Sovereign Gold bond : సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 4పై కీలక అప్డేట్​..-sovereign gold bond rbi issues key update on next issue date full details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sovereign Gold Bond : సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 4పై కీలక అప్డేట్​..

Sovereign Gold bond : సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 4పై కీలక అప్డేట్​..

Sharath Chitturi HT Telugu
Jan 23, 2024 08:11 AM IST

Sovereign Gold bond : సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 4పై కీలక అప్డేట్! ఇష్యూ డేట్​ని ప్రకటించింది ఆర్​బీఐ.

సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 4పై కీలక అప్డేట్​..
సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 4పై కీలక అప్డేట్​..

Sovereign Gold bond series 4 : మరో రెండు సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్ పై కీలక అప్డేట్​ ఇచ్చింది ఆర్​బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా). 4వ సిరీస్​ సబ్​స్క్రిప్షన్​ని ఫిబ్రవరి 12న ఓపెన్​ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. సావరిన్​ గోల్డ్​ బాండ్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 4..

సిరీస్​ 4 సబ్​స్క్రిప్షన్​ డేట్​:- ఫిబ్రవరి 12- ఫిబ్రవరి 16 వరకు.

ఇష్యూ డేట్​​:- 2024 ఫిబ్రవరి 21.

సబ్​స్క్రిప్షన్​ ప్రైజ్​:- సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 4 ధర వివరాలను ఆర్​బీఐ ఇంకా ప్రకటించలేదు. సాధారణంగా.. ఇష్యూ డేట్​కి 1 లేదా 2 వారాల ముందు ధరను వెల్లడిస్తుంది.

ఏంటి ఈ సావరిన్​ గోల్డ్​ బాండ్​?

Sovereign Gold Bond series 4 subscription : ఇన్​వెస్ట్​మెంట్​కు గోల్డ్​ అనేది ఒక మంచి ఆప్షన్ అన్న విషయం తెలిసిందే​. అయితే భారతీయుల్లో చాలా మంది ఫిజికల్​ గోల్డ్​నే ప్రిఫర్​ చేస్తూ ఉంటారు. అది ఇన్​వెస్ట్​మెంట్​కు అంత సరైనది కాదని నిపుణులు ఎప్పుడు చెబుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలో ఫిజికల్​ గోల్డ్​కు డిమాండ్​ను తగ్గించేందుకు.. ఈ సావరిన్​ గోల్డ్​ బాండ్​ స్కీమ్​ని 2015 నవంబర్​లో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ బాండ్లకు 8ఏళ్ల టెన్యూర్​ ఉంటుంది. 5ఏళ్ల వరకు లాకిన్​ పీరియడ్​ ఉంటుంది. కావాల్సి వస్తే.. ఆ తర్వాత ఎగ్జిట్​ అవ్వొచ్చు. కనిష్ఠంగా ఒక గ్రాము, గరిష్ఠంగా 4 కేజీల వరకు బంగారాన్ని కొనుగోలు ఇందులో చేసుకోవచ్చు. వీటిపై ఏడాదికి రెండుసార్లు వడ్డీని కూడా ఇస్తుంది ప్రభుత్వం.

సావరిన్​ గోల్డ్​ బాండ్స్​లో ఇన్​వెస్ట్​మెంట్స్​ మంచిదేనా?

బంగారం ధర పెరిగినట్టే బాండ్ విలువ పెరుగుతూ ఉంటుంది.

అలాగే ఇన్​వెస్ట్​మెంట్​పై వడ్డీ కూడా వస్తుంది. 2.5 శాతం వడ్డీ రేటుతో ఏటా వడ్డీ ఆదాయం పొందవచ్చు.

Sovereign Gold Bond subscription : మెచ్యూరిటీ వరకు కొనసాగిస్తే కాపిటల్ గెయిన్స్ టాక్స్ నుంచి మినహాయింపు కూడా ఉంటుంది.

ఫిజికల్‌గా బంగారం కొంటే ఉండే దొంగల భయం కూడా ఉండదు. లాకర్‌లో పెట్టేందుకు అయ్యే ఖర్చు కూడా తప్పుతుంది.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసే బాండ్లు కావడంతో మీ అసలు సొమ్ముకు ఎలాంటి ఢోకా ఉండదు.

ఎక్స్ఛేంజీలలో బాండ్లు అమ్ముకోవచ్చు. బదిలీ కూడా చేసుకోవచ్చు.

Sovereign Gold Bonds benefits : బంగారం ధర తగ్గితే తప్ప.. మీ బాండు విలువ తగ్గదు. అందువల్ల బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు సావరీన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమైన విధానం అని చాలా మంది నిపుణులు చెబుతూ ఉంటారు.

Whats_app_banner

సంబంధిత కథనం