Samsung Galaxy F55 vs Vivo V30e : ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్?
09 June 2024, 13:43 IST
Samsung Galaxy F55 vs Vivo V30e : శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 వర్సెస్ వివో వీ30ఈ.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకోండి..
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 వర్సెస్ వివో వీ30ఈ
Samsung Galaxy F55 price in India : రూ.30,000లోపు లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ ధర శ్రేణిలో ఈ సంవత్సరం అనేక కొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్ అయ్యాయి. కానీ రెండు స్మార్ట్ఫోన్లు వాటి ప్రత్యేకమైన డిజైన్, ఆలరౌండర్ ఫీచర్లతో ప్రజాదరణ పొందుతున్నాయి. అవి.. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55, వివో వీ30ఈ. ఇటీవల మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం కొన్ని శక్తివంతమైన ఆఫర్లతో భారత మార్కెట్లోకి ప్రవేశించాయి ఈ రెండు గ్యాడ్జెట్స్. ఈ నేపథ్యంలో.. ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 వర్సెస్ వివో వీ30ఈ:
డిస్ప్లే: గెలాక్సీ ఎఫ్55 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7 ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ + సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. వివో వీ30ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
శాంసంగ్ కంటే వివో ఎక్కువ బ్రైట్నెస్ను అందిస్తోంది.
Samsung Galaxy F55 features : కెమెరా: కెమెరా స్పెసిఫికేషన్ల పరంగా, గెలాక్సీ ఎఫ్55 ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50 ఎంపీ ఓఐఎస్ ప్రైమరీ, 8 ఎంపీ అల్ట్రావైడ్, 2 ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. వీ30ఈ డ్యూయెల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో, రెండు స్మార్ట్ఫోన్లు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి.
ఇదీ చూడండి:- OnePlus Nord CE 4: అమెజాన్ లో అత్యంత తక్కువ ధరకే వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ప్రీమియం స్మార్ట్ ఫోన్
పర్ఫార్మెన్స్: హార్డ్‌వేర్ పరంగా, గెలాక్సీ ఎఫ్55 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 + జెన్ 3తో వేగవంతమైన ప్రాసెసర్‌తో వస్తుంది. వివో వీ30ఈ పాత తరం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
Vivo V30E price in India : అందువల్ల పనితీరు, మల్టీటాస్కింగ్ పరంగా గణనీయమైన వ్యత్యాసం ఉండవచ్చు..
బ్యాటరీ: గెలాక్సీ ఎఫ్55లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, వివో వీ30ఈ 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఛార్జింగ్ సపోర్ట్ పరంగా, రెండూ ఒకే శ్రేణి వాటేజ్‌ను అందిస్తాయి. శాంసంగ్ 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది, వివో 44 వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది.
Vivo V30E features : ధర: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55.. మూడు స్టోరేజ్ వేరియంట్లతో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ప్రారంభ ధర రూ.26999. వివో వీ30ఈ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999గా ఉంది.
మరి ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో మీకు ఏది నచ్చింది? ఏది కొంటున్నారు?
ఇంకో విషయం! మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్ లో ఉన్నాం! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండటానికి హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని ఇప్పుడే ఫాలో అవ్వండి.