2000 Notes: రూ.2,000 నోట్ల ఉపసంహరణ అందుకే: వివరించిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్-reserve bank of india governor shaktikanta das explains why 2000 notes were withdrawn check details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2000 Notes: రూ.2,000 నోట్ల ఉపసంహరణ అందుకే: వివరించిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

2000 Notes: రూ.2,000 నోట్ల ఉపసంహరణ అందుకే: వివరించిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

Chatakonda Krishna Prakash HT Telugu
May 22, 2023 03:43 PM IST

₹2000 Notes: రూ.2,000 నోట్ల ఉపసంహరణ గురించి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వివరణ ఇచ్చారు. కారణాన్ని చెప్పారు. అలాగే ప్రజలు తొందరపడాల్సిన అవసరం లేదని సూచించారు.

2000 Notes: రూ.2,000 నోట్ల ఉపసంహరణ అందుకే: వివరించిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
2000 Notes: రూ.2,000 నోట్ల ఉపసంహరణ అందుకే: వివరించిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (ANI)

2000 Notes: రూ.2,000 నోట్ల ఉపసంహరణపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) వివరణ ఇచ్చారు. సోమవారం ఈ విషయంపై మాట్లాడారు. ఆర్‌బీఐ నగదు నిర్వహణ (Currency Management) చర్యల్లో భాగంగా రూ.2,000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు ప్రజలు హడావుడిగా బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఇంకా నాలుగు నెలల సమయం (సెప్టెంబర్ 30) ఉందని శక్తికాంత దాస్ అన్నారు. రూ.2,000 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు(Legal Tender)లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్‌బీఐ గతవారం వెల్లడించింది. ప్రజలు బ్యాంకుల్లో రూ.2,000 నోట్లను డిపాజిట్ చేయడమో.. మార్చుకోవడమో చేసుకోవాలని చెప్పింది. ఇందుకు మే 23 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు విధించింది. ఈ నేపథ్యంలో శక్తికాంత దాస్ సోమవారం ఈ విషయంపై మాట్లాడారు. వివరాలివే.

2000 Notes: 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం వ్యవస్థలో నగదు కొరత ఏర్పడకుండా.. వేగంగా నగదును అందుబాటులోకి తెచ్చేందుకు రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టినట్టు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఇప్పుడు నగదు నిర్వహణలో భాగంగా రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించారు. క్లీన్ నోట్ విధానం మేరకు రూ.2,000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు.

కంగారు వద్దు

2000 Notes: రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు తాము సెప్టెంబర్ 30వ తేదీ వరకు సమయం ఇచ్చామని, అందుకే ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ గవర్నర్ దాస్ అన్నారు. ప్రస్తుతం వ్యవస్థలో సరిపడా నోట్లు ఉన్నాయని తెలిపారు. రూ.2,000 నోట్లను మార్చి, వేరే నోట్లను ఇచ్చేందుకు బ్యాంకుల వద్ద కూడా సరిపడా నోట్ల స్టాక్స్ ఉన్నాయని తెలిపారు. అందుకే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రూ.50వేలు అంత కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే పాన్ (PAN) వివరాలు సమర్పించాలనే రూల్ ఇప్పటికే ఉందని, అది రూ.2,000 నోట్ల డిపాజిట్‍కు కూడా ఉంటుందని వెల్లడించారు.

2000 Notes: రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై అత్యల్పంగా ఉంటుందని శక్తికాంత దాస్ అన్నారు. ప్రస్తుత నగదు సర్క్యులేషన్‍లో రూ.2,000 నోట్లు కేవలం 10.8 శాతం మాత్రమే ఉండడమే దీనికి కారణమని చెప్పారు. మళ్లీ రూ.1,000 నోట్లను ప్రవేశపెడతామన్న వాదనలు ఊహాగానాలే అని అన్నారు. రూ.1,000 నోట్లను తెచ్చే ఆలోచనే లేదని స్పష్టం చేశారు.

సంబంధిత కథనం

టాపిక్