తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​- పేటీఎం షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- పేటీఎం షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే!

Sharath Chitturi HT Telugu

02 September 2024, 8:50 IST

google News
    • Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఇందులో బ్రేకౌట్​ స్టాక్స్​ వివరాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు..
స్టాక్స్​ టు బై టుడే..,
స్టాక్స్​ టు బై టుడే..,

స్టాక్స్​ టు బై టుడే..,

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లోగా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 231 పాయింట్లు పెరిగి 82,366 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 84 పాయింట్లు పెరిగి 25,236 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 198 పాయింట్లు పెరిగి 51,351 వద్దకు చేరింది.

నిఫ్టీ షార్ట్​టర్మ్​ ట్రెండ్​ సానుకూలంగానే ఉందని, అయితే మార్కెట్ కొత్త గరిష్టాలకు ఇప్పుడే చేరుకోలేకపోవచ్చని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి అన్నారు. 25,300 నుంచి 25,400 స్థాయిల మధ్య రెసిస్టెన్స్​ ఉండటంతో నిఫ్టీ మరింత కన్సాలిడేషన్ లేదా స్వల్ప క్షీణతను ఆశించవచ్చని అన్నారు. ఈ రోజు నిఫ్టీకి సపోర్ట్​ 25,100 వద్ద ఉంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 5318.14 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3198.07 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాటగా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

ఇదీ చూడండి:- Sales Data : ఆగస్టు నెలలో పడిపోయిన మారుతి సుజుకి, టాటా మోటార్స్ అమ్మకాలు.. షేర్ల ధరపై ఎఫెక్ట్!

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్​ 0.55శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.01శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్​ 1.13 శాతం పతనమైంది.

సోమవారం అమెరికా స్టాక్​ మార్కెట్​లకు సెలవు ఉంటుంది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఆసియా మార్కెట్​లు ఫ్లాట్​గా ట్రేడ్​ అవుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

సఫారీ ఇండస్ట్రీస్: రూ.2476.20 వద్ద కొనండి, టార్గెట్ రూ.2615, స్టాప్ లాస్​​ రూ.2390.

పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్: రూ.977.45 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1030, స్టాప్ లాస్ రూ.940

యాక్సిస్ బ్యాంక్: రూ.1175 వద్ద కొనండి, టార్గెట్ రూ.1215, స్టాప్ లాస్ రూ.1145

బలరాంపూర్ చిని: రూ.600 వద్ద కొనండి, టార్గెట్ రూ.628, స్టాప్ లాస్ రూ.580

బిర్లాసాఫ్ట్: రూ.670 వద్ద కొనండి, టార్గెట్ రూ.715, స్టాప్ లాస్ రూ.650

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ప్లాస్టిబ్లెండ్స్ ఇండియా: రూ.359.20 వద్ద కొనండి, టార్గెట్ రూ.377, స్టాప్ లాస్ రూ.345

పేటీఎం: రూ.621.90, టార్గెట్ రూ.653, స్టాప్ లాస్ రూ.599

అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్: రూ.88.76 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.93.50, స్టాప్ లాస్ రూ.85.50

హ్యూబాచ్ కలరెంట్స్ ఇండియా: రూ.588 వద్ద కొనండి, టార్గెట్ రూ.622, స్టాప్ లాస్ రూ.568

ఏడీఎస్​ఎల్​: రూ.265 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.280, స్టాప్ లాస్ రూ.256

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం