Infinity E1X e-scooter : ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే!
Infinity E1X e-scooter : ఇన్ఫినిటీ ఈ1 కొత్త వేరియంట్ లాంచ్ అయ్యింది. ఇందులో స్వాపెబుల్ బ్యాటరీ ఉంటుంది. దీని ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.. ఎ
Bounce Infinity E1X price : బెంగళూరు ఆధారిత ఎలక్ట్రిక్ వెహికిల్ స్టార్టప్ సంస్థ బౌన్స్ ఇన్ఫినిటీ.. తన బెస్ట్ సెల్లింగ్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్లో కొత్త వేరియంట్‌ని లాంచ్ చేసింది. దీని పేరు.. బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1ఎక్స్. 2024 జూన్ నుంచి ఈ మోడల్ సేల్స్ ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో.. ఈ ఎలక్ట్రిక్ స్కూట్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఇన్ఫినిటీ ఈ1ఎక్స్ కొత్త వేరియంట్..
బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 55,000 నుంచి 59,000 మధ్యలో ఉంటుది. ఇదొక బ్యాటరీ- స్వాపెబుల్ వేరియంట్. దీనిని కస్టమైజ్ చేసుకోవచ్చు. పూర్తిగా అయిపోయిన బ్యాటరీని.. కొత్తగా ఛార్జ్ అయిన బ్యాటరీతో సౌకర్యవంతంగా, సింపుల్‌గా స్వాప్ చేసుకోవచ్చు.
ఈ ఇన్ఫినిటీ ఈ1ఎక్స్‌లో 2 స్పీడ్ మోడల్స్‌ని లాంచ్ చేసింది సంస్థ. అవి.. 55 కేఎంపీహెచ్, 65 కేఎంపీహెచ్. అంతేకాదు.. ఇందులో 92కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ మోడల్ని సైతం విడుదల చేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఫలితంగా వాటిని విదేశాలకు కూడా ఎగుమతి చేయాలని ప్లాన్ చేస్తోంది.
Bounce Infinity E1X price in Bengaluru : "ప్రస్తుతం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 2 వీలర్ మార్కెట్ కలిగిన దేశం ఇండియా. కానీ ఈవీల నిజమైన బెనిఫిట్స్‌ని ఎవరు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. ఇన్నోవేషన్ కోసం ఈవీలు చాలా ముఖ్యంగా మారతాయి. అంతేకాకుండా.. వెహికిల్ నుంచి బ్యాటరీ కాస్ట్‌ని తీస్తే.. అవి మరింత చౌకగా మారతాయి," అని బౌన్స్ ఇన్ఫినిటీ సహ- వ్యవస్థాపకుడు, సీఈఓ వివేకానంద హల్లెకరె తెలిపారు.
దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో 30వేల ఈవీలను యాడ్ చేసేందుకు.. సన్ మొబిలిటీతో జత కట్టింది బౌన్స్ ఇన్ఫినిటీ. బెంగళూరు, హైదరాబాద్, పూణె, దిల్లీ ఎన్సీఆర్, ముంబై వంటి నగరాల్లో బౌన్స్ ఇన్ఫినిటీ ఈ-స్కూటర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇక దిగ్గజ ఫుడ్ డెలివరీ సంస్థలతో కూడా సంస్థ సంప్రదింపులు జరుపుతోంది. ఫలితంగా.. క్విక్-కామర్స్, లాస్ట్ మైల్ డెలివరీ కంపెనీలతో తన రీచ్‌ని పెంచుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
Bounce Infinity E1X : బౌన్స్ ఇన్ఫినిటీ.. తన ఈ1+ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్‌పై గతంలో భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ1+ ఎక్స్‌షోరూం ధర రూ. 1.13 లక్షలు నుంచి రూ. 89,999కి దిగొచ్చింది. ఇందులో రిమూవెబుల్ బ్యాటరీ ఉంటుంది 15ఏఎంపీ వాల్ సాకెట్‌తో దీనిని ఛార్జ్ చేసుకోవచ్చు. క్విక్ ఛార్జంగ్, ఎక్స్టెండెడ్ రేంజ్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.
హోండా స్టైలో 160.. వచ్చేస్తోంది!
భారత ఆటోమొబైల్ మార్కెట్లో.. ఈవీలతో పాటు 2 వీలర్ సెగ్మెంట్‌కి కూడా మంచి డిమాండ్ కనిపిస్తోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు ఆటోమొబైల్ సంస్థ.. పోటీపడి మరీ కొత్తకొత్త స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు.. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) నుంచి ఓ కొత్త స్కూటర్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. స్టైలో 160 స్కూటర్‌కు సంస్థ పేటెంట్ పొందడం ఇందుకు కారణం. హోండా స్టైలో 160 ఈ సంవత్సరం ప్రారంభంలో ఇండోనేషియాలో లాంచ్ అయ్యింది. దానిని ఇప్పటివరకు మరే ఇతర మార్కెట్లోనూ విడుదల చేయలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం