Hero Motocorp price hike : పెరిగిన ద్విచక్ర వాహనాల ధరలు.. పండుగ సీజన్​లో షాక్​!-hero motocorp hikes two wheeler prices by up to rs 1000 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Hero Motocorp Hikes Two-wheeler Prices By Up To <Span Class='webrupee'>₹</span>1,000

Hero Motocorp price hike : పెరిగిన ద్విచక్ర వాహనాల ధరలు.. పండుగ సీజన్​లో షాక్​!

Sharath Chitturi HT Telugu
Sep 23, 2022 07:28 AM IST

Hero Motocorp price hike : ద్విచక్ర వాహనాల ధరలను పెంచుతున్నట్టు హీరో మోటాకార్ప్​ ప్రకటించింది. పండుగ సీజన్​ని కూడా లెక్కచేయకుండా.. ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

పండుగ సీజన్​లో షాక్​.. పెరిగిన ద్విచక్ర వాహనాల ధరలు!
పండుగ సీజన్​లో షాక్​.. పెరిగిన ద్విచక్ర వాహనాల ధరలు!

Hero Motocorp price increase : పండుగ సీజన్​లో వినియోగదారులకు షాక్​ ఇచ్చింది.. దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్​. తమ ద్విచక్ర వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

మోటార్​సైకిళ్లు, స్కూటర్లపై రూ. 1000 వరకు  ధరలను పెంచుతున్నట్టు హీరో మోటోకార్ప్​ తెలిపింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్​లో పేర్కొంది. ద్విచక్ర వాహనాల ధరల పెంపు.. గురువారం నుంచే అమల్లోకి వచ్చేసింది.

Hero Motocorp price hike news : పండుగ సీజన్​లో..!

"ద్రవ్యోల్బణం కారణంగా ఖర్చులు పెరిగాయి. ఫలితంగా ధరల పెంపు నిర్ణయం తీసుకున్నాము. మోడల్​, మార్కెట్​కి తగ్గట్టు పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. గరిష్ఠంగా రూ. 1000 పెంచాము," అని హీరో మోటోకార్ప్​ ఓ ప్రకటనలో వెల్లడించింది.

హీరో మోటోకార్ప్​ వివిధ ద్విచక్ర వాహనాలను తయారీ చేస్తుంది. రూ. 55,450 ఉన్న హెచ్​ఎఫ్​ 100 నుంచి రూ. 1.36లక్షలు ఉన్న ఎక్స్​పల్స్​ 200 4వీ వరకు అనేక మోడల్స్​.. ఈ సంస్థ సొంతం.

సాధారణంగా పండుగ సీజన్​లో గిరాకీ ఎక్కువ ఉంటుంది. వాహనాల తయారీ సంస్థలకు పండుగ సీజన్​ అత్యంత కీలకం. ఆ సమయంలో ధరల పెంపు ఉండదు. కానీ ఈసారి మాత్రం ద్విచక్ర వాహనాల ధరలను పెంచుతున్నట్టు హీరో మోటోకార్ప్​ ప్రకటించడం వినియోగదారులకు షాక్​కు గురిచేసింది.

Vehicles price hike : వాహనాల ధరల పెంపు షురూ..!

హీరో మోటోకార్ప్​ ఒక్కటే కాదు.. ఇతర వాహనాల తయారీ సంస్థలు కూడా ధరల పెంపును మొదలుపెట్టాయి.! బొలేరో, బొలేరో నియో వాహనాల ధరలను పెంచుతున్నట్టు మహీంద్రా అండ్​ మహీంద్రా ఇటీవలే ప్రకటించింది. రానున్న రోజుల్లో మరిన్ని సంస్థలు కూడా వాహనాల ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చు!

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్