RBI MPC Meeting : యథాతథంగా వడ్డీ రేట్లు- 21వేల మార్క్​ను తాకిన నిఫ్టీ..!-rbi mpc decided unanimously to keep the policy repo rate unchanged ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Rbi Mpc Meeting : యథాతథంగా వడ్డీ రేట్లు- 21వేల మార్క్​ను తాకిన నిఫ్టీ..!

RBI MPC Meeting : యథాతథంగా వడ్డీ రేట్లు- 21వేల మార్క్​ను తాకిన నిఫ్టీ..!

Sharath Chitturi HT Telugu
Dec 08, 2023 12:09 PM IST

RBI MPC Meeting : వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ఆర్​బీఐ ప్రకటించింది. అయితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా పుంజుకోవాలని అభిప్రాయపడ్డారు.

ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​
ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ (PTI)

RBI MPC Meeting : వడ్డీ రేట్లను వరుసగా 5వసారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. ఈ మేరకు.. మొనేటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం ఓ ప్రకటన చేశారు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​. వడ్డీ రేట్లు.. 6.5శాతంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

"కీలక వడ్డీ రేట్లను 6.5శాతం దగ్గరే ఉంచాలని మొనేటరీ పాలసీ మీటింగ్​లో ఏకగ్రీవంగా అంగీకరించాము. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవడానికి సమయం పడుతుంది. ప్రస్తుతం.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కాస్త బలహీనంగా ఉంది. అప్పులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు వంటివి ఇందుకు కారణం," అని శక్తికాంత దాస్​ అన్నారు.

RBI MPC Meeting live updates : 2024 ఆర్థిక ఏడాదికి సంబంధించి.. భారత దేశ​ వాస్తవ జీడీపీ అంచనాలను 6.5శాతం నుంచి 7శాతానికి పెంచుతున్నట్టు ఆర్​బీఐ గవర్నర్​ వెల్లడించారు. ఎఫ్​వై25 క్యూ1 రియల్​ జీడీపీ 6.7శాతంగా నమోదవుతుందని అంచనా వేశారు. అదే సమయంలో.. 2024 ఆర్థిక ఏడాదిలో ద్రవ్యోల్బణం 5.4శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు స్పష్టం చేశారు.

భారత దేశ ఆర్థిక వ్యవస్థ శక్తివంతంగానే ఉన్నప్పటికీ.. కోర్​ ఇన్​ఫ్లేషన్​ అనేది కాస్త సమస్యగానే ఉందన్నారు శక్తికాంత దాస్​.

యూపీఐ ట్రాన్సాక్షన్స్​ లిమిట్​ పెంపు..

హాస్పిటల్స్​, విద్యాసంస్థలకు చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్​ లిమిట్​ని పెంచుతున్నట్టు శక్తికాంతదాస్​ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రూ. 1లక్ష లిమిట్​ని రూ. 5లక్షలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

ద్రవ్యోల్బణం కారణంగా.. గతేడాది నుంచి వడ్డీ రేట్లను 2.5శాతం పెంచుతూ వచ్చింది ఆర్​బీఐ. ఆ తర్వాత నుంచి వరుసగా ఐదోసారి.. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది.

RBI rate cuts : అమెరికా ఫెడ్​తో పాటు అనేక దేశాల బ్యాంక్​లు.. ఏడాది కాలంగా వడ్డీ రేట్లను పెంచాయి. ఇటీవలి కాలంలో వాటిని యథాతథంగా ఉంచుతున్నాయి. ఫెడ్​ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియ మొదలైతే.. ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా రేట్​ కట్స్​ని చూసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నిఫ్టీ ఆల్​ టైమ్​ హై..

మరోవైపు.. ఆర్​బీఐ మొనేటరీ పాలసీ కమిటీ ప్రకటనతో నిఫ్టీ మరో ఆల్​టైమ్​ హైని తాకింది. ఉదయం 10:10 నిమిషాల సమయంలో 21వేల మార్క్​ను టచ్​ చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం