What is swing trading : స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఎలా చేయాలి?
What is swing trading : స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చారా? స్వింగ్ ట్రేడింగ్ గురించి తెలుసుకోవాలని చూస్తున్నారా? అయితే.. ఇది మీకోసమే..
What is swing trading : స్టాక్ మార్కెట్‌పై ప్రజల్లో ఆసక్తి ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతోంది. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతోంది. వీరిలో మీరు ఉన్నారా? ట్రేడింగ్‌ని సెకెండరీ ఇన్కమ్ సోర్స్‌గా మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? కానీ.. 9-5 జాబ్‌లో మార్కెట్లను ట్రాక్ చేయడం కష్టమవుతోందని బాధపడుతున్నారా? అయితే.. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్లో సామాన్యుడికి ఉన్న ఆయుధం 'స్వింగ్ ట్రేడింగ్' గురించి మీరు తెలుసుకోవాల్సిందే..
స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసా?
సాధారణంగా స్టాక్స్ అనేవి ఒడుదొడుకులకు గురవుతూ ఉంటాయి. పైకి, కిందకి కదులుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో.. స్టాక్ మూమెంట్‌ని, ట్రెండ్‌ని గమనించి.. స్వల్పకాలంలో దాని నుంచి లబ్ధిపొందడమే 'స్వింగ్ ట్రేడింగ్' అర్థం.
స్వింగ్ ట్రేడింగ్- ఇంట్రాడే ట్రేడింగ్ అనేవి వినడానికి ఒకే విధంగా ఉన్నా.. వాటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ట్రేడ్‌ను అదే రోజు క్లోజ్ చేయాలి. నెక్ట్స్ డే కి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. కానీ స్వింగ్ ట్రేడింగ్‌లో అలా కాదు. సాధారణంగా.. రెండు రోజుల నుంచి 2,3 వారాల వరకు కొనసాగే ట్రేడ్‌ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు.
స్వింగ్ ట్రేడింగ్‌లో 'టైమ్‌ఫ్రేమ్' అనేది కీలకం. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 30నిమిషాలు, 15నిమిషాలు, 5నిమిషాలను చూస్తారు. కానీ స్వింగ్ ట్రేడింగ్‌లో సాధారణంగా టైమ్‌ఫ్రేమ్ 1 గంట, 4గంటలు, ఒక రోజుగా పరిగణిస్తారు ట్రేడర్లు.
Swing trading meaning : స్టాక్ మార్కెట్ అంటేనే రిస్కీ వ్యవహారం. కానీ ఎంత తక్కువ టైమ్ ఫ్రేమ్ ఉంటే అంత ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నట్టు అవుతుంది. అంటే.. ఇంట్రాడే కన్నా స్వింగ్ ట్రేడింగ్‌లో రిస్క్ కాస్త తక్కువగా ఉంటుంది.
స్వింగ్ ట్రేడింగ్‌తో ఉపయోగాలేంటి..?
స్వింగ్ ట్రేడింగ్ అనేది స్టాక్ మార్కెట్లో ట్రేడర్లకు ఓ పవర్ఫుల్ ఆయుధం లాంటిది. స్వింగ్ ట్రేడింగ్‌తో కోట్లల్లో సంపాదిస్తున్న ట్రేడర్లు చాలా మంది ఉంటారు.
ఇంట్రాడే ట్రేడింగ్‌లో చాలా ఫోకస్డ్గా ఉండాలి. ప్రతి రోజు స్టాక్స్‌ని ట్రాక్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. కానీ.. 9-5 ఉద్యోగాలు చేసుకునేవారు ఇంట్రాడే చేయలేరు. వారు ఇంటికి తిరిగి వచ్చేసరికే స్టాక్ మార్కెట్ల టైమ్ అయిపోతుంది. అలాంటి వారికి 'స్వింగ్ ట్రేడింగ్' అనేది బెస్ట్ ఆప్షన్..
Best swing trading strategies : స్వింగ్ ట్రేడింగ్‌పై పట్టుసాధిస్తే.. ఇంట్రాడే విధంగా దానిపై అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉండదు. మన ఎనాలసిస్‌పై నమ్మకం ఉంచి.. స్టాక్‌లో ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్‌లాస్‌ను ముందే ప్లాన్ చేసుకోవచ్చు. ఏఎంఓ(ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్)ను ముందు రోజే ఫిక్స్ చేసుకుంటే.. మనం ఆఫీసులో ఉన్నా, అనుకున్న ఎంట్రీ దగ్గర స్టాక్ కొనుగోలు చేయగలుగుతాము. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లాక.. రాత్రి పూట ఒక 30నిమిషాల నుంచి గంట సేపు సమయం కేటాయిస్తే చాలు!
స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలో తెలుసా?
స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే ముందు టెక్నికల్ ఎనాలసిస్ తెలుసుకోవాలి. స్టాక్స్ ఛార్ట్‌ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కొంత కాలం వాటిని ట్రాక్ చేస్తూ ఉండాలి. స్టాక్ అనేది ఏ ట్రెండ్‌లో ఉంది? అని అర్థం చేసుకోవాలి. మనకంటూ ఒక సెటప్ ఉండాలి.
స్వింగ్ ట్రేడింగ్ చేసేందుకు కొన్ని ప్రత్యేక స్ట్రాటజీలు ఉంటాయి. కొందరు 'ఇండికేటర్ల' ఆధారంగా స్వింగ్ ట్రేడ్ చేస్తారు. ఇంకొందరు 'ఛార్ట్ పాటర్న్' ఆధారంగా ట్రేడింగ్ చేస్తారు. ఇంకొందరు.. ఆ రెండింటినీ కలిపి ఎనాలిస్ చేసి ట్రేడ్ తీసుకుంటారు. అందుకే వాటిపై పట్టు సాధించాలి.
Best swing trading strategies in Telugu : సాధారణంగా స్వింగ్ ట్రేడింగ్‌లో రిస్క్- రివార్డ్ రేషియోను 1:2గా చూస్తూ ఉంటారు ట్రేడర్లు. అంటే.. మనం రెండు రూపాయిల లాభం కోసం ఒక్క రూపాయి నష్టపోవడానికి సిద్ధపడినట్టు అవుతుంది.
స్వింగ్ ట్రేడింగ్‌లో నష్టాలు ఉంటాయా?
స్టాక్ మార్కెట్లో ఏదైనా ఈజీ కాదు. స్వింగ్ ట్రేడింగ్‌లో కూడా రిస్క్ ఉంటుంది. మన స్ట్రాటజీలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. స్టాప్‌లాస్‌లు హిట్ అవ్వచ్చు. కానీ స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అని అనుకునే వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తీసుకునే అన్ని ట్రేడ్స్ లాభాల్లోనే ఉండాలన్న మైండ్‌సెట్‌ని మార్చుకోవాలి. నష్టాలనేవి.. స్టాక్ మార్కెట్లో సాధారణమైన విషయం. తీసుకున్న 10 ట్రేడ్స్‌లో.. 1:2 రేషియోలో.. 6-7 సక్సెస్ అయినా మనం లాభాల్లో ఉంటాము.
Swing trading in Telugu : అయితే.. స్వింగ్ ట్రేడింగ్‌లో ఒక పెద్ద మైనస్ పాయింట్ ఉంది. ఇంట్రాడేలో అదే రోజు ట్రేడ్‌ను మూసేయవచ్చు కాబట్టి.. నెక్స్ట్ డే ఏం జరుగుతుంది? అన్న ఆలోచన, ఆందోళన ఉండదు. కానీ.. స్వింగ్ ట్రేడింగ్‌లో అలా కాదు. మార్కెట్ల కదలికలను ఎవరూ ఊహించలేరు. రాత్రికి రాత్రికి పరిస్థితులు మారిపోవచ్చు. మార్కెట్లు తెరుచుకునేలోపే నష్టాలు వచ్చేస్తాయి. ఆ రిస్క్‌కి సిద్ధపడే ముందుకు వెళ్లాలి.
స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్, ట్రేడింగ్ స్ట్రాటజీలు చూడటానికి, వినడానికి సింపుల్‌గా ఉంటాయి. కానీ వాటి లోతు.. దిగితేనే అర్థమవుతుంది! చాలా మంది ట్రేడర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడతారు. వారందరి కన్నా మనదే పైచేయి ఉండాలంటే.. మనకంటూ ఒక 'ఎడ్జ్' కావాలి. ఆ ఎడ్జ్ అనేది.. ఎప్పటికప్పుడు పేపర్ ట్రేడింగ్ చేస్తూ.. మనల్ని మనం సరిచేసుకుంటూ, లాస్‌లు చూస్తూ, మనకంటూ ఒక సెటప్‌ని ఏర్పాటు చేసుకుంటేనే వస్తుంది. ఆ ఎడ్జ్ కోసం చాలా ఏళ్లు కష్టపడాల్సి ఉంటుంది.
Stock market news today : స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీలు తెలుసుకోవడం ఒక ఎత్తు.. సైకాలజీని మేనేజ్ చేసుకోవడం మరో ఎత్తు! ట్రేడర్ల సక్సెస్‌ని నిర్ణయించేది సైకాలజీనే! సరైన సైకాలజీ ఉంటే.. కష్టాలను తట్టుకుని.. రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటూ దీర్ఘకాలంలో మంచి రిటర్నులను సంపాదించుకోవచ్చు. లేకపోతే.. ఎన్ని లాభాలు వచ్చినా.. అవన్నీ మాయమైపోవడానికి ఒక్క లాస్ ట్రేడ్ చాలు!
సంబంధిత కథనం