తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sovereign Gold Bond : సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 4 ఇష్యూ ప్రైజ్​ ఫిక్స్​- ఎంతంటే..

Sovereign Gold Bond : సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 4 ఇష్యూ ప్రైజ్​ ఫిక్స్​- ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

09 February 2024, 13:31 IST

google News
    • Sovereign Gold Bonds 2023-24 Series 4 : సావరిన్​ గోల్డ్​ బాండ్​ 2023-24 సిరీస్​ 4 ఇష్యూ ప్రైజ్​ ఫిక్స్​ అయ్యింది. సబ్​స్క్రిప్షన్​ డేట్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 4 ఇష్యూ ప్రైజ్​ ఎంతంటే..
సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 4 ఇష్యూ ప్రైజ్​ ఎంతంటే..

సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 4 ఇష్యూ ప్రైజ్​ ఎంతంటే..

Sovereign Gold Bond Series 4 issue price : సావరిన్​ గోల్డ్​ బాండ్​ 2023-24 సిరీస్​ 4 సబ్​స్క్రిప్షన్​.. ఈ నెల 12న ఓపెన్​ అవ్వనుంది. సబ్​స్క్రిప్షన్​ చివరి తేది.. ఫిబ్రవరి 16. ఈ నేపథ్యంలో ఈ సావరిన్​ గోల్డ్​ బాండ్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 4..

సావరిన్​ గోల్డ్​ బాండ్​ ఇష్యూ ప్రైజ్​ని గ్రాముకు రూ. 6,199గా ఫిక్స్​ చేశారు. 5 రోజుల పాటు ఉండే సబ్​స్క్రిప్షన్​ పీరియడ్​లో ఈ గోల్డ్​ బాండ్స్​ని కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా.. ఆన్​లైన్​ లేదా డిజిటల్​ మార్గాల్లో ఈ సావరిన్​ గోల్డ్​ బాండ్స్​ని కొంటే.. గ్రాముపై రూ. 50ని తగ్గిస్తున్నారు. ఇష్యూ డేట్​ ఫిబ్రవరి 21గా ఉంది.

Sovereign Gold Bond Series 4 subscription date : ఇన్​వెస్ట్​మెంట్​కు బంగారం అనేది ఒక మంచి ఆప్షన్​. అయితే భారతీయుల్లో చాలా మంది ఫిజికల్​ గోల్డ్​ని కొని, అదే ఇన్​వెస్ట్​మెంట్ అని అనుకుంటారు. కానీ అది తప్పు! ఈ నేపథ్యంలో ఫిజికల్​ గోల్డ్​కు డిమాండ్​ను తగ్గించేందుకు.. ఈ సావరిన్​ గోల్డ్​ బాండ్​ స్కీమ్​ను 2015 నవంబర్​లో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ బాండ్లకు 8ఏళ్ల టెన్యూర్​ ఉంటుంది. 5ఏళ్ల వరకు లాకిన్​ పీరియడ్​ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎగ్జిట్​ అవ్వొచ్చు. కనిష్ఠంగా ఒక గ్రాము, గరిష్ఠంగా 4 కేజీల వరకు బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వీటిపై ఏడాదికి రెండుసార్లు వడ్డీని ప్రభుత్వం ఇస్తుండటం మరో స్పెషాలిటీ!

సావరిన్​ గోల్డ్​ బాండ్స్​లో ఇన్​వెస్ట్​ చేయడం మంచి ఆప్షన్​ ఆ?

బంగారం ధర పెరిగినట్టే బాండ్ విలువ పెరుగుతూ ఉంటుంది.

అలాగే వడ్డీకి వడ్డీ కూడా వస్తుంది. 2.5 శాతం వడ్డీ రేటుతో ఏటా వడ్డీ ఆదాయం పొందవచ్చు.

Sovereign Gold Bond subscription : కేంద్ర ప్రభుత్వం జారీ చేసే బాండ్లు కావడంతో మీ అసలు సొమ్ముకు ఎలాంటి ఢోకా ఉండదు.

మెచ్యూరిటీ వరకు కొనసాగిస్తే కాపిటల్ గెయిన్స్ టాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.

ఫిజికల్‌గా పసిడి కొంటే దొంగల భయం కూడా ఉండదు. లాకర్‌లో పెట్టేందుకు అయ్యే ఖర్చు కూడా తప్పుతుంది.

ఎక్స్ఛేంజీలలో బాండ్లు అమ్ముకోవచ్చు. బదిలీ కూడా చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం