Dichpalli Fraud: లక్కీ డ్రా పేరుతో మోసం… మహిళను మభ్యపెట్టి బంగారం చోరీ
Dichpalli Fraud: లక్కీ డ్రాలో బహుమతులు వచ్చాయంటూ యువతిని బురిడీ కొట్టించి బంగారం దోచుకెళ్లిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.
Dichpalli Fraud: లక్కీ డ్రాలో స్కూటీ, ఫ్రిడ్జ్ వచ్చిందని మహిళను బురిడీ కొట్టించి తులంన్నర బంగారం దోచుకెళ్లిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. షూరిటీగా బంగారం చూపెడితే గిఫ్ట్ ఇస్తానని నమ్మించి రెండు బంగారు ఉంగరాలు, చెవి కమ్మలతో కేటుగాడు ఉడాయించారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... డిచ్ పల్లి మండలం ఘనపూర్ గ్రామంలో చైతన్య నగర్ కాలానికి చెందిన ఓ మహిళ వద్ద కు ఒక గుర్తు తెలియని వ్యక్తి పల్సర్ బైక్ పై వచ్చి మీకు ఫోన్లో ఆఫర్ వచ్చింది. ఒటిపి చెప్పమని అడగాడు. ఆ మహిళ తమ వద్ద ఫోన్ లేదని చెప్పింది.
అయితే మీ వద్ద బంగారం ఉందా అని అడిగారు. ఉంది అని చెప్పారు. దీంతో ష్యూరిటీ కింద బంగారం తీసుకు రావాలని సూచించారు. అతని మాటలు నమ్మి వెంటనే ఇంట్లో ఉన్న బంగారం తీసుకోని అతని బైక్‌పై వెళ్ళింది.
ఘనపూర్ రైల్వే గేట్ పడగానే రిటన్ తీసుకోని ఇస్లాంపూర దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక ఇంటిని చూపి ఇదే మా ఇల్లు అని నమ్మించాడు. ఇప్పుడే ఇంటికి వెళ్లి వస్తానని బంగారం తీసుకొని అక్కడ నుంచి అటే ఉడాయించాడు. ఎంతసేపటికి ఆ వ్యక్తి రాకపోవడంతో ఆ ఇంటికి వెళ్లి అడిగింది . ఇంటికి ఎవరూ రాలేదని చెప్పడంతో షాక్ కు గురైంది.
తర్వాత కొద్దిసేపటికి మోసపోయానని తెలుసుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. బాధితురాలిని బైక్‌పై తీసుకువెళుతున్న దృశ్యాలు సీసీ టీవీలో నమోదయ్యాయి.
పాత కక్షలతో వ్యక్తి సజీవ దహనం
పాత కక్షలతో జరిగిన గొడవలో ఒక వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని ఖిల్లా రోడ్డులోని ఓ పాడుబడిన భవనంలో ఘటన జరిగింది. హాష్మి కాలనీకి చెందిన షేక్ ముఖీత్(24), షేక్ హైమద్‌కు కొంత కాలంగా గొడవలున్నాయి.
సోమవారం మధ్యా హ్నం 2 గంటల ప్రాంతంలో వీరిద్దరితో పాటు మరో ఇద్దరు పాడుబడిన భవనంలో మంట వేసుకుని మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలో షేక్ ముఖీత్, హైమద్‌కు మధ్య మాటామాట పెరిగింది.
ఆవేశానికి గురైన షేక్ ముఖీత్… హైమద్‌ను మంటల్లోకి తోసేశాడు. మంటలు అంటుకున్న హైమద్ వెంటనే ముఖీత్‌ను గట్టిగా పట్టుకున్నాడు. ఈ మంటల్లో ముఖీత్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. హైమద్ తీవ్రంగా గాయపడ్డాడు.
భవనం నుంచి అరుపులు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన అహ్మద్‌ను జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. షేక్ అహ్మద్ భార్య షేక్ సనా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పాడుబడిన భవనం చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు పరిశీలించారు.