Hero MotoCorp hikes prices: హీరో బైక్ కొనే ప్లాన్ ఉందా? త్వరపడండి మరి..-hero motocorp hikes prices for fourth time this fiscal ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Hero Motocorp Hikes Prices For Fourth Time This Fiscal

Hero MotoCorp hikes prices: హీరో బైక్ కొనే ప్లాన్ ఉందా? త్వరపడండి మరి..

HT Telugu Desk HT Telugu
Nov 25, 2022 10:14 PM IST

Hero MotoCorp hikes prices: భారత్ లో అతిపెద్ద ద్వి చక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. త్వరలో తమ బైక్స్ ధరలు పెంచనున్నామని వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Hero MotoCorp hikes prices: త్వరలో తమ ద్విచక్ర వాహనాల ధరలను పెంచుతున్నామని హీరో మోటో కార్ప్ ప్రకటించింది. ఈ ధరల పెంపు అన్ని బైక్ లు, స్కూటర్లపై ఉంటుందని స్పష్టం చేసింది. డిసెంబర్ 1 నుంచి తాము ఉత్పత్తి చేసే అన్ని ద్విచక్ర వాహనాల ధరలు పెరగనున్నాయని వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Hero MotoCorp hikes prices: ఈ సంవత్సరం ఇది నాలుగో సారి

ఈ ఆర్థిక సంవత్సరంలో హీరో సంస్థ బైక్ ల ధరలను పెంచడం ఇది నాలుగో సారి. చివరగా సెప్టెంబర్ నెలలో ఎక్స్ షోరూమ్ ధరపై రూ. 1000 వరకు ధరను పెంచింది. కాగా, త్వరలో బజాజ్, టీవీఎస్ కూడా తమ వాహన శ్రేణి ధరలను పెంచే అవకాశముందని తెలుస్తోంది. అయితే, టీవీఎస్ సంస్థ అక్టోబర్ నెలలోనే తమ ద్విచక్ర వాహనాల ధరను పెంచింది. బజాబ్ మాత్రం జులై తరువాత వాహనాల ధరలను పెంచలేదు.

Hero MotoCorp hikes prices: విడి భాగాల ధరల వల్లనే..

విడి భాగాల ధరలు పెరగడం వల్ల బైక్స్ ధరలను పెంచక తప్పడం లేదని హీరో సంస్థ తెలిపింది. బైక్ మోడల్ ను, రాష్ట్రాన్ని బట్టి ఎక్స్ షో రూమ్ ధరపై రూ. 1500 వరకు ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ ధరల పెరుగుదల ఒత్తిడిని తట్టుకునేలా కస్లమర్లకు సులువైన ఫైనాన్స్ ఆఫర్లను అందిస్తామని తెలిపింది. అయితే, ధరల పెరుగుదల వాహనాల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాహన డీలర్లు అభిప్రాయపడుతున్నారు. వాహనాల అమ్మకాలు తగ్గిపోతాయని, ఆ మేరకు లాభాల్లోనూ కోత పడుతుందని వివరించారు. అదీకాక, ప్రస్తుతం నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు పెరుగుతూ, వినియోగిదారుడిపై పెను భారం పడుతోందని, ఇదే సమయంలో వాహనాల ధరలను పెంచడం వల్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. అలాగే, మార్కెట్ లీడర్ గా ఉన్న సంస్థ వాహన ధరలను పెంచితే, మిగతా సంస్థలు కూడా తమ వాహనాల ధరలను పెంచడం రివాజని వెల్లడించారు.

WhatsApp channel

టాపిక్