తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sovereign Gold Bond : సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 3 సబ్​స్క్రిప్షన్​పై కీలక అప్డేట్​!

Sovereign Gold Bond : సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 3 సబ్​స్క్రిప్షన్​పై కీలక అప్డేట్​!

Sharath Chitturi HT Telugu

11 December 2023, 11:14 IST

google News
  • Sovereign Gold Bond scheme : సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 3 సబ్​స్క్రిప్షన్​పై కీలక అప్డేట్​ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇష్యూ డేట్​తో పాటు సబ్​స్క్రిప్షన్​ డేట్​ని కూడా ప్రకటించింది.

సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 3 సబ్​స్క్రిప్షన్​పై కీలక అప్డేట్​!
సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 3 సబ్​స్క్రిప్షన్​పై కీలక అప్డేట్​!

సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 3 సబ్​స్క్రిప్షన్​పై కీలక అప్డేట్​!

Sovereign Gold Bond scheme latest news : మరో రెండు సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. 3వ సిరీస్​ని ఈ నెలలో ఇష్యూ చేయనున్నట్టు, 4వ సిరీస్​ని ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ఇష్యూ డేట్స్​, సబ్​స్క్రిప్షన్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 3- సిరీస్​ 4..

సిరీస్​ 3 సబ్​స్క్రిప్షన్​ డేట్​:- డిసెంబర్​ 18- డిసెంబర్​ 22.

ఇష్యూ డేట్​​:- 2023 డిసెంబర్​ 28.

సిరీస్​ 4 సబ్​స్క్రిప్షన్​ డేట్​​:- 2024 ఫిబ్రవరి 12-16

ఇష్యూ డేట్​​:- 2024 ఫిబ్రవరి 21.

2015లో తొలిసారిగా..

Sovereign Gold Bond series 3 subscription : ఇన్​వెస్ట్​మెంట్​కు గోల్డ్​ అనేది ఒక మంచి ఆప్షన్​. అయితే భారతీయుల్లో చాలా మంది ఫిజికల్​ గోల్డ్​ను కొంటుంటారు. అది ఇన్​వెస్ట్​మెంట్​కు అంత సరైనది కాదు. ఈ నేపథ్యంలో ఫిజికల్​ గోల్డ్​కు డిమాండ్​ను తగ్గించేందుకు.. ఈ సావరిన్​ గోల్డ్​ బాండ్​ స్కీమ్​ను 2015 నవంబర్​లో ప్రవేశపెట్టింది కేంద్రం. ఈ బాండ్లకు 8ఏళ్ల టెన్యూర్​ ఉంటుంది. 5ఏళ్ల వరకు లాకిన్​ పీరియడ్​ ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జిట్​ అవ్వొచ్చు. కనిష్ఠంగా ఒక గ్రాము, గరిష్ఠంగా 4 కేజీల వరకు బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. వీటిపై ఏడాదికి రెండుసార్లు వడ్డీని ప్రభుత్వం ఇస్తుంటుంది.

సావరిన్​ గోల్డ్​ బాండ్స్​లో ఇన్​వెస్ట్​మెంట్స్​ మంచిదేనా?

బంగారం ధర పెరిగినట్టే బాండ్ విలువ పెరుగుతూ ఉంటుంది.

అలాగే వడ్డీకి వడ్డీ కూడా వస్తుంది. 2.5 శాతం వడ్డీ రేటుతో ఏటా వడ్డీ ఆదాయం పొందవచ్చు.

మెచ్యూరిటీ వరకు కొనసాగిస్తే కాపిటల్ గెయిన్స్ టాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.

Sovereign Gold Bond subscription : కేంద్ర ప్రభుత్వం జారీ చేసే బాండ్లు కావడంతో మీ అసలు సొమ్ముకు ఎలాంటి ఢోకా ఉండదు.

ఫిజికల్‌గా బంగారం కొంటే ఉండే దొంగల భయం కూడా ఉండదు. లాకర్‌లో పెట్టేందుకు అయ్యే ఖర్చు కూడా తప్పుతుంది.

ఎక్స్ఛేంజీలలో బాండ్లు అమ్ముకోవచ్చు. బదిలీ కూడా చేసుకోవచ్చు.

Sovereign Gold Bonds benefits : బంగారం ధర తగ్గితే తప్ప.. మీ బాండు విలువ తగ్గదు. అందువల్ల బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు సావరీన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమైన విధానం అని చెప్పొచ్చు.

తదుపరి వ్యాసం