Stock market psychology : ఇది తెలిస్తే.. స్టాక్ మార్కెట్లో కోట్ల సంపద మీ సొంతం!
28 January 2024, 12:59 IST
- How to make money in stock market : స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడం ఎలా? కోట్ల సంపదను సృష్టించుకోవడం ఎలా? ఈ ఒక్క విషయం తెలుసుకుంటే.. మీ ప్రశ్నలకు సమాధానం దొరికినట్టే!
ఇది తెలిస్తే.. స్టాక్ మార్కెట్లో కోట్ల సంపద మీ సొంతం!
Stock market tips in Telugu : వారెన్ బఫెట్, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా లాగా.. భారీ సంపదను సృష్టించుకోవాలన్న ఆశలతో.. చాలా మంది స్టాక్ మార్కెట్లోకి అడుగు పెడుతున్నారు. కానీ.. సంపద సృష్టిని పక్కన పెడితే.. చాలా మంది కష్టంతో సంపాదించిన డబ్బులను కూడా పోగొట్టుకుంటున్నారు. ఆ తర్వాత తిరిగి మార్కెట్లవైపు చూడటానికి భయపడుతున్నారు. స్టాక్ మార్కెట్‌ను ఒక గ్యాంబ్లింగ్ అని ఫిక్స్ అవుతున్నారు. వాస్తవానికి.. స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాకపోయినా.. కానీ 'అసాధ్యం' కాదు! స్టాక్ మార్కెట్లో సక్సెస్ సాధించిన ఎందరో ఇందుకు అసలైన నిదర్శనం. మరి స్టాక్ మార్కెట్లో కోట్లు కోట్లు ఎలా సంపాదించుకోవాలి? తప్పుల నుంచి ఎలా నేర్చుకోవాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము రండి..
ట్రేడింగ్‌లో సైకాలజీ చాలా ముఖ్యం..!
స్టాక్ మార్కెట్‌ని.. డబ్బులు ఇచ్చే యంత్రంగా చూస్తున్నారా? అయితే మీ మైండ్‌సెట్‌ని మార్చుకోవాలి. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగంలో చేరి డబ్బులు సంపాదిస్తాము.. కానీ స్టాక్ మార్కెట్ విషయానికొచ్చే సరికి వెంటనే, వేగంగా సంపద వచ్చేయాలని భావిస్తుంటాము. ఈ సైకాలజీ కరెక్ట్ కాదు! మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే.. సైకాలజీ చాలా ముఖ్యం
స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడం ఓ పెద్ద జర్నీ చేసినట్టే.. పెద్ద యుద్ధం చేసినట్టే! ఈ జర్నీలో ఎన్నో కష్టాలు, నష్టాలు ఉంటాయి. ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ ప్రయాణంలో ముందు మనల్ని మనం తెలుసుకోవాలి! మనకి స్టాక్ మార్కెట్లో ఏ స్ట్రాటజీ సెట్ అవుతోంది? నష్టాల వెనక మన తప్పులు, సైకాలజీలో లోపాలు ఏమైనా ఉన్నాయా? లేక మార్కెట్ ఒడుదొడుకుల్లో మనం డబ్బులు కోల్పోతున్నామా? అన్నది అర్థం చేసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. ఆ టైమ్‌లో.. రిస్క్ మేనేజ్మెంట్కి వాల్యూ ఇస్తూ, డబ్బులు పోగొట్టుకోకుండా మార్కెట్లో నిలబడాలి. క్యాపిటల్ పూర్తిగా నష్టపోతే.. రేపు అనే రోజున మార్కెట్లో ఉండటమే సాధ్యం అవ్వదు కదా!
How do successful traders think : స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్ ఎనాలసిస్‌తో డబ్బులు సంపాదిచుకోవచ్చు. లేదా.. టెక్నికల్ ఎనాలసిస్తోనూ సంపద సృష్టించుకోవచ్చు. లేదా.. ఆ రెండింటినీ కలిపి కూడా కోట్లు సంపాదించుకోవచ్చు. వాటిల్లో మనకి ఏది సెట్ అవుతుందో ముందు తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్లో మనకి మనతోనే పోటీ.. మనకి మనమే పోటీ..! అందుకే సైకాలజీని మెరుగుపరుచుకుంటూ ఎప్పటికప్పుడు ముందుకు వెళ్లాలి.
