Royal Enfield Guerrilla 450 : అదిరిపోయేలా.. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్- లాంచ్ ఎప్పుడు?
Royal Enfield Guerrilla 450 price : రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 బైక్ లాంచ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ బైక్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Royal Enfield Guerrilla 450 launch date in India : రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్‌కి క్రేజీ న్యూస్! అదిరిపోయే డిజైన్‌తో ఓ కొత్త 450సీసీ బైక్‌ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది ఈ దిగ్గజ 2 వీలర్ తయారీ సంస్థ. దీని పేరు రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450. తాజాగా ఈ బైక్ భారత రోడ్ల మీద దర్శనమిచ్చింది. ఇక ఈ గొరిల్లా 450కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటి ద్వారా.. బైక్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. వాటిని ఇక్కడ చూసేయండి..
రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 బైక్..
గొరిల్లా 450 పేరును.. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఇటీవలే ట్రేడ్ మార్క్ చేసుకుంది. అప్పటి నుంచి ఈ బైక్‌పై చాలా బజ్ నెలకొంది. పేరుతోనే రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. ఇక స్పా షాట్స్‌ని చూస్తే.. ఈ కొత్త బైక్‌లో రౌండ్ ఎల్ఈడీ హెట్లైట్, సింగిల్ పాడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, సింగిల్ పీస సీట్ వంటివి కనిపిస్తున్నాయి. హిమాలయన్ 450లో ఉండే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో కనిపించకపోవచ్చు.
రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 ఫ్యుయెల్ టాంక్.. హిమాలయన్ 450 కన్నా భిన్నంగా కనిపిస్తోంది. హిమాలయన్ 450 (17 లీటర్ల కెపాసిటీ) కన్నా.. కొత్త బైక్‌లో ఇంకా తక్కువ కెపాసిటీ ఫ్యూయెల్ ట్యాంక్ ఉండొచ్చు. కానీ ఇది బైక్‌కి, డిజైన్‌కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది.
Royal Enfield Guerrilla 450 price in India : ఇక హార్డ్‌వేర్ విషయానికొస్తే.. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450.. హిమాలయన్ బైక్‌కి పూర్తిగా భిన్నంగా ఉండొచ్చు. ఇందులో.. టెలిస్కోపిక్ ఫ్రెంట్ ఫోర్క్స్, అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్‌లెస్ టయర్స్ వంటివి ఉంటాయి. స్టాండ్ కూడా చిన్నగా ఉంది. మొత్తం మీద చూసుకుంటే.. ఈ కొత్త గొరిల్లా 450 బైక్.. అర్బన్ రైడింగ్‌కి ఎక్కువ ఉపయోగపడే విధంగా కనిపిస్తోంది.
ఈ రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450లో 452 సీసీ షేర్పా సిరీస్ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 39.4 బీహెచ్పీ పవర్‌ని, 40 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ వంటివి ఉంటాయి. పర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
వీటితో పాటు.. ఈ కొత్త బైక్‌లో 5 ఇంచ్ రౌండ్ టీఎఫ్టీ స్క్రీన్, కనెక్టెడ్ టెక్నాలజీ, యాప్ ఆధారిత నేవిగేషన్, హెడ్‌ల్యాంప్- ఇండికేటర్స్, టెయిల్లైట్కి ఎల్ఈడీ లైటింగ్, అడ్వాన్స్డ్ స్విచ్‌గేర్ వంటివి రావొచ్చు.
రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 ధర ఎంత?
Royal Enfield Guerrilla 450 : రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 ధరపై ప్రస్తుతం ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు. కాగా.. హిమాలయ్ 450 ప్రారంభ ధర రూ. 2.85లక్షలుగా ఉంది. ఈ కొత్త బైక్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 2.40లక్షలుగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక.. ఈ కొత్త గొరిల్లా 450 బైక్ లాంచ్పైనా ప్రస్తుతం ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం