Dhanteras 2023: బంగారాన్ని ఇలా కూడా కొనొచ్చు.. గోల్డ్ కొనేందుకు 5 మార్గాలు
Dhana trayodashi: దీపావళి, ధన త్రయోదశి (Dhanteras) రోజుల్లో సాధారణంగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే, బంగారాన్ని 22 క్యారెట్ నగల రూపంలోనో, లేక 24 క్యారెట్ గోల్డ్ గానో మాత్రమే కాదు.. ఇతర మార్గాల్లో కూడా కొనుగోలు చేయవచ్చు.
Dhana trayodashi: ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధన త్రయోదశి (Dhanteras). ఆ రోజు బంగారం (gold), లేదా వెండిని కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. మరోవైపు, పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభమవుతోంది. శుభ సందర్భాలలో బంగారం కొనడం భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. అయితే ఈ ధనత్రయోదశికి బంగారం కొనుగోలు చేయాలనుకుంటే, ఆభరణాల రూపంలోనే కాకుండా.. బడ్జెట్ ను బట్టి డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ ఫండ్స్, గోల్డ్ ఇటిఎఫ్‌ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందుకు రూ. 1000 నుంచి చిన్న మొత్తాల్లో పెట్టుబడి సరిపోతుంది.
Digital gold: డిజిటల్ గోల్డ్
బంగారాన్ని ఆభరణాలుగానే కాకుండా డిజిటల్ గోల్డ్ రూపంలో కూడా కొనవచ్చు. డిజిటల్ గోల్డ్ అనేది సాధారణ బంగారం కొనుగోలు వంటిదే. కానీ, ఫిజికల్ గా గోల్డ్ మీ వద్ద ఉండదు. మీ తరఫున విక్రేత వద్దనే బీమా చేసిన వాల్ట్ ల్లో దీన్ని భద్రపరుస్తారు. ఎప్పుడు కావాలనుకుంటే, అప్పుడు మీరు దీన్ని, ఆ రోజు ధరకు అమ్మేయవచ్చు. డిజిటల్ గోల్డ్ ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ గోల్డ్ ను చిన్న పరిమాణంలో, EMIలలో, UPI చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ బంగారంలో స్థిరంగా పెట్టుబడి పెట్టడం ద్వారా మీ వద్ద ఉన్న బంగారాన్ని క్రమంగా పెంచుకోవచ్చు. ఈ డిజిటల్ గోల్డ్ పై రుణం కూడా తీసుకోవచ్చు.
ETFs: గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్
గోల్డ్ ఈటీఎఫ్‌లు బంగారం ధరల్లో మార్పులకు అనుగుణంగా మారుతాయి. బంగారం ధర పెరుగుతున్న కొలదీ మీ గోల్డ్ ఈటీఎఫ్ విలువ పెరుగుతుంది. తక్కువ ఖర్చుతో కూడిన ఎక్స్‌పోజర్‌ను అందిస్తాయి. ఎగ్జిట్ లోడ్‌లు లేనందున గోల్డ్ ఇటిఎఫ్‌లు పెట్టుబడిదారులకు చౌకగా ఉంటాయి. ఇవి స్టాక్స్ లాగా ట్రేడ్ అవుతాయి. వీటిని ఫిజికల్ గా స్టోర్ చేసే బాధ ఉండదు. మేకింగ్ ఛార్జీల ఇబ్బంది ఉండదు..
Sovereign Gold Bonds: ప్రభుత్వ బాండ్స్
ప్రభుత్వం తరఫున ఆర్బీఐ రెగ్యులర్ గా సావరిన్ గోల్డ్ బాండ్ లను అమ్ముతుంది. మార్కెట్ ధర తో పాటు వీటి విలువ పెరుగుతుంది. కచ్చితమైన రిటర్న్స్ ఉంటాయి. టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎక్కువగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని ఇన్వెస్టర్లు ఈ మార్గాన్ని ఎన్నుకోవచ్చు.
Gold Funds: గోల్డ్ ఫండ్స్
గోల్డ్ ఫండ్స్ గోల్డ్ ఇటిఎఫ్‌లలో పెట్టుబడి పెడతాయి. కనీసం రూ.1,000తో గోల్డ్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఇటిఎఫ్‌లలో పెట్టుబడి పెడతాయి. బంగారంపై ఈ మార్గంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఫండ్స్ ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్‌ను అందిస్తాయి.
Gold Ornaments: ఆభరణాలు
సంప్రదాయ మార్గమైన ఆభరణాల కొనుగోలు బంగారంపై పెట్టుబడికి మరో మార్గం. భారతీయ స్త్రీలు ఈ విధానానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. నగల రూపంలో కొనడం వల్ల అటు శుభకార్యాల్లో ధరించడానికి ఉపయోగించవచ్చు. ఇటు పెట్టుబడి సాధనంగా ఉపయోగించవచ్చు. అవసరమైన సమయంలో ఆ బంగారంపై రుణం కూడా తీసుకోవచ్చు.