Vivo Y200 Pro : ఇండియాలో వివో వై200 ప్రో లాంచ్- ఫీచర్స్, ధర వివరాలివే!
21 May 2024, 15:30 IST
Vivo Y200 Pro India launch : వివో వై200 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ గ్యాడ్జెట్ ఫీచర్స్, ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వివో వై200 ప్రో
Vivo Y200 Pro 5G price : సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది దిగ్గజ టెక్ సంస్థ వివో. దీని పేరు.. వివో వై200 ప్రో. ఇదొక 5జీ డివైజ్. ఈ నేపథ్యంలో.. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
వివో వై200 ప్రో ధర..
వివో వై200 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్.. సిల్క్ గ్రీన్, సిల్క్ బ్లాక్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.24,999గా నిర్ణయించింది సంస్థ. నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, పార్ట్నర్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఎస్బీఐ కార్డ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఉపయోగించి కొనుగోలుదారులు రూ .2500 తక్షణ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ని పొందవచ్చు.
వివో ఇండియా కార్పొరేట్ స్ట్రాటజీ హెడ్ గీతాజ్ చన్నానా మాట్లాడుతూ, “వివో ప్రీమియం వై సిరీస్ సరసమైన ధరలో అద్భుతమైన డిజైన్లు, మెరుగైన కెమెరా పనితీరును అందించడంలో ప్రసిద్ది చెందింది. వై 200 ప్రో 5జీతో, మా యువ, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వినియోగదారులను వారి శైలికి సరిపోయే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శక్తివంతం చేసే స్మార్ట్‌ఫోన్‌ని తీసుకొచ్చాము. ఈ సెగ్మెంట్ ఫస్ట్ స్లిమ్ 3 డి కర్వ్డ్ డిస్ప్లే, అధునాతన సిల్క్ గ్లాస్ డిజైన్, మెరుగైన కెమెరా పనితీరు వై200 ప్రో 5జీ ప్రత్యేకంగా నిలిచేలా చేస్తుంది,” అని అన్నారు.
వైబ్రెంట్ అండ్ ట్రెండీ డిజైన్..
Vivo Y200 Pro 5G price in India : వివో వై200 ప్రో 5జీలో సిల్క్ క్లౌడ్ ఫెదర్ టెక్చర్ డిజైన్, 2.3 ఎంఎం ఫ్రేమ్, అల్ట్రా స్లిమ్ బాడీ ఉన్నాయి. ఇందులో 6.78 ఇంచ్ అమోఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లే, ఎఫ్హెచ్డీ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటివి ఉన్నాయి. దీని బరువు కేవలం 172 గ్రాములు. ఎస్జీఎస్లో బ్లూ లైట్ ఐ కేర్ సర్టిఫికేట్ పొందిన ఈ డిస్ప్లే వినియోగదారుల కళ్లను రక్షిస్తుంది.
వివో వై200 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో.. విలక్షణమైన కెమెరా డిజైన్‌లో హై క్వాలిటీ చిత్రాల కోసం 64 ఎంపీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) యాంటీ షేక్ నైట్ పోర్ట్రెయిట్ కెమెరా ఉంది. ఇది పర్సనలైజ్డ్ ఎక్స్‌పీరియెన్స్ కోసంబోకే ఫ్లేర్ పోర్ట్రెయిట్, మెరుగైన లో లైట్ ఫోటోగ్రఫీ కోసం సూపర్ నైట్ మోడ్‌ని కలిగి ఉంది. అప్‌గ్రేడ్ చేసిన OIS మాడ్యూల్ షేక్‌లను తగ్గిస్తుంది. తక్కువ కాంతిలో ఇమేజ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. అదనపు ఫీచర్లలో వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రెయిట్, వ్లాగ్ మూవీ క్రియేటర్ మోడ్, రిచ్ కెమెరా అనుభవం కోసం లైవ్ ఫోటో ఉన్నాయి.
స్ట్రాంగ్ బ్యాటరీ లైఫ్ అండ్ పెర్ఫార్మెన్స్..
Vivo Y200 Pro : వివో వై200 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉన్నాయి. ఫన్ టచ్ ఓఎస్ 14తో నడిచే ఈ ఫోన్లో 8 జీబీ ర్యామ్‌ని మరో 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. నాలుగేళ్ల బ్యాటరీ హెల్త్, 24 డైమెన్షన్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆక్టాకోర్ సీపీయూతో స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్స్‌లో అందుబాటులో ఉంది! టెక్ ప్రపంచం నుంచి ఎటువంటి అప్డేట్ని మీరు మిస్ కాకుండా ఉండటానికి హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.