Hero Super Splendor బైక్‌లో సరికొత్త Canvas Black Edition విడుదల, ధర రూ.77 వేలు-hero super splendor canvas black edition launched at inr 77430
Telugu News  /  Lifestyle  /  Hero Super Splendor Canvas Black Edition Launched At Inr 77,430
Hero Super Splendor Canvas Black Edition
Hero Super Splendor Canvas Black Edition

Hero Super Splendor బైక్‌లో సరికొత్త Canvas Black Edition విడుదల, ధర రూ.77 వేలు

26 July 2022, 15:16 ISTHT Telugu Desk
26 July 2022, 15:16 IST

హీరో మోటోకార్ప్ భారతీయ మార్కెట్‌లో సూపర్ స్ల్పెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ను విడుదల చేసింది, దీని ధరలు రూ.77,430 నుండి ప్రారంభమవుతాయి.

Hero Super Splendor Canvas Black Edition | హీరో మోటోకార్ప్ తాజాగా తమ బ్రాండ్ నుంచి పాపులర్ మోడల్ అయినటువంటి సూపర్ స్ల్పెండర్ ద్విచక్ర వాహన శ్రేణిలో ఆకర్షణీయమైన కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ సరికొత్త కమ్యూటర్ బైక్ డ్రమ్ బ్రేక్ అలాగే డిస్క్ బ్రేక్ అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 77,430/- ఉండగా, డిస్క్ బ్రేక్స్ ఉన్న బైక్ వేరియంట్ ధర రూ. రూ. 81,330/- గా ఉంది. ఈ కొత్త ఎడిషన్ మోటార్‌సైకిల్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమైనాయి. ఆసక్తి కలవారు Hero MotoCorp eShopలో ఆన్‌లైన్‌లో ప్రీబుకింగ్ చేసుకోవచ్చు.

డిజైన్ పరంగా కొత్త సూపర్ స్ల్పెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ పూర్తిగా బ్లాక్ పెయింట్‌ను కలిగి ఉంది. ఇంధన ట్యాంక్‌పై క్రోమ్ 'సూపర్ స్ల్పెండర్' బ్యాడ్జ్‌ ఇచ్చారు. హెడ్‌లైట్ దగ్గర, ఎగ్జాస్ట్ హీట్ షీల్డ్‌పై మరిన్ని క్రోమ్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. మిగతా డిజైన్ పూర్తిగా ప్రామాణిక స్ల్పెండర్ బైక్ లాగే ఉంటుంది. సింగిల్-పాడ్ హెడ్‌లైట్, లేతరంగు గల విజర్, సింగిల్-పీస్ సీటు, అల్లాయ్-వీల్స్, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్‌ మొదలైనవి ఎప్పట్లాగే ఉన్నాయి.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

సూపర్ స్ల్పెండర్ ఇంజన్ కెపాసిటీని పరిశీలిస్తే ఇందులో 125cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 7,500 rpm వద్ద 10.7 BHP శక్తిని అలాగే 6,000 rpm వద్ద 10.6 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్‌ను 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.

హార్డ్‌వేర్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు డ్యుఎల్ స్ప్రింగ్‌లు ఉన్నాయి. డిస్క్, డ్రమ్ వేరియంట్లలో స్టాండర్డ్ గా సేఫ్టీ నెట్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

ఇంకా సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, USB ఛార్జర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

సంబంధిత కథనం

టాపిక్