HDFC Bank Q4 Results: హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ క్యూ 4 నికర లాభాలు 16 వేల కోట్లు; డివిడెండ్ ఎంతంటే?-hdfc bank q4 results net profit at rs 16 512 crore dividend declared ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hdfc Bank Q4 Results: హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ క్యూ 4 నికర లాభాలు 16 వేల కోట్లు; డివిడెండ్ ఎంతంటే?

HDFC Bank Q4 Results: హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ క్యూ 4 నికర లాభాలు 16 వేల కోట్లు; డివిడెండ్ ఎంతంటే?

HT Telugu Desk HT Telugu
Apr 20, 2024 06:30 PM IST

HDFC Bank Q4 Results: 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ శనివారం ప్రకటించింది. క్యూ లో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ రూ. 16, 512 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. క్యూ 4 రిజల్ట్ తో పాటు డివిడెండ్ ను కూడా హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ ప్రకటించింది.

హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ క్యూ 4 రిజల్ట్స్
హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ క్యూ 4 రిజల్ట్స్

HDFC Bank Q4 Results: 2023-24 ఆర్థిక సంవత్సరానికి (Q4FY24) జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ ప్రకటించింది. అంతకుముందు డిసెంబర్ త్రైమాసికంలో (Q3FY24) సాధించిన నికర లాభమైన రూ .16,373 కోట్లతో పోలిస్తే Q4FY24 లో రూ .16,512 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ జూలైలో దాని మాతృ సంస్థ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) లో విలీనమైంది. అందువల్ల ఈ క్యూ 4 ఫలితాలను గత సంవత్సరం క్యూ 4 ఫలితాలతో పోల్చలేము.

క్యూ 4 లో తగ్గిన ఎన్పీఏలు

హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank) ఈ క్యూ 4 లో రూ.16,512 కోట్ల నికర లాభం ఆర్జించింది. బ్యాంక్ రిటైల్ రుణాలు 108.9 శాతం వృద్ధి చెంది, రూ.31,173 కోట్లకు చేరుకున్నాయి. బ్యాంక్ నికర ఎన్ పీఏలు రూ.8,091.7 కోట్లుగా ఉన్నాయి. మార్చి చివరి నాటికి స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.24 శాతంగా ఉండగా, మూడు నెలల క్రితం 1.26 శాతంగా ఉంది. అదేవిధంగా నికర ఎన్ పీఏలు 0.31 శాతం నుంచి స్వల్పంగా పెరిగి 0.33 శాతానికి చేరుకున్నాయి.

హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ క్యూ 4 ఆదాయం

హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ ఈ క్యూ లో తన అనుబంధ సంస్థ హెచ్ డీ ఎఫ్ సీ క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్ లోని తన వాటా విక్రయించింది. తద్వారా రూ .7,340 కోట్ల లాభం ఆర్జించింది. ఆ లాభం సహా బ్యాంక్ (HDFC Bank) నికర ఆదాయం రూ. 47,240 కోట్లకు పెరిగింది. హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ ప్రధాన నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ 4 లో రూ .29,080 కోట్లకు పెరిగింది. ఇతర ఆదాయం రూ .18,170 కోట్లకు పెరిగింది. మొత్తం ఆస్తులపై నికర వడ్డీ మార్జిన్ (NIM) 3.44 శాతంగా నమోదైంది.

డివిడెండ్

క్యూ 4 ఫలితాలతో పాటు షేర్ హోల్డర్లకు డివిడెండ్ (Dividend) ను కూడా హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేర్ పై మార్చి 31, 2024తో ముగిసిన సంవత్సరానికి రూ.19.5 ల డివిడెండ్ ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మొత్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank) మొత్తం రూ. 64,060 కోట్ల నికర లాభాలు ఆర్జించింది. శుక్రవారం బీఎస్ ఈలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ షేరు ధర 2.46 శాతం పెరిగి రూ.1,531.30 వద్ద స్థిరపడింది.

Whats_app_banner