Gold and silver rates today : తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు పెరిగాయా? ఇక్కడ చెక్​ చేయండి..-gold and silver rates today 23 january 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rates Today : తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు పెరిగాయా? ఇక్కడ చెక్​ చేయండి..

Gold and silver rates today : తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు పెరిగాయా? ఇక్కడ చెక్​ చేయండి..

Sharath Chitturi HT Telugu
Jan 23, 2024 05:32 AM IST

Gold and silver rates today : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్లాటీనం ధరలు కూడా మారలేదు. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు.. (Hindustan Times)

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 57,800గా ఉంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,78,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,780గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 63,050గా ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,30,500గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,950గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,200గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,800 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 63,050గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,300గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,600గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,800గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 63,050గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,800గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,050గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,850గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 63,100గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,800గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,050గా ఉంది.

ఫెడ్​ వడ్డీ రేట్లపై అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,550గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 75,500గా ఉంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 77,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 75,500.. బెంగళూరులో రూ. 73,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ 24,030గా ఉంది. ఆ ముందు రోజు కూడా ఇదే ధర పలికింది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,030గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Whats_app_banner

సంబంధిత కథనం