అలా చేస్తే.. ఇక నష్టాలే..!
స్టాక్ మార్కెట్లో ఒక్కసారి ఎంట్రీ ఇస్తే.. చాలా మంది మనల్ని ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ముందు మనం గ్రహించాలి. వారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. కొన్ని సందర్భాల్లో.. మనమే అత్యాసకు పోయి.. టిప్స్ కోసం ప్రయత్నాలు చేస్తాము డబ్బులు కట్టి టిప్స్ తీసుకుని వాటిని అమలు చేస్తూ ఉంటాము. ఇది తప్పు! ఎవరో చెప్పారు కదా అని మనం స్టాక్స్‌ని బై, సెల్ చేయకడం ఉత్తమం కాదు. ఒక స్టాక్‌ని కొనాలన్నా, అమ్మాలన్నా.. దాని వెనక చాలా రీసెర్చ్ చేయాలి. అందుకే గుంపులో గోవిందా.. లాగా కాకుండా మనకుంటూ సొంతంగా సెటప్ ఉంటే దీర్ఘకాలంలో అద్భుత సృష్టి సాధ్యమవుతుంది. ట్రేడింగ్‌లో సక్సెస్ అయిన వారు చేసింది ఇదే!
Stock market tips and tricks : స్టాక్ మార్కెట్లో చాలా మంది చేసే తప్పు 'టైమింగ్'. మార్కెట్లను టైమ్ చేయాలని చాలా మంది చూస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా.. అది అస్సలు జరగని పని! కొన్ని సందర్భాల్లో లక్ వల్ల మార్కెట్‌ను టైమ్ చేయగలమేమో కానీ.. అన్నిసార్లు అలా జరగదు. అందుకే మార్కెట్‌ను టైమ్ చేయకుండా.. దానితో పాటు జర్నీ చేయాలి. లాస్‌లు తీసుకోవాలి. ప్రాఫిట్లను చూడాలి. ఏం వచ్చినా.. స్టేబుల్‌గా ఉండాలి.
క్రమశిక్షణతోనే కోట్ల సంపద సాధ్యం..!
స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే క్రమ శిక్షణ చాలా ముఖ్యం. చాలా అవసరం. మార్కెట్‌కు ఎప్పుడు దూరంగా ఉండాలి, ఎప్పుడు యాక్టివ్‌గా ఉండాలో అర్థం చేసుకోవాలి. దూరంగా ఉండాల్సిన సమయం అని తెలిసి కూడా యాక్టివ్‌గా ఉంటే.. డబ్బులు కోల్పోతాము.
Stock market tips for beginners : అందుకే లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్‌లో అద్భుత రిటర్నులు ఇస్తాయి. దీర్ఘకాల ప్రణాళికలు ఉంటే.. క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడుతూ ఉండాలి. అప్పుడు ఒడిదొడుకులను జయించవచ్చు.
సైకాలజీతోనే విజయం..!
ఎమోషన్స్‌పై కంట్రోల్ లేకపోతే స్టాక్ మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడలేరు. లాజికల్‌గా ఆలోచించాల్సిన చోట.. ఎమోషనల్‌గా ఉంటే తప్పులు చేస్తూ డబ్బులు కోల్పోతాము. స్టాక్ మార్కెట్లో ఎమోషన్స్‌కు స్థానం ఉండదు. లాస్ వస్తే యాక్సెప్ట్ చేయాలి. లాభాలొస్తే.. ప్రశాంతంగా ఉండాలి.
How can I start learning stock market : చివరిగా ఒక్క మాట. మార్కెట్‌తో జర్నీ చేస్తే.. ఆ మార్కెటే మనకి చాలా నేర్పిస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశయంతో స్టాక్ మార్కెట్లోకి రాకపోవడం బెటర్. ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ.. ఒడిదొడుకులతో ముందుకెళుతూ ఉంటే.. మీ సక్సెస్ జర్నీ సూపర్‌గా ఉంటుంది.
టాపిక్