Retail Inflation: మళ్లీ ధరల షాక్!: పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. మూడు నెలల గరిష్టానికి..
Retail Inflation: రిటైల్ ద్రవ్యోల్బణం మరోసారి పెరిగింది. 2023 తొలి నెల జనవరిలోనే అధికమైంది. గత డిసెంబర్‌తో పోలిస్తే ఏకంగా 0.80 శాతం పెరిగి మూడు నెలల గరిష్టానికి చేరింది.
Retail Inflation: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరోసారి పెరిగింది. మూడు నెలల గరిష్టానికి చేరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI - ఆర్బీఐ) పరిమితిని మరోసారి మించిపోయింది. వినియోగదారుల ధరల సూచీ (Consumer Price Index - CPI) అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జవనరిలో 6.52 శాతానికి పెరిగింది. కిందటి నెల అయిన డిసెంబర్‌లో ఇది 5.72 శాతంగా నమోదుగా కాగా.. జనవరిలో 0.80 శాతం అధికమైంది. ఈ గణాంకాలను నేడు (ఫిబ్రవరి 13) కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలో నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, కూరగాయాల ధరలను ఈ రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) సూచిస్తుంది. అంటే గతేడాది డిసెంబర్‌తో పోలిస్తే జనవరిలో దేశంలో ధరలు పెరిగినట్టు ఇది సూచిస్తోంది. రెండు నెలల పాటు తగ్గుముఖం పట్టిన రిటైల్ ద్రవ్యోల్బణం.. 2023 తొలి నెలలోనే ఎగిసింది.
మళ్లీ ఆర్బీఐ జోన్‍ను మించి..
Retail Inflation: రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం నుంచి 6 శాతం మధ్య ఉంచాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. 10 నెలల తర్వాత గతేడాది నవంబర్‌లో ద్రవ్యోల్బణం 5.88 శాతానికి దిగివచ్చింది. డిసెంబర్‌లో 5.72 శాతానికి చేరింది. అయితే ఇప్పుడు 2023 జనవరిలో మరోసారి పెరిగి.. 6.52కు చేరుకుంది. దీంతో ఆర్బీఐ జోన్‍ను ద్రవ్యోల్బణం మరోసారి దాటి వెళ్లిపోయింది.
ద్రవ్యోల్బణం పెరుగుదలతో రెపో రేటును రానున్న కాలంలోనూ ఆర్బీఐ మరింత పెంచే అవకాశాలు ఉంటాయి. ఇటీవలే రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల (0.25శాతం) మేర పెంచింది ఆర్బీఐ. వరుసగా ఆరోసారి రెపో రేటును అధికం చేసింది. దీంతో రెపో రేటు మొత్తంగా 6.25 శాతానికి చేరింది.
సంబంధిత కథనం