Hero Passion Plus: లేటెస్ట్ ఫీచర్స్ తో, అందుబాటు ధరలో సరికొత్త హీరో ప్యాషన్ ప్లస్
New Hero Passion Plus: సక్సెస్ ఫుల్ మోడల్ ప్యాషన్ ప్లస్ కు లేటెస్ట్ ఫీచర్స్ ను జత చేసి సరికొత్తగా హీరో సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ ఎక్స్ షో రూమ్ ధర రూ 76,301.
New Hero Passion Plus: సక్సెస్ ఫుల్ మోడల్ ప్యాషన్ ప్లస్ (Passion Plus) కు లేటెస్ట్ ఫీచర్స్ ను జత చేసి సరికొత్తగా హీరో (Hero) సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. పెద్దగా హంగామా లేకుండా, సైలెంట్ గా భారతీయ మార్కెట్లో ఈ బైక్ ను లాంచ్ చేశారు. ఈ బైక్ ఎక్స్ షో రూమ్ ధర రూ 76,301. ధర పరంగా ఈ బైక్ స్ప్లెండర్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ టెక్ ల మధ్య ఉంటుంది. భారతీయ మధ్య తరగతికి హీరో ప్యాషన్ ప్లస్ (Hero Passion Plus) చాలా విశ్వసనీయమైన, ఇష్టమైన బైక్. ఈ సెగ్మెంట్లో బజాజ్ ప్లాటినా, హోండా షైన్ మోడల్స్ తో ప్యాషన్ ప్లస్ పోటీ పడుతోంది.
Hero Passion Plus latest features:సరికొత్త ఫీచర్స్..
తాజాగా మరికొన్ని ఫీచర్స్ ను ప్యాషన్ ప్లస్ కు యాడ్ చేశారు. అందులో ఒకటి ఐ3ఎస్ (i3s) టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వల్ల బైక్ ఒకవేళ కొన్ని సెకండ్ల పాటు న్యూట్రల్ గేర్ లో ఉంటే, ఆటోమేటిక్ గా ఇంజిన్ ఆఫ్ అవుతుంది. రైడర్ మళ్లీ క్లచ్ పట్టుకోగానే మళ్లీ ఆటోమేటిక్ గా ఇంజిన్ ఆన్ అవుతుంది. కొత్తగా ప్యాషన్ ప్లస్ లో సైడ్ స్టాండ్ ఇండికేటర్, మొబైల్ ఫోన్ చార్జింగ్ కోసం యూఎస్బీ పోర్ట్ లను ఏర్పాటు చేశారు. ఇవి హ్యాండిల్ బార్ లో ఎడమవైపు ఉంటాయి. ఇవి కాకుండా, డిజిటల్ అనలాగ్ ఇన్ స్ట్రుమెట్ క్లస్టర్ తో పాటు డిజిటల్ లే ఔట్ లో ఫ్యుయెల్ గాగ్, ట్రిప్ మీటర్ ఉంటాయి. స్పీడో మీటర్ మాత్రం అనలాగ్ లో ఉంటుంది.
Hero Passion Plus colours: మూడు రంగుల్లో..
హీరో ప్యాషన్ ప్లస్ మూడు రంగుల్లో లభిస్తుంది. అవి రెడ్, బ్లాక్, బ్లూ. ఈ బైక్ కు 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ బైక్ 8000 ఆర్పీఎం వద్ద 7.91 బీహెచ్పీ పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుకవైపు ట్విన్ ట్యూబ్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. ఈ బైక్ కు కిక్ స్టార్టర్ తో పాటు సెల్ఫ్ స్టార్టర్ ఫెసిలిటీ ఉన్నాయి. అలాగే ఈ బైక్ కు 18 ఇంచ్ అలాయ్ వీల్స్ ను ఉపయోగించారు.
టాపిక్