Vivo X Fold 3 Pro : వివో ఎక్స్​ ఫోల్డ్​ 3 ప్రో లాంచ్​.. ఇదే ది బెస్ట్​ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​?-vivo x fold 3 pro launched in india with snapdragon 8 gen 3 chipset ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo X Fold 3 Pro : వివో ఎక్స్​ ఫోల్డ్​ 3 ప్రో లాంచ్​.. ఇదే ది బెస్ట్​ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​?

Vivo X Fold 3 Pro : వివో ఎక్స్​ ఫోల్డ్​ 3 ప్రో లాంచ్​.. ఇదే ది బెస్ట్​ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​?

Sharath Chitturi HT Telugu
Jun 07, 2024 07:20 AM IST

Vivo X Fold 3 Pro price : వివో తన స్లిమ్ ఫోల్డెబుల్ స్మార్ట్​ఫోన్​.. ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను లాంచ్​ చేసింది. ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో ఎక్స్​ ఫోల్డ్​ 3 ప్రో లాంచ్​..
వివో ఎక్స్​ ఫోల్డ్​ 3 ప్రో లాంచ్​.. (Vivo)

Vivo X Fold 3 Pro price in India : వివో ఎట్టకేలకు ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోతో భారతదేశంలో తన మొదటి ఫోల్డెబుల్ స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేసింది. వివో ఫోల్డ్ సిరీస్​లో రెండు పాత తరాలు ఉన్నప్పటికీ, మూడొవ తరంతో ఇది భారతదేశంలో అరంగేట్రం చేయడం ఇదే మొదటిసారి. కొత్త ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో దాని సొగసైన డిజైన్ తో భారతదేశం "స్లిమ్మెస్ట్​ ఫోల్డ్" అని వివో పేర్కొంది. అదనంగా, ఫోల్డెబుల్ స్మార్ట్​ఫోన్​ అనేక అధునాతన స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో పనిచేస్తుంది. ఇది మార్కెట్​లో ఇతర ఫోల్డెబుల్ ఫోన్లకు గట్టి పోటీని ఇస్తుంది. వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోలో యూజర్ల కోసం ఏం ఉందో తెలుసుకోండి.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్పెసిఫికేషన్లను..

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో ఓపెన్​ చేసినప్పుడు 5.2 ఎంఎం సన్నగా, ఫోల్డ్​ చేసినప్పుడు 11.2 ఎంఎం మందంగా ఉంటుంది. ఈ స్మార్ట్​ఫోన్ బరువు కేవలం 236 గ్రాములు మాత్రమేనని, ఫోల్డబుల్ డివైజ్ కావడంతో బరువు చాలా తక్కువని సంస్థ తెలిపింది. ఆర్మర్ ఆర్కిటెక్చర్​తో రూపొందించిన ఈ స్మార్ట్​ఫోన్​లో ఆర్మర్ గ్లాస్, బ్యాక్ కవర్, కార్బన్ ఫైబర్ హింజ్ ఉన్నాయి. వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోలో 6.53 ఇంచ్​ కవర్ డిస్​ప్లే, 8.03 ఇంచ్​ ఎల్టీపీఓ 8టీ ఫోల్డెబుల్ డిస్​ప్లే ఉన్నాయి. రెండు డిస్ప్లేలు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్​నెస్​ అందిస్తాయి. ఇది అద్భుతమైన వీక్షణ అనుభవం కోసం హెచ్​డీఆర్ 10+ డాల్బీ విజన్​ని కూడా సపోర్ట్ చేస్తుంది.

Vivo X Fold 3 Pro review : పనితీరు కోసం, వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో టీఎస్ఎంసీ 4 ఎన్ఎమ్ ప్రాసెస్​​తో రూపొందించిన స్నాప్​డ్రాగన్​ 8 జెన్ 3 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. 16 జీబీ ఎల్​పీడీడీఆర్​5ఎక్స్​ ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్​ని ఇందులో అందించారు. 50 మెగాపిక్సెల్ వీసీఎస్ ట్రూ కలర్ మెయిన్ కెమెరా, 70 ఎంఎం ఫోకల్ లెంగ్త్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్​తో 64 మెగాపిక్సెల్ జెయిస్ టెలిఫోటో కెమెరా, చివరిగా 50 మెగాపిక్సెల్ సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో, వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో 32 మెగాపిక్సెల్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది కవర్, మెయిన్ స్క్రీన్​పై ఉంచింది సంస్థ.

చివరిగా.. వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో 5700 ఎంఏహెచ్ బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. ఇది 100 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్​కి మద్దతు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో ధర, సేల్​..

Vivo X Fold 3 Pro specifications : వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ కేవలం ఒకటే కలర్ వేరియంట్​లో వస్తోంది. అది.. సెలెస్టియల్ బ్లాక్. 16 జీబీ ర్యామ్- 512 జీబీ స్టోరేజ్​తో ఒక స్టోరేజ్ వేరియంట్​లో మాత్రమే లభిస్తోంది. రూ.159999 ధరకు ఈ స్మార్ట్​ఫోన్ వినియోగ దారులకు జూన్ 13, 2024 నుంచి అందుబాటులో ఉండనుంది.

మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్ లో ఉన్నాం! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఫాలో అవ్వండి!

Whats_app_banner

సంబంధిత కథనం