింది. అయితే పలు ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ప్రొగ్రామ్‌ల ద్వారా కస్టమర్లపై తక్కువ ప్రభావం పడే విధంగా చూసుకుంటామని సంస్థ చెప్పింది. అవేంటన్నది ఇంకా వెల్లడించలేదు.
దేశంలో పండుగ సీజన్ సమీపిస్తోంది. ఈ సీజన్లో సేల్స్ మంచిగా జరుగుతాయి. ఈ సమయంలో బైక్స్, స్కూటర్ల ధరలను సంస్థ పెంచడం గమనార్హం. రుతుపవనాలతో పాటు ఇతర ఆర్థిక అంశాలు సానుకూలంగా ఉన్నాయని, ఫలితంగా ఈసారి మంచి వ్యాపారం జరుగుతుందని సంస్థ అభిప్రాయపడింది. రానున్న పండుగ సీజ్‌లో ఆటోపరిశ్రమ వాల్యూమ్‌లు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
హీరో మోటోకార్ప్ తాజా నిర్ణయంతో మంచి డిమాండ్ ఉన్న ఎక్స్ట్రీమ్, స్ప్లెండర్, జూమ్ వంటి 2 వీలర్ల ధరలు పెరగనున్నాయి.
ఇదీ చూడండి:- Hero Upcoming Two-wheelers: త్వరలో 5 కొత్త టూవీలర్లను తీసుకురానున్న హీరో!: అంచనాలివే
హీరో ప్యాషన్ ప్లస్..
Hero Passion Plus : ప్యాషన్ ప్లస్‌కు లేటెస్ట్ ఫీచర్స్ యాడ్ చేసి సరికొత్తగా హీరో సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. పెద్దగా హంగామా లేకుండా, సైలెంట్‌గా భారతీయ మార్కెట్లో ఈ బైక్‌ను లాంచ్ చేశారు. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ 76,301. ధర పరంగా ఈ బైక్ స్ప్లెండర్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ టెక్ల మధ్య ఉంటుంది.
భారతీయ మధ్య తరగతికి హీరో ప్యాషన్ ప్లస్ చాలా విశ్వసనీయమైన, ఇష్టమైన బైక్. ఈ సెగ్మెంట్లో బజాజ్ ప్లాటినా, హోండా షైన్ మోడల్స్ తో ప్యాషన్ ప్లస్ పోటీ పడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం