Hero Motocorp Q3 results: రూ. 65 డివిడెండ్ ప్రకటించిన హీరో మోటోకార్ప్-hero motocorp q3 profit rises 4 yoy co declares interim dividend of 3250 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Hero Motocorp Q3 Profit Rises 4% Yoy; Co Declares Interim Dividend Of 3,250%

Hero Motocorp Q3 results: రూ. 65 డివిడెండ్ ప్రకటించిన హీరో మోటోకార్ప్

HT Telugu Desk HT Telugu
Feb 07, 2023 07:58 PM IST

Hero Motocorp Q3 results: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటో కార్ప్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. షేరు హోల్డర్లకు 3250% డివిడెండ్ ను కూడా ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Hero Motocorp Q3 results: ప్రముఖ భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) ఈ ఆర్థి సంవత్సరం మూడో త్రైమాసికంలో (Q3FY23) రూ. 711 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.

ట్రెండింగ్ వార్తలు

Hero Motocorp Q3 earnings: ఆదాయం 7 వేల కోట్లు

ఈ Q3 (Q3FY23) లో హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) నికర లాభాలు రూ. 711 కోట్ల కాగా, గత ఆర్థిక సంవత్సరం Q3 (Q3FY22)లో సంస్థ నికర లాభాలు రూ. 686 కోట్లు. అంటే, గత Q3 తో పోలిస్తే, ఈ Q3 లో హీరో మోటో కార్ప్ (Hero Motocorp) నికర లాభాలు 3.6% పెరిగాయి. హీరో మోటో కార్ప్ ఆపరేషన్స్ ఆదాయం ఈ Q3 లో రూ. 8,031 కోట్లు కాగా, గత Q3 లో ఆపరేషన్స్ ఆదాయం రూ. 7,883 కోట్లు.

Hero Motocorp interim dividend: రూ. 65 డివిడెండ్

ఈ Q3 (Q3FY23) ఫలితాలతో పాటు హీరో మోటో కార్ప్ (Hero Motocorp) తమ షేర్ హోల్డర్లకు రూ. 65 ల డివిడెండ్ ను కూడా ప్రకటించింది. డివిడెండ్ ఇవ్వడానికి రికార్డు తేదీగా ఫిబ్రవరి 17వ తేదీని నిర్ణయించింది. మార్చి 9వ తేదీ నాటికి షేర్ హోల్డర్ల బ్యాంక్ ఖాతాల్లో డివిడెండ్ జమ అవుతుందని హీరో మోటో కార్ప్ (Hero Motocorp) ప్రకటించింది. ఈ Q3 (Q3FY23) లో హీరో మోటో కార్ప్ (Hero Motocorp) మొత్తం నిర్వహణ ఖర్చులు రూ. 7,273.74 కోట్లు కాగా, గత Q3 (Q3FY22)లో ఇది రూ. 7,094 కోట్లు. ఈ Q3 హీరో మోటో కార్ప్ EBITDA ఆదాయం రూ. 924 కోట్లు. త్వరలో ప్రీమియం సెగ్మెంట్లో మరిన్ని వాహనాలను లాంచ్ చేయనున్నామని, దాంతో రానున్న రెండు, మూడు క్వార్టర్లలో సంస్థ లాభాలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నామని హీరో మోటోకార్ప్ Chief Financial Officer (CFO) నిరంజన్ గుప్తా తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడ్తున్నట్లు వివరించారు. ఫిబ్రవరి 7వ తేదీన హీరో మోటోకార్ప్ (Hero Motocorp) షేర్ విలువ 1.32% తగ్గి, రూ. 2,658.85 లకు చేరింది. హీరో మోటోకార్ప్ (Hero Motocorp) ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ. 52,915 కోట్లు.

WhatsApp channel