Gold Price Today : స్వల్పంగా తగ్గిన పసిడి ధర - నేటి ధరలు ఇవే
Today Gold Price Updates : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. వెండి రేటు స్థిరంగా ఉండగా. ప్లాటీనం రేటు పెరిగింది. ఇవాళ్టి ధరల వివరాలను ఇక్కడ చూడండి..
What is the price of 22 carat gold in Hyderabad : దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 57,740కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 57,750గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 5,77,400కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 5,774గా ఉంది.
ఇక 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 62,990కి చేరింది. మంగళవారం రోజు.. ఈ ధర రూ. 63,000గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 6,29,900గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 6,299గా ఉంది.
ఇక ఇవాళ వెండి ధరలు చూస్తే... స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర 76000 గా ఉంది. మంగళవారం కూడా ఇదే ధర ఉంది. వంద గ్రాముల వెండి ధర 7600గా ఉంది. ఏపీలోని విజయవాడ నగరంలోనూ హైదరాబాద్ నగరంలో ఉన్న ధరలే ఉన్నాయి.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాముల) ధర రూ. 57,890గా ఉంది. మంగళవారం చూస్తే 57,900గా ఉంది. నిన్నటితో పోల్చితే ఇవాళ రూ. 10 ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరలు చూస్తే... 10 గ్రాముల రేటు రూ. 63,140గా ఉంది. మంగళవారం ధర రూ. 63,150గా ఉంది. గ్రాము ధర చూస్తే రూ. 6,314గా ఉంది. చెన్నై నగరంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములకు) ధర రూ. 63,590గా ఉంది. నిన్నటితో పోల్చితే ఇవాళ స్వల్పంగా 10 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే 10 గ్రాములకు రూ. 58,290గా ఉంది. విజయవాడ నగరంలో 22 క్యారెట్ల బంగారం(10 గ్రాములకు) ధర రూ. 57,740గా ఉంది. మంగళవారంతో పోల్చితే రూ.10 తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే... రూ. 62,990గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు బుధవారం పెరిగాయి. విజయవాడలో 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 60 పెరిగి.. రూ. 24,080కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 24,020గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,080గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, దేశ రాజధాని ఢిల్లీతో పాటు మరికొన్ని నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.