Sovereign Gold Bond : సావరిన్ గోల్డ్ బాండ్ సబ్స్క్రిప్షన్ షురూ.. ఇన్వెస్ట్ చేయాలా?
18 December 2023, 13:37 IST
- Sovereign Gold Bond subscription : సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ 3 సబ్స్క్రిప్షన్ మొదలైంది. ఇష్యూ ప్రైజ్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సావరిన్ గోల్డ్ బాండ్ సబ్స్క్రిప్షన్ షురూ
Sovereign Gold Bond subscription : 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) సిరీస్ 3పై కీలక అప్డేట్! ఈ ఎస్జీబీ సబ్స్క్రిప్షన్.. సోమవారం మొదలైంది. సబ్స్క్రిప్షన్ విండో ఈ నెల 22 వరకు ఓపెన్‌గా ఉండనుంది. 2023లో బంగారం ధరలు 10శాతం కన్నా ఎక్కువ పెరిగిన తరుణంలో.. సావరిన్ గోల్డ్ బాండ్‌కు మంచి డిమాండ్ కనిపిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ ప్రైజ్ గ్రాముకు రూ. 6,199గా ఉంది. దీనిపై ఆర్బీఐ ప్రకటన చేయాల్సి ఉంది. సబ్స్క్రిప్షన్ మొదలయ్యే వారానికి చివరి మూడు వర్కింగ్ డేస్‌లో.. 999ప్యూరిటీతో కూడిన బంగారం ధరను యావరేజ్ చేసి.. ఇష్యూ ప్రైజ్‌ను ఫిక్స్ చేస్తారు.
సావరిన్ గోల్డ్ బాండ్‌తో ప్రయోజనం ఉందా?
Sovereign gold bond interest rate బంగారం ధర పెరిగినట్టే బాండ్ విలువ పెరుగుతూ ఉంటుంది. అలాగే వడ్డీకి వడ్డీ కూడా వస్తుంది. 2.5 శాతం వడ్డీ రేటుతో ఏటా వడ్డీ ఆదాయం పొందవచ్చు.
మెచ్యూరిటీ వరకు కొనసాగిస్తే కాపిటల్ గెయిన్స్ టాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే బాండ్లు కావడంతో మీ అసలు సొమ్ముకు ఎలాంటి ఢోకా ఉండదు.
ఫిజికల్‌గా బంగారం కొంటే ఉండే దొంగల భయం కూడా ఉండదు. లాకర్‌లో పెట్టేందుకు అయ్యే ఖర్చు కూడా తప్పుతుంది.
ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా?
Sovereign Gold Bond issue price : "ఎస్‌జీబీలో ఇన్వెస్ట్మెంట్ మంచి ఆప్షన్ అవుతుంది. బంగారం వినియోగంలో ఇండియా అగ్రస్థానంలో ఉంది. అందుకే.. పసిడికి డిమాండ్ తగ్గదు. ఇది.. బాండ్స్‌కి మంచి విషయం. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో కూడా డైవర్సిఫైడ్‌గా ఉంది. సావరిన్ గోల్డ్ బాండ్ రికార్డు కూడా మెరుగ్గానే ఉంది. మంచి రిటర్నులు వస్తాయి," అని ఎస్బీఐ సెక్యూరిటీస్‌కి చెందిన సీబీఓ సురేశ్ శుక్లా తెలిపారు.
"దీర్ఘకాలంలో గోల్డ్‌తో మంచి రిటర్నులు వస్తాయి. ఇందులో సందేహం లేదు. ఇన్‌ఫ్లేషన్‌ని ఓడించే రిటర్నులు కూడా పొందొచ్చు. అందుకే.. బంగారంలో పెట్టుబడి అంటే.. సావరిన్ గోల్డ్ బాండ్స్ మంచి ఆప్షన్ అవుతాయి. మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేస్తే మంచి లాభాలు చూడొచ్చు," అని మైవెల్త్‌గ్రోత్.కామ్ కో-ఫౌండర్ హర్షద్ చేతన్‌వాలా అభిప్రాయపడ్డారు.
Sovereign gold bond scheme 2023 : ఇన్వెస్ట్‌మెంట్‌కు గోల్డ్ అనేది ఒక మంచి ఆప్షన్. అయితే భారతీయుల్లో చాలా మంది ఫిజికల్ గోల్డ్‌ను కొంటుంటారు. అది ఇన్వెస్ట్‌మెంట్‌కు అంత సరైనది కాదు. ఈ నేపథ్యంలో ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్‌ను తగ్గించేందుకు.. ఈ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను 2015 నవంబర్‌లో ప్రవేశపెట్టింది కేంద్రం.