Hero Passion Plus : మార్కెట్​లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న హీరో ప్యాషన్​ ప్లస్​..!-here are the expected features of the 2023 hero passion plus bike see full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Passion Plus : మార్కెట్​లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న హీరో ప్యాషన్​ ప్లస్​..!

Hero Passion Plus : మార్కెట్​లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న హీరో ప్యాషన్​ ప్లస్​..!

Sharath Chitturi HT Telugu
Apr 23, 2023 06:39 AM IST

Hero Passion Plus 2023 model : హీరో ప్యాషన్​ ప్లస్​.. మార్కెట్​లోకి రీ-ఎంట్రీ ఇస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ బైక్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హీరో ప్యాషన్​ ప్లస్​.. తిరిగొస్తోంది!
హీరో ప్యాషన్​ ప్లస్​.. తిరిగొస్తోంది!

Hero Passion Plus 2023 model : దేశీయ దిగ్గజ టూ-వీలర్​ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్​.. ప్యాషన్​ ప్లస్​ను తిరిగి ఇండియా మార్కెట్​లో లాంచ్​ చేయనుంది! త్వరలోనే ఈ హీరో ప్యాషన్​ ప్లస్​ 2023 మోడల్​ రోడ్ల మీద దర్శనమిస్తుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బైక్​పై ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాము..

హీరో ప్యాషన్​ ప్లస్​.. బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​!

2023 Hero Passion Plus : 2001లో 'ప్యాషన్​'ను ఇండియాలోకి తీసుకొచ్చింది హీరో మోటోకార్ప్​. సంస్థకు ఇదొక గేమ్​ ఛేంజర్​గా మారింది. అనేక ఏళ్ల పాటు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది. కాగా ప్యాషన్​ ప్లస్​కు మాత్రం కాస్త బ్రేక్​ వచ్చింది. ఈ మోడల్​ను సంస్థ తయారు చేయడం ఆపేసింది. ఇక ఇప్పుడు తన పోర్ట్​ఫోలియోను పెంచుకోవాలని చూస్తున్న హీరోమోటో కార్ప్​.. కొత్త కొత్త మోడల్స్​తో పాటు పాత వాటిని తిరిగి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ప్యాషన్​ ప్లస్​ త్వరలోనే ఇండియాలోకి తిరిగి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది.

2023 హీరో ప్యాషన్​ ప్లస్​- లుక్స్​..

Hero Passion Plus new model : పాత జనరేషన్​తో పోల్చి, డిజైన్​ పరంగా చూసుకుంటే.. హీరో ప్యాషన్​ ప్లస్​లో స్వల్పంగా అప్​గ్రేడ్స్​ ఉంటాయని తెలుస్తోంది. ఇందులో మస్క్యులర్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, సెమీ- ఫైర్డ్​ హెడ్​ల్యాంప్​ యూనిట్​, స్మాల్​ విండ్​ డిఫ్లెక్టర్​, ఫ్లాట్​ టైప్​ సింగిల్​ పీస్​ సీట్​, వైడ్​ హ్యాండిల్​బార్​, ఓవల్​ షేప్​ మిర్రర్స్​, సైడ్​ మౌంటెడ్​ ఎగ్సాస్ట్​, సెమీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ వంటివి లభిస్తాయి. బ్లాక్​డ్​ ఔట్​ మల్టీ స్పోక్​ అలాయ్​ వీల్స్​ కూడా ఇందులో ఉండొచ్చు.

2023 హీరో ప్యాషన్​ ప్లస్​- ఇంజిన్​..

ఈ హీరో ప్యాషన్​ ప్లస్​ 2023 మోడల్​లో 97.2సీసీ, ఎయిర్​ కూల్డ్​, ఫ్యూయెల్​ ఇంజెక్టెడ్​, సింగిల్​ సిలిండర్​, బాక్సర్​ టైప్​ ఇంజిన్​ ఉండే అవకాశం ఉంది. స్ప్లెండర్​ ప్లస్​ మోడల్​లోనూ ఇదే ఉంది. ఈ ఇంజిన్​ 8హెచ్​పీ పవర్​ను, 8ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 4 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

Hero Passion Plus price : సేఫ్టీ విషయానికొస్తే.. ఈ బైక్​ ఫ్రెంట్​లో డిస్క్​ బ్రేక్​, రేర్​లో డ్రమ్​ బ్రేక్​ ఉండొచ్చు. కంబైండ్​ బ్రేకింగ్​ సిస్టెమ్​ వంటి ఫీచర్స్​ లభించొచ్చు. సస్పెషన్స్​ కోసం ఫ్రెంట్​లో టెలిస్కోపిక్​ ఫోర్క్స్​, రేర్​లో అడ్జెస్టెబుల్​ డ్యూయెల్​ షాక్​ అబ్సార్బర్స్​ వంటివి వస్తాయి!

2023 హీరో ప్యాషన్​ ప్లస్​- ధర..

Hero Passion Plus on road price in Hyderabad : 2023 హీరో ప్యాషన్​ ప్లస్​ లాంచ్​ డేట్​తో పాటు ధరకు సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులో లేవు. అయితే.. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 75వేలుగా ఉంటుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఈ ప్రైజ్​ పాయింట్​లో లాంచ్​ అయ్యి, మైలేజ్​ కూడా డీసెంట్​గానే ఉంటే.. ఎంట్రీ- లెవెల్​ సెగ్మెంట్​లో ఈ బైక్​కి మంచి డిమాండ్​ ఉంటుందని మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం