Honda Stylo 160 : హీరో- యమహా స్కూటర్స్‌కి పోటీగా.. హోండా స్టైలో 160!
Honda Stylo 160 price : హోండా స్టైలో 160 దేశంలో ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్లో లాంచ్ అవ్వొచ్చని టాక్ నడుస్తోంది. యమహా ఏరోక్స్ 155, అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160, రాబోయే హీరో జూమ్ 160 వంటి వాటికి ఈ స్కూటర్ గట్టి పోటీ ఇస్తుంది.
Honda Stylo 160 price Hyderabad : భారత ఆటోమొబైల్ మార్కెట్లో.. ఈవీలతో పాటు 2 వీలర్ సెగ్మెంట్‌కి కూడా మంచి డిమాండ్ కనిపిస్తోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు ఆటోమొబైల్ సంస్థ.. పోటీపడి మరీ కొత్తకొత్త స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు.. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) నుంచి ఓ కొత్త స్కూటర్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. స్టైలో 160 స్కూటర్‌కు సంస్థ పేటెంట్ పొందడం ఇందుకు కారణం. హోండా స్టైలో 160 ఈ సంవత్సరం ప్రారంభంలో ఇండోనేషియాలో లాంచ్ అయ్యింది. దానిని ఇప్పటివరకు మరే ఇతర మార్కెట్లోనూ విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో.. ఇండియాలో ఈ స్కూటర్‌కి పేటెంట్ లభించిందన్న వార్త ఎగ్జైటింగ్‌గా మారింది. హోండా ఇంకా ఎటువంటి వివరాలను ధృవీకరించనప్పటికీ.. యమహా ఏరోక్స్ 155, అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160, రాబోయే హీరో జూమ్ 160 వంటి వాటికి ద్విచక్ర వాహనాలకు పోటీగా.. ఈ స్టైలో 160 రూపొందుతోందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్కూటర్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హోండా స్టైలో 160 స్కూటర్..
హోండా స్టైలో 160.. ఒక ప్రీమియం స్కూటర్ అని తెలుస్తోంది. అనేక ఫీచర్లతో స్టైలిష్ మోడ్రన్-రెట్రో డిజైన్‌ను పొందుతుంది. ఈ స్కూటర్లో.. ఎల్ఈడీ లైటింగ్, డిజిటల్ డిస్ల్పే, యూఎస్బీ ఛార్జింగ్, కీలెస్ స్టార్ట్, 12 ఇంచ్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ స్టైలిష్ స్కూటర్.. యాక్టివా శ్రేణి కంటే గణనీయంగా పెద్దది. గుడ్ రోడ్ ప్రెసెన్స్, కంఫర్టెబుల్ సీటింగ్ దీని విశేషాలు.
Honda Stylo 160 launch date in India : హోండా స్టైలో 160 స్కూటర్లో.. 156.9 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుందని తెలుస్తోంది. ఇది.. 8,500 ఆర్పీఎమ్ వద్ద 15 బీహెచ్పీ పవర్.. 7,000 ఆర్పీఎమ్ వద్ద 13.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్‌తో స్వింగ్ ఆర్మ్‌ను కలిగి ఉంది. ఇందులో 220 ఎంఎం ఫ్రంట్ డిస్క్, 220 ఎంఎం రియర్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. ఇండోనేషియాలో విక్రయించే లోయర్ వేరియంట్లో.. 190 ఎంఎం ఫ్రంట్ డిస్క్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ యూనిట్ ఉన్నాయి. హోండా స్టైలో 160 స్కూటర్ తక్కువ వేరియంట్లలో సీబీఎస్.. పెద్ద వేరియంట్లలో ఏబీఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ లభిస్తున్నాయి. ఈ మోడల్ బరువు 118 కిలోలు.
అయితే.. ఏ దేశంలోనైనా పేటెంట్ నమోదు చేయడం వల్ల ఆ మోడల్ కచ్చితంగా లాంచ్ అవుతుందని చెప్పలేము. హోండా స్టైలో 160 స్కూటర్ని సమీప భవిష్యత్తులో విడుదల చేయడానికి పేటెంట్ పొంది ఉండొచ్చు.
Honda Stylo 160 in India : ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. హోండా ఇటీవల నమోదు చేసిన పేటెంట్ ఇదొక్కటే కాదు! ఈ సంస్థ ఇటీవలే.. సీబీ 500 హార్నెట్, సీబీఆర్500ఆర్ డిజైన్లకు పేటెంట్ చేసుకుంది.
ఏదిఏమైనా.. ఇండియాలో స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది కాబట్టి.. పేటెంట్ పొందిన హోండా స్టైలో 160 సైతం లాంచ్ అవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే దీని మీద అప్డేట్ వస్తుందని అంచనా వేస్తున్నాయి.
సంబంధిత కథనం