2024 Market Strategy: ఈ స్ట్రాటజీ తెలిసిన వారికే స్టాక్ మార్కెట్లో లాభాలు!
2024 Market Strategy : 2023లో స్టాక్ మార్కెట్ బాగా రాణించాయి. మరి 2024లో పరిస్థితేంటి? ఏ స్ట్రాటజీ అప్లై చేస్తే మంచి లాభాలు వస్తాయి? అన్న విషయాలను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
2024 Market Strategy : దేశీయ స్టాక్ మార్కెట్లు.. రెండంకెల వృద్ధితో 2023ని ముగించనున్నాయి. వరుసగా 8వ ఏడాది.. సానుకూల రిటర్నులు ఇచ్చాయి దేశీయ సూచీలు. అంచనాలను తలకిందులు చేస్తూ.. సూచీలు ఈ ఏడాది నూతన గరిష్ఠాలను తాకడం విశేషం. అయితే.. 2024లో మార్కెట్లను ప్రభావితం చేసే ఈవెంట్లు చాలా ఉన్నాయి. వీటితో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు స్టాక్ మార్కెట్ నిపుణులు.
2023లో ఇలా..
నిఫ్టీ 18 శాతం లాభాలతో 21,593 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, ప్రపంచ ద్రవ్యోల్బణం, పెరుగుతున్న చమురు ధరలు, యుఎస్ 10 ఇయర్ బాండ్ యూల్డ్ గరిష్ఠ స్థాయిని తాకడం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ.. భారత మార్కెట్ చారిత్రక మైలురాయికి చేరుకోవడం విశేషం.
2024లో ఇన్వెస్టర్లు ఇలా చేయాలి..!
Stock market outlook 2024 : ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎఫ్ఐఐలు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖ పట్టడం, మాక్రో ఎకనామిక్స్ డేటా మెరుగుపడటం, రేట్ హైక్ లేకపోవడంతో పాటు రేట్ కట్స్‌పై ఆశలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న అంచనాల మధ్య ఇండియా స్టాక్ మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ నెలకొంది.
అయితే.. రాబోయే ఏడాదిలో మదుపర్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
"నిర్దిష్ట రంగాలకు "దూరంగా ఉండండి" అని చెప్పినా, దానిని పాటించడం కష్టమే. కానీ మార్కెట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒడుదొడుకులు సహజం. ఎప్పుడూ మార్కెట్లోనే ఉండాలని భావించడం బదులు.. అవకాశాలు ఎక్కడ దొరుకుతాయనే వాటిపై దృష్టి పెట్టండి. రంగాల వారీగా కాకుండా స్టాక్ మార్కెట్ క్యాప్ పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోండి. ప్రస్తుత వాల్యుయేషన్ల ఆధారంగా అవి సురక్షితంగా కనిపిస్తాయి. కాబట్టి స్వల్పకాలికంగా లార్జ్ క్యాప్స్ వైపు నిధులను మళ్లించండి. ఇక మదుపర్లు పెట్టుబడి పెట్టే ముందు స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి ఇప్పటికే చాలా పెరిగిపోయాయి," అని ట్రేడ్‌జీనీ సీఓఓ త్రివేశ్ డీ తెలిపారు.
Stock market news today : “వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ కదలికలను సరిగ్గా అంచనా వేయడం కష్టం. అలాగే, బడ్జెట్ సమయంలో ఏ రంగమైనా ప్రతికూల లేదా సానుకూల ప్రభావాలను చూడవచ్చు. కాబట్టి, ఆ సమయంలో అత్యంత అస్థిర రంగాలకు దూరంగా ఉండటం మంచిది. బడ్జెట్ బయటకు వచ్చి, దానిని మీరు విశ్లేషణ చేసిన తర్వాతే, పెట్టుబడి పెట్టండి,” అని త్రివేశ్ డీ తెలిపారు.
ఆ స్టాక్స్‌తో జాగ్రత్త..!
“సరైన బిజినెస్ లేని, కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో నిత్యం సమస్యలు ఎదుర్కొనే సంస్థలకు దూరంగా ఉండండి. క్యాపిటల్ మార్కెట్లలోకి ప్రవేశించే ముందు వాల్యుయేషన్లు, రిస్క్-రివార్డు రేషియోను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. మార్కెట్లు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో, రిస్క్- రివార్డ్‌ని చూసి.. అవసరాలకు అనుగుణంగా అసెట్స్‌ని కేటాయించుకోవాలి. ఇప్పటికే ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ని రీబ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే, స్టాక్ ఎంపికలో జాగ్రత్త వహించడం, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న హై క్వాలిటీ కంపెనీలపై మాత్రమే దృష్టి పెట్టడం శ్రేయస్కరం,” అని యెస్ సెక్యూరిటీస్ ఇండియా ఎండీ- సీఈఓ అన్షుల్ అర్జారే తెలిపారు.
Best strategy for stock market investment : “ వాల్యుయేషన్స్‌కు సంబంధమే లేకుండా.. పెరిగిపోయిన స్మాల్ క్యాప్ స్టాక్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఎస్ఎంఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మానుకోవాలి. ఎందుకంటే వాటిలో చాలా వరకు ఐపిఓల సమయంలోనే అధిక ధర కలిగి ఉంటాయి. అంతేకాకుండా.. సాధారణంగా కొన్ని నెలల ట్రేడింగ్‌లోనే వాటి లిస్టింగ్ స్థాయి కంటే దిగువకు పడిపోతాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అస్థిరత ఊపందుకోవడం మొదలుపెడితే ఈ రెండు గ్రూపుల్లో కరెక్షన్స్ స్పష్టంగా కనిపిస్తాయి," అని సామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ ఎనలిస్ట్ పారుల్ శర్మ అభిప్రాయపడ్డారు.
“వచ్చే ఏడాదిలో చాలా రంగాలు సానుకూలంగా ఉంటాయని అంచనా వేసినప్పటికీ, రాబోయే నెలల్లో మెటల్ స్పేస్‌కి దూరంగా ఉండటం మంచిది. రానున్న నెలల్లో ఇవి కన్సాలిడేట్ అవ్వొచ్చు. ఇయర్లీ ఛార్ట్‌లో 'హ్యాంగిగ్ మ్యాన్' నమూనా ఏర్పడింది. 2024లో కరెక్షన్, కన్సాలిడేషన్ కనిపించొచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన రూపక్ దే తెలిపారు.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం