శామ్ సంగ్ కొత్త ఫోన్.. 50 మెగా పిక్సెల్ కెమెరా.. 5,000 MH బ్యాటరీ.. ధరెంతంటే!
శాంసంగ్ కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్లో 6.5 అంగుళాల హెచ్‌డి+ ఇన్ఫినిటీ వి డిస్ప్లే అందించారు. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ ఎక్సినోస్ 850 చిప్సెట్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి.
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ జాబితాలో శాంసంగ్ కొత్త మోడల్‌ను చేర్చింది. Samsung Galaxy A04sతో మార్కెట్లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్లో 6.5 అంగుళాల హెచ్‌డి+ ఇన్ఫినిటీ వి డిస్ప్లే అందించారు. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ ఎక్సినోస్ 850 చిప్సెట్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ (ఎంపీ). ఇందులో 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీ కెమెరా 5 మెగా పిక్సెల్‌తో అందించారు.
ఈ ఫోన్ one UI ఆండ్రాయిడ్ 12తో నడుస్తుంది. ఈ ఫోన్ 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఇది 8 జీబీ ర్యామ్ వరకు విస్తరించగలదు. స్టోరేజీ టిబి వరకు ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ రెండు రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ పవర్ బటన్‌తో వస్తుంది. బ్లాక్, కాపర్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. దీని ధర రూ.13,499గా ఉంది. శాంసంగ్ అధికారిక వెబ్సైట్, ఆన్లైన్ షాపింగ్ సైట్లు, స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. నలుపు, రాగి, గ్రీన్ వంటి మూడు కలర్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ఆఫర్లు
శామ్సంగ్ గెలాక్సీ ఎ04ఎస్ ధర 13,499 రూపాయలు. దీనిని Samsung.com, స్యామ్ సంగ్ రిటైల్ స్టోర్లు, ప్రముఖ ఆన్ లైన్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బిఐ బ్యాంక్, వన్ కార్డ్, స్లైస్ కార్డులను ఉపయోగించి ఫోన్ కొనుగోలు చేస్తే కంపెనీ రూ. 1,000 తక్షణ క్యాష్బ్యాక్ ఇస్తోంది.