Vivo S19 : వివో ఎస్19, ఎస్ 19ప్రో లాంచ్.. ధరలు, ఫీచర్స్ ఇవే!
01 June 2024, 8:06 IST
Vivo S19 and Vivo S19 Pro launched : వివో ఎస్19, ఎస్19 ప్రో స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ అయ్యాయి. వీటి ధరలు, ఫీచర్స్‌తో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వివో ఎస్19, ఎస్19 ప్రో లాంచ్..
Vivo S19 launch date in India : వివో తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్.. వివో ఎస్19, వివో ఎస్19 ప్రోలను చైనాలో లాంచ్ చేసింది. 50 మెగాపిక్సెల్ రియర్, సెల్ఫీ కెమెరాలు, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తున్న ఈ స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 4తో పనిచేస్తాయి. డిసెంబర్ 2023లో ప్రవేశపెట్టిన వివో ఎస్18 లైనప్‌ని అనుసరిస్తూ.. ఈ మోడల్స్‌లో కూడా పలు కీలక ఫీచర్స్‌ని కొనసాగించింది వివో సంస్థ.
వివో ఎస్19, వివో ఎస్19 ప్రో ధర..
వివో ఎస్19 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 యువాన్లుగా(సుమారు రూ.28,8000) ఉంది. 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,299 యువాన్లుగా(సుమారు రూ.38,000) ఉంది. వివో ఎస్ 19ప్రో 8 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర 3,299 యువాన్లుగా(సుమారు రూ.38,000) ఉంది. 16 జీబీ + 512 జీబీ వేరియంట్ ధర 3,999 యువాన్లుగా(సుమారు రూ.46,100) ఉంది.
Vivo S19 pro price : ఈ రెండు మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్స్.. వివో చైనాఇ-స్టోర్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. వివో ఎస్19 మిస్టీ బ్లూ, పీచ్ బ్లాసమ్ ఫ్యాన్, పైన్ స్మోక్ ఇంక్ వంటి కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రో మోడల్ మిస్టీ బ్లూ, స్వోర్డ్ షాడో గ్రే, గ్రీన్ మౌంటెన్స్ రంగుల్లో లభిస్తుంది.
వివో ఎస్19, ఎస్19 ప్రో: స్పెసిఫికేషన్లు
వివో ఎస్ 19, ఎస్19 ప్రో.. 6.78 ఇంచ్ 1.5 కె ఓఎల్ఈడీ డిస్ప్లేలను 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్. 20: 9 యాస్పెక్ట్ రేషియోతో వస్తున్నాయి. బేస్ మోడల్ కోసం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ఎస్ఓసీ, ప్రో వెర్షన్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్తో పనిచేసే ఇవి.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తాయి.
Vivo S19 specifications : కెమెరాల విషయానికొస్తే, వివో ఎస్19 50 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ ఓవి 50 ఈ ప్రైమరీ సెన్సార్‌ని కలిగి ఉంది. ప్రో మోడల్లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 921 ప్రైమరీ రియర్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. వివో ఎస్19 ప్రోలో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ ఉంది. రెండు డివైజ్‌లలో 50 మెగాపిక్సెల్ ఫ్రెంట్ కెమెరా సెన్సార్లు ఉన్నాయి.
వివో ఎస్ 19 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ప్రో వేరియంట్లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 5జీ, డ్యూయెల్ 4జీ వీవోఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
Vivo S19 : మరి ఈ మోడల్స్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతాయో.. వివో సంస్థ చెప్పలేదు! త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.