తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme C65 5g Launch: రియల్ మి నుంచి అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్

Realme C65 5G launch: రియల్ మి నుంచి అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్

HT Telugu Desk HT Telugu

26 April 2024, 18:32 IST

google News
  • Realme C65 5G launch: చైనా దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మి నుంచి మరో బడ్జెట్ ఫోన్ భారతీయ మార్కెట్లో లాంచ్ అయింది. అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ఆకర్షణీయమైన లుక్ తో, అందుబాటు ధరలో ఈ రియల్ మీ సీ65 5జీ స్మార్ట్ ఫోన్ లభించనుంది. ఇందులో 120 హెర్ట్జ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రియల్ మీ సీ65 5జీ స్మార్ట్ ఫోన్
రియల్ మీ సీ65 5జీ స్మార్ట్ ఫోన్ (Realme)

రియల్ మీ సీ65 5జీ స్మార్ట్ ఫోన్

Realme C65 5G launch: కొన్ని వారాల ఊహాగానాల తర్వాత రియల్ మీ సీ65 5జీ (Realme C65 5G) మనదేశంలో లాంచ్ అయింది. రియల్ మి నార్జో 70, రియల్ మి నార్జో 70ఎక్స్ అనే మరో స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేసిన మరుసటి రోజే ఈ స్మార్ట్ ఫోన్ ను రియల్ మి లాంచ్ అయింది. రియల్మీ సీ65 5జీ స్మార్ట్ ఫోన్ లో 120 హెర్ట్జ్ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఫీచర్ల నుండి ధర వరకు, కొత్త రియల్ మి సి 65 5 జీ గురించి తెలుసుకోండి.

రియల్ మీ సీ65 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

రియల్ మీ సీ65 5జీ (Realme C65 5G) లో 6.7 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మరింత విస్తరించుకోవచ్చు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు సెకండరీ 2 మెగా పిక్సెల్ సెన్సార్ ను కూడా ఇందులో అందించారు. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

5000 ఎంఏహెచ్ బ్యాటరీ

రియల్ మీ సీ65 5జీ (Realme C65 5G) ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. 2 ఏళ్ల ఓఎస్ అప్ డేట్స్, 3 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్ లు ఉంటాయని కంపెనీ హామీ ఇచ్చింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ టైప్-సీ ద్వారా 15వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ పవర్ బ్రిక్ తో పనిచేస్తుంది. మన్నిక పరంగా, రియల్ మి సీ 65 5 జీ (Realme C65 5G) ధూళి, నీటి నిరోధకత కోసం ఐపీ 54 రేటింగ్ పొందింది.

రియల్మీ సీ65 5జీ ధర, లభ్యత

రియల్ మి సీ 65 5జీ (Realme C65 5G) మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది . 4 జీబీ +64 జీబీ వేరియంట్ ధర రూ.10499 కాగా, 4 జీబీ +128 జీబీ వేరియంట్ ధర రూ.11499. టాప్ ఎండ్ అయిన 6జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.12,499గా నిర్ణయించారు. ఏప్రిల్ 26 నుంచి బ్రాండ్ వెబ్ సైట్ తో పాటు ఫ్లిప్ కార్ట్, ఇతర ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. హెచ్ డీ ఎఫ్ సీ, యాక్సిస్, ఎస్బీఐ బ్యాంక్ కార్డు లావాదేవీలపై రూ.1000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

తదుపరి వ్యాసం