2000 Notes Exchange: రూ.2వేల నోట్ల మార్పిడిపై స్టేట్ బ్యాంక్ కీలక ప్రకటన.. అవి అక్కర్లేదు!-sbi shares update on 2000 rupees note exchange id proof form not required ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Sbi Shares Update On 2000 Rupees Note Exchange Id Proof Form Not Required

2000 Notes Exchange: రూ.2వేల నోట్ల మార్పిడిపై స్టేట్ బ్యాంక్ కీలక ప్రకటన.. అవి అక్కర్లేదు!

Chatakonda Krishna Prakash HT Telugu
May 21, 2023 03:09 PM IST

2000 Notes Exchange - SBI: రూ.2,000 నోట్ల మార్పిడి (Exchange), డిపాజిట్ గురించి ఎస్‍బీఐ కీలక అప్‍డేట్ వెల్లడించింది. వివరాలివే..

2000 Notes Exchange: రూ.2వేల నోట్ల మార్పిడిపై స్టేట్ బ్యాంక్ కీలక ప్రకటన (Photo: PTI)
2000 Notes Exchange: రూ.2వేల నోట్ల మార్పిడిపై స్టేట్ బ్యాంక్ కీలక ప్రకటన (Photo: PTI)

2000 Notes Exchange - SBI: చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంకు (Indian Reserve Bank - RBI) గత వారం ప్రకటించింది. మే 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీలోపు ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని, లేకపోతే బ్యాంకుల్లో రూ.2000 నోట్లు ఇచ్చి వేరే నోట్లను మార్చుకోవచ్చని (Exchange) వెల్లడించింది. అయితే, ఈ విషయంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India - SBI) నేడు కీలక అప్‍డేట్ వెల్లడించింది. రూ.2,000 నోట్ల మార్పిడి (Exchange) గురించి స్పష్టత ఇచ్చింది. ఒకసారి రూ.20వేల విలువైన (10 నోట్లు) రూ.2,000 నోట్లను డిపాజిట్ చేసేందుకు లేదా మార్పిడి చేసుకునేందుకు ఎలాంటి స్లిప్, ఫామ్, ఐడీ ప్రూఫ్ అవసరం లేదని చెప్పింది. పూర్తి వివరాలు ఇవే.

అవి అవసరం లేదు

2000 Notes Exchange - SBI: రూ.2,000 నోట్లను డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ చేసేందుకు బ్యాంకు శాఖల్లో ప్రజలు ఎలాంటి ఫామ్, స్లిప్ రాయాల్సిన అవసరం లేదని, ఐడీ ప్రూఫ్ సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొంది. మార్గదర్శకాల ప్రకారం, ఒకసారి 10 రూ.2,000 నోట్లను ఓ వ్యక్తి డిపాజిట్/ఎక్స్చేంజ్ చేయగలరు. మరిన్ని నోట్లు ఉంటే మళ్లీ వెళ్లాల్సి ఉంటుంది.

2000 Notes Exchange - SBI: రూ.2,000 నోట్లను డిపాజిట్/ఎక్స్చేంజ్ చేసుకునేందుకు ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుందని, దానితో పాటు ఆధార్ లాంటి ఐటెంటిటీ డాక్యుమెంట్‍ను సమర్పించాల్సి ఉంటుందని కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఎస్‍బీఐ స్పందించింది. అలాంటివి ఏమీ అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది.

2000 Notes: రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్‌బీఐ గత శుక్రవారం ప్రకటించింది. అందుకే ప్రజలు సెప్టెంబర్ 30వ తేదీ లోగా రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో ఎక్స్చేంజ్ లేదా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాలని సూచించింది. ఎక్స్చేంజ్ కింద రూ.2,000 నోటును ఇచ్చి వేరే నోట్లను పొందవచ్చు. ఉపసంహరించుకుంటున్నా రూ.2,000 ఇప్పటికీ చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ పేర్కొంది.

క్లియర్ నోట్ పాలసీ కింద ప్రస్తుతం ఈ రూ.2,000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. అయితే, ఒకవేళ ప్రజల వద్ద ఇంకా రూ.2,000 నోట్లు అధిక సంఖ్యలో ఉన్నట్టు తేలితే సెప్టెంబర్ 30 డెడ్‍లైన్‍ను ఆర్బీఐ పొడిగించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే, ప్రజలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో సెప్టెంబర్ 30వ తేదీలోగా రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవడమో, ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడమే చేయాలి. ఖాతాలేని బ్యాంకుకు కూడా వెళ్లి ప్రజలు రూ.2,000 నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

WhatsApp channel

టాపిక్